Pawan Kalyan on Nitish Kumar: నితీష్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ పేరే వినబడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారత సీనియర్ క్రికెటర్లు చెత్తులెత్తేసిన వేళ నితీష్ కుమార్ రెడ్డి అదరహో అనిపించాడు. అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఆసీస్ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్ని సెంచరీ చేశాడు. బుల్లెట్ మాదిరిగా బాల్స్ దూసుకువచ్చి.. శరీరాన్ని గాయపరుస్తున్నా.. లెక్కచేయకుండా తాను చేసిన పోరాటానికి వావ్ అనాల్సిందే. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పిచ్‌లో పాతుకుపోయి వీలైనప్పుడుల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు.
చుట్టుముట్టిన ఆసీస్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిస్తూ.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అందుకే ఇవాళ దేశమంతా నితీష్ కుమార్ రెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు. అభినందనల వెల్లువ కొనసాగుతోంది. నితీష్ కుమార్ రెడ్డి సాధించిన ఈ సెంచరీ.. అతని వ్యక్తిగత కెరీర్‌కు మాత్రమే కాదు.. అతనిలాంటి యువ క్రీడాకారులకు ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. ఈ విజయంలో కనిపించే హీరో నితీష్ కుమార్ రెడ్డి అయితే.. కనిపించని మరో హీరో అతని తండ్రి ముత్యాల రెడ్డి అని చెప్పవచ్చు.
నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ గురించి పలువురు కీలక వ్యక్తులు స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నితీష్ కుమార్ రెడ్డిపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘నితీష్ కుమార్.. నువ్వు భారతదేశంలో ఏం ప్రాంతం నుంచి వచ్చావ్ అనే దాని కంటే దేశం గర్వించేలా ఏం చేశామన్నదే ముఖ్యం. నువ్వు మున్ముందు ఇలాంటి రికార్డులు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను. భారత్ పతాకాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఎంతో మందికి స్పూర్తిగా నిలవాలి’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
సీఎం చంద్రబాబు కూడా నితీష్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. భవిష్యుత్తులో ఇలానే మరింత ముందుకెళ్లాలని సూచించారు. ‘‘బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న క్రికెట్ నాలుగో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Also Read: Teaching Jobs: గుడ్ న్యూస్.. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ ఉద్యోగాలు..
ఇంకా పలువురు కీలక వ్యక్తులు నితీష్ కుమార్ రెడ్డి పొగడ్తలతో ప్రశింసిస్తున్నారు. కీలక సమయంలో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకంగా మారాడు.