Norovirus Outbreak: నోరో వైరస్ కలకలం రేపుతోంది. క్వీన్ మేరీ 2 లగ్జరీ షిప్‌లో ఈ వైరస్ కారణంగా 200 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. ఈ విషయాన్ని సిబ్బంది యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రీవెన్షన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే.. కునాడ్ క్వీన్ మేరీ నౌకలో దాదాపు 2538 మంది ప్రయాణికులు ప్రయాణించారు. వీరిలో 235 కి పైగా నోరో వైరస్ బారిన పడ్డారు. వీరిలో 183 మంది అతిథులు, 14 మంది నౌక సిబ్బంది యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రీవెన్షన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ వైరస్ బారిన పడిన వారికి వాంతులు, విరోచనాలతో పాటు కడుపు నొప్పితో బాధపడ్డారు. ఈ వైరస్‌ను వామిటింగ్ బాగ్ అని కూడా పిలుస్తారు. ఈ నోరో వైరస్ అతి త్వరగా వ్యాప్తి చెందిన పెద్ద ప్రమాదం ఏమి లేదని అంటున్నారు పరశోధకులు.
క్వీన్ మేరీ 2 నౌకలో అతి తక్కువ మంది అతిథులు ఉన్నారని.. వారిలో జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు కునాడ్ నౌకకు సంబంధించిన ప్రతి నిధులు తెలుపుతున్నారు. వైరస్ బారినుంచి బయటపడేందుకు నౌకలు అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. నౌకలోని అతిథులను ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్ నిర్వహించడంతో పాటు నౌకలోని అన్ని ప్రాంతాల్లో శానిటైజర్‌తో శుభ్రపరుస్తున్నారు.
వైరస్ చాలా తక్కువ లక్షణాలను కలిగి ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. వైరస్ సోకిన వారిలో వ్యాధి ప్రభావం వారం రోజుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. వైరస్ బారిన పడిన వారికి క్వారెంటైన్ కు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇలా వైరస్ సోకడం కొత్తేమి కాదని 2019లో కూడా అతి తక్కువ మంది.. నోరో వైరస్ బారిన పడినట్లు రికార్డులు ఉన్నాయని సీడీసీ ప్రతినిధులు తెలిపారు. ఇంగ్లాండ్ లోని సౌత్ ఆంగస్టన్ నుంచి న్యూయార్క్ మీదుగా కరేబియన్ దీవులకు పయనమైన విలాసవంతమైన నౌకలో ఈ వైరస్ సోకింది.
అయితే క్రూయీజ్ నౌక ప్రయాణాల్లో ఇలాంటి ఆనారోగ్య పరిస్థితులు.. చాలా అరుదుగా జరుగుతాయని నౌక ప్రతినిధులు తెలిపారు. అలాగే మహాసముద్రాలగుండా ప్రయాణిస్తున్న వారిలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా తక్కువని చెబుతున్నారు. ఈ వైరస్ ప్రాణాంతకమేమి కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. కోవిడ్ పోయింది.. ఇప్పుడు దాని ప్లేస్‌లో మరో కొత్త వైరస్ చేరింది.. అది కూడా చైనాలో కాదు.. రష్యాలో. ఇప్పుడు రష్యాలో పరిస్థితి వేగంగా దిగజారుతోంది.. ప్రజలు జ్వరం, బాడీపెయిన్స్, దగ్గు, కొందరికి దగ్గేప్పుడు రక్తం పడటం.. ఇలా రకరకాలుగా జరుగుతోంది ప్రచారం. అయితే ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు రష్యా అధికారులు. మిస్టరీ వైరస్, కొత్త వైరస్ ఏం లేదు.. ఇవి సాధారణ సీజనల్ వ్యాధులే అంటూ క్లారిటీ ఇచ్చారు.
Also Read: ట్రంప్ కీలక నిర్ణయం..భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు
దెయ్యం కంటే భయం మా చెడ్డది అన్నట్టు కరోనా పుణ్యమా అని.. ఒకేసారి ఒకే ఏరియాలో ఎక్కువమంది ఆరోగ్యం దెబ్బతింటే.. ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పుడు రష్యా కొత్త వైరస్ పరిస్థితి కూడా అలాంటిదే. రష్యాలో కొన్ని రోజుల నుంచి కొందరు ప్రజలు తీవ్రమైన జ్వరం, దగ్గు, బాడీ పెయిన్స్‌తో ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులైనా తగ్గకపోవడంతో ఇక అక్కడి సోషల్ మీడియాలో వదంతులు ప్రారంభమయ్యాయి. అవి కాస్త వైరల్‌గా మారి వరల్డ్ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారాయి.
ఇలా జబ్బు పడిన వారిని ఐసోలేట్ చేసి కోవిడ్ టెస్ట్‌లు జరిపారు. కానీ రిజల్ట్స్ మాత్రం నెగటివ్‌గా వస్తున్నట్టు చర్చ జరుగుతోంది. కొంతమందికి దగ్గు వచ్చినప్పుడు రక్తం కూడా పడుతుండటంతో ఈ కలకలం పెరిగింది. ముఖ్యంగా అలెగ్జాండ్ర అనే మహిళ తనకు దగ్గుతున్నప్పుడు రక్తం వస్తుందని సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఆమెకు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్టు గుర్తించారు డాక్టర్లు. ఇప్పటి వరకు తాము ఎలాంటి కొత్త వైరస్‌ను గుర్తించలేదని.. ఒకవేళ గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నారు రష్యన్ పెద్దలు.