NRI Woman case updates: విశాఖలో సంచలనం రేపిన ఎన్నారై డాక్టర్ మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్‌గా డాక్టర్ శ్రీధర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తు ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అమెరికాలో సెటిలైన రోజా అనే ఎన్నారై మహిళ ఈ నెల ఆరున విశాఖలోని హోటల్ మేఘాలయలో అనుమానాస్పదంగా మృతి చెందింది. హోటల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని కృష్ణా నగర్‌కు చెందిన శ్రీధర్ అమెరికాలో ఉంటున్నాడు.
కొన్నాళ్ల కిందట అమెరికాలో రోజాను శ్రీధర్ పరిచయం చేసుకున్నాడు. అమెరికా నుంచి ఫిబ్రవరి 14న విశాఖకు వచ్చింది రోజా. ఫిబ్రవరి 18న శ్రీధర్ వచ్చాడు. ఈనెల 6న తనను కలవాలని రోజాపై శ్రీధర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. 6న మధ్యాహ్నం ఒంటిగంట 40 నిమిషాలకు హోటల్ రూమ్‌కి ఆమె వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు రిసెప్షన్‌కు శ్రీధర్ వెళ్లాడు.
రూమ్ డోర్ లాక్ అయిందని ఓపెన్ చేయాలని హోటల్ సిబ్బందిని అడిగాడు. గదికి వెళ్తుండగానే శ్రీధర్ బిగ్గరగా ఏడ్చాడని హోటల్ మేనేజర్ తన ఫిర్యాదులో చెప్పాడు. గదిలో ఉన్న రోజా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు హోటల్ సిబ్బందికి శ్రీధర్ చెప్పాడు. రోజాను నిద్రలేపడానికి ప్రయత్నించినా ఆమె స్పందించలేదని శ్రీధర్ వెర్షన్. గది తలుపు తెరిచినప్పుడు రోజా వాష్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వెల్లడించాడు.
ALSO READ: చంపి ఏం సాధించారు? ప్రణయ్ పేరెంట్స్ భావోద్వేగం
అయితే ద్వారకానగర్‌లోని ఓ ప్రైవేటు స్థలం లీజ్ అగ్రిమెంటు చేసుకోవడానికి అమెరికా నుంచి రోజా వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీధర్ గదిలో రోజా కూడా ఉంది. ఇరువురు మధ్య ఏం జరిగిందో తెలీదు.ఎంతసేపటికీ రోజా బయటకు రాలేకపోవడంతో డాక్టర్ శ్రీధర్ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.
ఈ కేసుకు సంబంధించి రేపోమాపో పోస్టుమార్టం నివేదిక రానుంది. దాని తర్వాత ఆత్మహత్య? హత్యా అనేది తేలనుంది. దీని ఆధారంగా డాక్టర్ శ్రీధర్ ను విచారించాలని భావిస్తున్నారు పోలీసులు. మరి ఇప్పుడైనా పోలీసులు ఏం జరిగిందో బయటకు చెబుతారా? లేకుంటే గోప్యంగా ఉంచుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.