Rishabh Pant: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టును ఓడించి భారత క్రికెట్ జట్టు వరుసగా రెండవ ఐసీసీ టైటిల్ ని సొంతం చేసుకుంది. ఆదివారం రోజు రాత్రి దుబాయిలో జరిగిన ఈ ఘనవిజయం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. పటిష్టమైన న్యూజిలాండ్ జట్టును ఓడించి సగర్వంగా ఛాంపియన్ ట్రోఫీని సాధించింది భారత్. కోట్లాది మంది అభిమానులను మురిపించింది.
Also Read: Dhoni Biryani Controversy: హైదరాబాద్ బిర్యానీ కోసం ధోని హోటల్ మారిపోయాడు.. అంబటి సంచలనం !
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కేప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 83 బంతుల్లో 76 పరుగులు చేజింగ్ ని సులభం చేశాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు టీమ్ ఇండియా క్రికెటర్ల ఫ్యామిలీలు హాజరయ్యాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జుడేజాల లైఫ్ పార్ట్నర్స్, పిల్లలు మ్యాచ్ తిలకించారు. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా తమ భార్యలను హగ్ చేసుకున్నారు.
రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం భార్య వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ లతో సెలబ్రేట్ చూసుకున్నాడు. ఈ మ్యాచ్ చూసేందుకు జడేజా భార్యతో పాటు కూతురు కూడా వచ్చింది. ఈ క్రమంలో కప్ సాధించిన ఆనందంలో సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు భారత ప్లేయర్లు. ఈ నేపథ్యంలో జడేజా కూతురితో కలిసి వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరదాగా ఆడుకున్నాడు. ఆ చిన్నారి వెనుక పరుగెత్తుతున్న క్యూట్ మూమెంట్స్ నీ కెమెరా కన్ను క్యాప్చర్ చేసింది.
దీంతో జడేజా కూతురితో రిషబ్ పంత్ సరదాగా ఆడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంతరం విరాట్ కోహ్లీ షాంపైన్ బాటిల్ తీసుకొని రిషబ్ పంత్ పై స్ప్రే చేశాడు. అనుకోకుండా దొరికిపోయిన పంత్ ఆశ్చర్యానికి గురవుతూ ఉండగా.. కోహ్లీ అతడిని సరదాగా ఎగతాళి చేయడం స్టేడియంలో ఉన్న వారిని నువ్వులు పూయించింది. అదే సమయంలో హర్షిత్ రానా కూడా విరాట్ కోహ్లీకి తోడు వచ్చి మరింత మజాను తీసుకువచ్చాడు.
ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలుపును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ లో అభిమానులు రోడ్ల మీదికి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నీ ఘనత భారత్ క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. ఇక గణాంకాల ప్రకారం భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ని సుమారు 80 కోట్ల మందికి పైగా ప్రజలు వీక్షించారు. ఈ క్రికెట్ వ్యూయర్షిప్ గణాంకాలు విష్మయానికి గురిచేసాయి. ప్రపంచవ్యాప్తంగా 16 నుండి 69 సంవత్సరాల వయసు ఉన్నవారు వీక్షకుల్లో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఓ అంచనా ప్రకారం సుమారు 100 కోట్ల మంది వివిధ మాధ్యమాల ద్వారా ఈ ఫైనల్ మ్యాచ్ ని వీక్షించారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">