Ooty – Kodaikanal Vehicle Restrictions: సమ్మర్ వచ్చిందంటే చాలా మంది ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. హిల్ స్టేషన్లలో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తారు. కానీ, ఈసారి పర్యాటకులకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. పర్యాటక వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు ఏప్రిల్ 1 నుంచి ఆమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఊటీలోకి వీక్ డేస్ లో 6,000 వాహనాలు, వీకెండ్స్ లో 8,000 వాహనాలు మాత్రమే అనుమతిస్తారు.ఇక కొడైకెనాల్ లోనూ వీక్ డేస్ లో 4,000 వాహనాలు, వీకెండ్స్ లో 6,000 వాహనాలకు అనుమతి ఉంటుంది. పర్యాటక సీజన్ పీక్ అయిన జూన్ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించింది. లోకల్ వెహికిల్స్ కు సంబంధించి ఎలాంటి పరిమితులు ఉండవన్నది. ఈ-పాస్, గ్రీన్ టాక్స్ తనిఖీల కోసం మెట్టుపాళ్యం సమీపంలోని మెయిన్ ఎంట్రీ పాయింట్, కల్లార్ చెక్ పోస్ట్ దగ్గర బూమ్ బారియర్ ఏర్పాటు చేశారు. అక్కడ అవసరమైన మాన్యువల్ తనిఖీలు తగ్గుతాయి. చెక్ పోస్టుల దగ్గర క్యూలు కూడా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ-పాస్ కు వ్యతిరేకంగా బంద్
అటు నీలగిరి జిల్లా ట్రేడర్స్ అసోసియేషన్ తాజా ఆంక్షలు, ఈ-పాస్‌కు వ్యతిరేకంగా ఏప్రిల్ 2న పూర్తి బంద్ నిర్వహించింది. హోటళ్ళు, లాడ్జీలు, రిసార్ట్స్, ఇతర వాణిజ్య సంస్థలు మూసివేశారు. ఆటోలు, పర్యాటక వాహనాలు కూడా నిలిపివేశారు. కొన్ని రోజుల క్రితం, వాహనాలపై పరిమితులను ఎత్తివేయాలని కోరుతూ హోటళ్ల యజమానులు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆంక్షలు లేకపోవడం పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు.
సినిమా షూటింగులపైనా నిషేధం
సిమ్స్ పార్క్, గవర్నమెంట్ రోజ్ గార్డెన్, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ తో సహా ఊటీలోని ఎనిమిది ప్రధాన తోటలలో మే వరకు సినిమా షూటింగ్ లను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాలలో పర్యాటకులపై పీక్ సీజన్ లో ఎలాంటి పరిమితులు ఉండవని తెలిపింది. మే 3 నుంచి ఊటీ, కోటగిరిలో కూరగాయలు, పువ్వులు, సుగంధ ద్రవ్యాల ప్రదర్శనలు కూడా ప్రారంభమవుతాయి.
ఈపాస్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలోలంటే?
ఊటీ ఫ్లవర్ షోను చూడాలని భావిస్తే, ఈపాస్ తో పాటు టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్యాటకులకు ఈ చిట్కాలు పాటిండం వల్ల ఈజీగా ఈపాస్ పొందడంతో పాటు హ్యాపీగా టూర్ ను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.
⦿ మీరు ఈ-పాస్ ద్వారా ఇబ్బంది పడకూడదనుకుంటే, తమిళనాడు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు లేదంటే రైళ్లను సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. కొంతమంది ప్రయాణీకులు తమ వాహనాలను నిషేధిత జోన్ వెలుపల పార్క్ చేసి అక్కడి నుంచి ఊటీకి షటిల్ సేవల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించడం మంచిది.
⦿ ఊటీలోని అనేక ప్రాంతాలకు కాలి నడక ద్వారా వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ నడకను ఇష్టపడితే పలు ప్రదేశాలను నడుచుకుంటూ వెళ్లి చూడవచ్చు.
⦿ ఒకవేళ ఊటీ ఫ్లవర్ షోను చూడాలి అనుకుంటే, ఈపాస్‌తో పాటు టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలి. ఈ లింక్ ను(https://www.ootygardens.org/onlinebooking/ticketbooking.php) ఓపెన్ చేసి పాస్, టికెట్లు పొందే అవకాశం ఉంటుంది.
Read Also: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ఖర్చులో వెళ్లొచ్చే దేశం ఇదే!