Malaysia Trip: మలేషియా ఆగ్నేయాసియాలో ఒక అందమైన దేశం. ఇండియాలోని చాలా మంది ఈ దేశానికి వెళ్లడానికి ఇష్టపడతారు. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి విదేశాలు వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటే.. మలేషియా బెస్ట్ ప్లేస్. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడి ప్రభుత్వం విదేశీ పర్యాటకుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. భారతీయ పర్యాటకులకు మలేషియా వెళ్లడానికి వీసా అవసరం లేదు. మలేషియా పర్యాటకులకు వీసా రహిత ప్రయాణం 30 రోజుల వరకు ఉంటుంది. మీరు ఈసారి సమ్మర్‌లో విదేశాలకు వెళ్లాలంటే.. మలేషియా వెళ్లొచ్చు.
ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు మలేషియాకు వెళ్తారు. ఇక్కడ నైట్ లైఫ్, బీచ్‌లు, షాపింగ్ ఏరియాలు పర్యాటకులను తెగ ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రదేశాల యొక్క అందం మీ హృదయాన్ని దోచుకుంటుంది. అంతేకాకుండా.. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ప్రయాణించడం చాలా చౌక. ఇది మీ బడ్జెట్‌లో సులభంగా సరిపోతుంది. కాబట్టి ఇంకేమీ ఆలోచించకండి.. మీ కుటుంబం, స్నేహితులతో ఇక్కడకు ఒక ట్రిప్ ప్లాన్ చేసి..వెళ్లండి. మలేషియాలో ఎలాంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పెనాంగ్ :
మలేషియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్ పెనాంగ్. ఈ ప్రదేశం కొండలు, అడవితో కూడి ఉంటుంది. ఈ ప్రదేశాన్ని బుకెట్ బండేరా అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఈ ప్రదేశం జార్జ్‌టౌన్ కంటే 15 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఇక్కడ స్నేక్ టెంపుల్ , కేక్ లోక్ సి టెంపుల్ ఉంటాయి. వాటి అందం మీ మనసును దోచుకుంటుంది.
కోటా కినాబాలు:
అందమైన నగరాలు, పర్వతాలు, ద్వీపాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశానికి కినాబాలు పర్వతం పేరు పెట్టారు. ఇక్కడి పచ్చని పర్వతాలు, సరస్సులకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇది ఒక పర్వతం అయినప్పటికీ.. ఇక్కడి జీవకళ ఎప్పుడూ తగ్గదు. ఈ ప్రదేశం పట్టు చీరలు, బంగారు ఆభరణాలు, కోట రాయికి కూడా చాలా ప్రసిద్ధి చెందింది.
తమన్ నెగర:
తమన్ నెగరా మలేషియాలోని రెయిన్‌ఫారెస్ట్ రక్షిత ప్రాంతం. ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఈ ప్రదేశం ఒక సాహస యాత్ర లాంటిది. తమన్ నెగర వివిధ రకాల రంగు రంగుల పక్షులకు నిలయం. వీటిని చూడటం వల్ల మీ మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. ఇక్కడ సున్నపురాయి గుహలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశం మీకు ప్రశాంతతను అందిస్తుంది.
మలక్కా:
మలక్కా ఒక వాణిజ్య నౌకాశ్రయం. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. ఇది బీచ్ మాత్రమే కాదు.. పురాతన భవనాల కారణంగా ఈ ప్రదేశం ప్రజలను ఆకర్షించే ప్రధాన కేంద్రంగా కూడా ఉంది. ఈ ఓడరేవు గతంలో అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రసిద్ధ కేంద్రంగా ఉండేది.ప్రస్తుతం మలేషియాలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా మారింది.
Also Read: పచ్చటి తోటలు, జలపాతాలు మరెన్నో అందాలు ఏపీ సొంతం !
భారతదేశం నుండి మలేషియా ఎలా చేరుకోవాలి ?
భారతదేశం నుండి మలేషియాకు రైళ్ల సర్వీసులు లేవు. కాబట్టి మీరు విమానంలో మాత్రమే మలేషియా చేరుకోవచ్చు. ఇండియా- మలేషియా మధ్య దూరం దాదాపు 3000 కిలోమీటర్లు. ఢిల్లీ, ముంబై కోల్‌కతా.. బెంగళూరు నుండి మలేషియా కౌలాలంపూర్‌కు అనేక విమానాలు ఉంటాయి.