E-Paper
Advertisement

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నర్సాపురం వరకు వందే భారత్ రైలు పొడిగింపు

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నర్సాపురం వరకు వందే భారత్ రైలు పొడిగింపు
Advertisement

Vande Bharat Express: భారతీయ రైల్వేలో ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ రైలుకు ఆదరణ పెరుగుతోంది. అతి తక్కువ సమయంలో వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునేవారు వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్నారు. చెన్నై సెంట్రల్‌-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్‌ రైళ్లను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వరకు తాత్కాలికంగా పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

చెన్నై సెంట్రల్ టు నర్సాపురం

ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన చేసంది. చెన్నై సెంట్రల్‌-నరసాపురం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(నెం.20677) ఈ నెల 15 నుంచి జనవరి 11 వరకు నడపనున్నారు. ఈ రైలు చెన్నై సెంట్రల్‌లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి 7.05 గంటలకు రేణిగుంట, 8.29 గంటలకు నెల్లూరు, 9.43 గంటలకు ఒంగోలు, 11.08 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.29 గుడివాడ, 01.14 గంటలకు భీమవరం టౌన్‌, 2.10 గంటలకు నరసాపురం స్టేషన్ చేరుకుంటుంది.

నర్సాపురం టు చెన్నై సెంట్రల్

Advertisement

అలాగే నర్సాపురం-చెన్నై సెంట్రల్‌ వందే భారత్‌ రైలు(నెం.20678) ఈ నెల 17 నుంచి జనవరి 11 వరకు నడపనున్నారు. ఈ రైలు నర్సాపురంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి 3.19 గంటలకు భీమవరం టౌన్‌, సాయంత్రం 4.04 గంటలకు గుడివాడ, 4.50 గంటలకు విజయవాడ, 6.29 గంటలకు ఒంగోలు, రాత్రి 7.39 గంటలకు నెల్లూరు చేరుకుంటుంది. రాత్రి 9.50 గంటలకు రేణిగుంట,11.45 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుందని దక్షిణ రైల్వే ప్రకటనలో తెలిపింది.

నర్సాపురం-చెన్నై మార్గంలో వ్యాపారులు నిత్యం ప్రయాణిస్తుంటారు. దీంతో వారు వందే భారత్ ను ఎక్కువగా వినియోగించుకునే అవకాశం కలిగింది. ఉపాధి, ఉద్యోగాల కోసం తమిళనాడులో ఉంటున్న వారు సంక్రాంతి సీజన్ కు స్వగ్రామాలకు వస్తుంటారు. దీంతో వీరు కూడా వందే భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Advertisement

]

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×