Big Tv Live Originals: దేశ వ్యాప్తంగా రోజూ లక్షలాది మంది రైల్వే ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకర ప్రయాణం చేసేందుకు రైలును సెలక్ట్ చేసుకుంటారు. ప్రయణ సమయంలో మరింత కంఫర్ట్ గా ఉండేందుకు చాలా మంది లోయర్ బెర్త్ కోసం ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, ఇతర సమస్యలలో బాధపడుతున్న వాళ్లకు లోయర్ బెర్త్ అనుకూలంగా ఉంటుంది. ఈజీ యాక్సెస్ తో పాటు చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే, చాలా మంది ప్రయాణీకులు లోయర్ బెర్త్ కోసం ఎక్కువగా ట్రై చేస్తుంటారు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లోయర్ బెర్త్ పొందే అవకాశాలు ఎలా పెంచుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
లోయర్ బెర్త్ కోసం పాటించాల్సిన టిప్స్
⦿ లోయర్ బెర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి
రైల్వే టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణీకులు తమకు నచ్చిన బెర్త్ ను ఎంచుకునే ఆప్షన్ ను రైల్వే అనుమతిస్తుంది. బెర్త్ ప్రిఫరెన్స్ విభాగంలో లోయర్ బెర్త్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన కచ్చితంగా లభిస్తుందని చెప్పలేం. సీట్లు లభ్యత ఆధారంగా బెర్తులు కేటాయించబడుతాయి.
⦿ సీనియర్ సిటిజన్, మహిళల కోటా వాడుకోండి
సీనియర్ సిటిజన్ కోటా కింద 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు సీనియర్ సిటిజన్ కోటాలో లోయర్ బెర్త్ ను పొందే అవకాశం ఉంటుంది. కొన్ని లోయర్ బెర్త్ లు ఒంటరిగా ప్రయాణించే మహిళలకు లేదంటే 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్రయాణించే మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ కోటా ఎక్కువగా స్లీపర్ క్లాస్, థర్డ్ ACకి వర్తిస్తుంది.
⦿ ముందుగానే టికెట్ బుక్ చేసుకోండి
రైల్వే రిజర్వేషన్ 60 రోజుల ముందుగానే మొదలవుతుంది. వీలైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంటుంది.
⦿ AC కోచ్ లను ఎంచుకోండి
స్లీపర్ క్లాస్ (SL), థర్డ్ AC (3AC) తో పోలిస్తే సెకండ్ AC (2AC), ఫస్ట్ AC (1AC) లలో బుక్ చేసుకునే ప్రయాణీకులకు లోయర్ బెర్త్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం క్లాసులలో లోయర్ బెర్త్ లకు డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది.
⦿ సైడ్ లోయర్ బెర్త్ కోసం ట్రై చేయండి
రెగ్యులర్ లోయర్ బెర్త్ లు అందుబాటులో లేకపోతే, సైడ్ లోయర్ బెర్త్ (SLB) ఎంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ బెర్త్ లు కోచ్ పక్కన ఉంటాయి. సాధారణ లోయర్ బెర్త్ కు సమానమైన సౌకర్యాన్ని కలిగిస్తాయి.
Read Also: మనం రైలు కొనేయొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్.. ఇండియాలో సాధ్యమేనా?
⦿ TTEతో మాట్లాడి బెర్త్ మార్చుకోండి
బుకింగ్ సమయంలో మీరు లోయర్ బెర్త్ పొందలేకపోయినా, మీరు బోర్డింగ్ తర్వాత రైలు టికెట్ ఎగ్జామినర్ (TTE)ను అడిగి పొందే అవకాశం ఉంటుంది. కొంతమంది చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల లోయర్ బెర్త్ అందుబాటులోకి వస్తే.. TTEని అడిగి మార్చుకోవచ్చు.
Read Also: కొద్ది రోజులు ఊటీ, కొడైకెనాల్ వెళ్లొద్దు.. ఎందుకంటే?