Geece Floating bridge: అవసరం ఆలోచనలకు కారణం అవుతుంది. ఆలోచనలు అద్భుతాలను సృష్టిస్తాయి. అచ్చంగా ఇలాంటి ఆలోచనతోనే రూపొందింది ఇప్పుడు మనం చెప్పుకబోయే వంతెన. పడవను వంతెనగా మార్చి రెండు రహదారులను కలపడంతో పాటు నదిలో నౌకలు వెళ్లేలా అవకాశం కల్పిస్తోంది. వినడానికే అద్భుతంగా అనిపిస్తుంది కదా.. అవును. ఈ అద్భుతమైన బ్రిడ్జి గ్రీస్ లో ఉంది. సుమారు రెండు దశాబ్దాలుగా ఈ బ్రిడ్జి సేవలను అందిస్తోంది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2002లో తేలియాడే వంతెన ప్రారంభం
గ్రీస్ లో ఏకైక తేలియాడే వంతెన అగియా మావ్రా బ్రిడ్జిజ లెఫ్కాడా ద్వీపాన్ని కలిపేందుకు అగియా మావ్రా దగ్గర ఈ బ్రిడ్జిని నిర్మించారు. 2002లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోని ఇంజినీరింగ్ అద్భుతాల్లో ఇది ఒకటిగా నిలిచింది. అగియా మావ్రా, లెఫ్కాడా ద్వీపాన్ని ఈ బ్రిడ్జి కలుపుతుంది. 1985లో ఆమోదించబడిన లెఫ్కాడా ప్రిఫెక్చురల్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం దీనిని నిర్మించారు. అయోనియన్ సముద్రంలో భాగమైన లెఫ్కాడా ద్వీపాన్ని కలిపేందుకు అప్పట్లో కట్టెలతో కూడిన వంతెనను ఏర్పాటు చేశారు. ఎవియాతో పాటు, గ్రీస్‌లోని మిగిలిన ప్రాంతాలకు రోడ్డు ద్వారా అనుసంధానించబడిన రెండు గ్రీకు దీవులలో ఇది ఒకటి. ఈ వంతెన ద్వీపానికి, ఇతర ప్రాంతాలకు రవాణాను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చారిత్రక ప్రాముఖ్యతను కొనసాగిస్తూ 2002లో ఈ అత్యాధునిక పడవ వంతెనను రూపొందించింది అక్కడి ప్రభుత్వం. ఇది చూడ్డానికి అచ్చం పడవ లాగే కనిపిస్తుంది.
The floating bridge of Agia Mavra in action pic.twitter.com/1yuSODkRbZ
— Historic Vids (@historyinmemes) October 18, 2024
25 మీటర్ల పొడవు.. 19 మీటర్ల వెడల్పు
ఈ వంతెన ఇరు ప్రాంతాలను కలపడంతో పాటు పడవలు వెళ్లేందుకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. పడవలు రాని సమయంలో ఇరు ప్రాంతాలను కలిపేందుకు ఈ తేలియాడే బ్రిడ్జి ఉపయోగడపుతుంది. ఈ వంతెన 25 మీటర్ల పొడవు, 19 మీటర్ల వెడల్పు ఉంటుంది. 3 మీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ సమయం ఇరు ప్రాంతాలను కలుపుతూ రోడ్డుగా ఉపయోగపడుతుంది. ఓడవలు వచ్చిన సమయంలో వెళ్లేందుకు వీలుగా ఈ బ్రిడ్జి పక్కకు జరిగి దారి ఇస్తుంది. ప్రపంచంలో ఆకట్టుకునే వంతెననలో ఒకటిగా గుర్తింపుత ఎచ్చుకుంది. అటు గ్రీస్ లో 2004 ఆగస్టులో ప్రారంభించబడిన రియో ఆంటిరియో వంతెన ప్రపంచంలోనే అతి పొడవైన కేబుల్ స్టే వంతెనగా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయంటే?
ఆసియాలో తొలి నిలువు లిఫ్ట్ వంతెన
ఇండియాలోనూ రీసెంట్ గా ఓ అద్భుతమైన వర్టికల్ లిప్ట్ వంతెనను రూపొందించారు. రామేశ్వరంలోని పంబన్ లో సముద్రం మీద ఈ వంతెనను నిర్మించారు. 2.05 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సరికొత్త పంబన్ వంతెన ఆసియాలోనే మొట్టమొదటి నిలువు లిఫ్ట్ వంతెన కావడం విశేషం. ఇది రైలు వెళ్లే సమయంలో ట్రాక్ లా ఉపయోగపడుతుంది. పడవలు వెళ్లే సమయంలో నిలువుగా పైకి లిఫ్ట్ అవుతుంది. రెండు రకాలుగా ఈ వంతెన ఉపయోగపడుతుంది. త్వరలోనే ఈ వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెనను ఓపెన్ చేసిన తర్వాత మండపం నుంచి పంబన్ ద్వీపానికి కేవలం 5 నిమిషాల్లో రైళ్లు ప్రయాణం పూర్తి చేస్తాయి. పాత వంతెన మీదుగా సుమారు అరగంట టైమ్ పడుతుంది.
Read Also: పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ ట్రైన్, ముహూర్తం ఫిక్స్ చేసిన ఇండియన్ రైల్వే!