BigTV English

Bellamkonda Srinivas : రాంగ్ రూటులో బెల్లంకొండ శ్రీనివాస్ కారు హల్ చల్.. కానిస్టేబుల్ పైకి..

Bellamkonda Srinivas : రాంగ్ రూటులో బెల్లంకొండ శ్రీనివాస్ కారు హల్ చల్.. కానిస్టేబుల్ పైకి..

Bellamkonda Srinivas : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతమైన భైరవం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 30న థియేటర్లలోకి రాబోతుంది.. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ ఫోకస్ పెట్టారు.. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు హీరో.. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ వార్తల్లో నిలిచాడు. నేడు శ్రీనివాస్ కార్ లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో వెళ్లి హల్చల్ చేసాడు. రాంగ్ రూట్ లో కార్ తో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు శ్రీనివాస్. కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయడంతో సైలెంట్ గా వెళ్ళిపోయాడు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


కానిస్టేబుల్ పై దూసుకెళ్లిన హీరో కారు..

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూటులో వచ్చాడని తెలుస్తుంది. అయితే అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైకి దూసుకువచ్చింది. ఆ కానిస్టేబుల్ కారు ఆపి రాంగ్ రూటు గురించి మాట్లాడుతుండగా నే హీరో కారును స్పీడుగా వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. రాంగ్ రూటులో రావడంతో పాటుగా కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించడం తో అతని పై కేసు నమోదు అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన పై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి కేసులో ఇరుక్కుంటే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..


Also Read :వివాదంలో కోలీవుడ్ హీరో..సినిమాలోని పాటపై హిందువులు ఆగ్రహం..

భైరవం మూవీ.. 

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఖాతాలో గత కొన్నేళ్లుగా హిట్ సినిమా పడలేదు. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ హీరో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈనెల 30న ఈ హీరో నటించిన భైరవం సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.. యాక్షన్ ఎంటర్ టైనర్ `భైరవం`. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని కీలక పాత్రల్లో మంచు మనోజ్‌, నారా రోహిత్ నటిస్తున్నారు. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ మూవీలో హీరోయిన్‌లుగా అదితి శంకర్‌, ఆనంది, దివ్య పిళ్లై నటించారు. చాలా రోజులుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది.. మొత్తానికి ఈ మూవీ వరుస అప్డేట్స్ లతో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. మరి సినిమా ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి.. ఇక ఆ తర్వాత టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపూరి.. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×