BigTV English

Vande Bharat Express: వందే భారత్ లో ఇక పార్సెల్ కూడా పంపుకోవచ్చు, గంటల్లోనే డెలివరీలు!

Vande Bharat Express: వందే భారత్ లో ఇక పార్సెల్ కూడా పంపుకోవచ్చు,  గంటల్లోనే డెలివరీలు!

Vande Bharat Parcel Trains: భారతీయ రైల్వేలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు.. ఇకపై సరుకు రవాణా సేవలను కూడా అందించబోతున్నాయి. ఇందుకోసం వందేభారత్ పార్శిల్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే సంస్థ నిర్ణయించింది. ఈ రైళ్లతో ఈ-కామర్స్ వస్తులను రవాణా చేయాలని భావిస్తున్నది. చెన్నైలోని రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికే వందేభారత్ పార్శిల్ కోచ్ ను రూపొందిస్తున్నది. ఈ కోచ్ కు రైల్వేశాఖ ఆమోదం లభించన తర్వాత మిగతా కోచ్ లు రెడీ కానున్నాయి. ఫస్ట్ పోటోటైప్ వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా రెడీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత టెస్ట్ రన్ నిర్వహించి, రవాణా సేలకు వినియోగించనున్నట్లు సమాచారం.


శరవేగంగా పార్శిల్ డెలివరీలు

ప్రస్తుతం భారత్ లో ఈకామర్స్ రవాణా అనేది అతిపెద్ద వ్యాపారంగా కొనసాగుతున్నది. ప్రతి ఏటా కోన్ని వేల కోట్ల రూపాయల మేర బిజినెస్ జరుగుతున్నది. వందేభారత్ పార్శిల్ రైళ్ల ద్వారా మంచి లాభాలను పొందాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఎక్కువ విలువ కలిగిన గూడ్స్ రవాణాకు వినియోగించాలని రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు త్వరగా చెడిపోయే పూలు, సహా ఇతర ఆహార పదార్థాలను ఎయిర్ కార్గో ద్వారా తరలిస్తున్నారు. వాటిని వందేభారత్ పార్శిల్ రైళ్ల ద్వారా రవాణా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


వందేభారత్ లో నాలుగో మోడల్

సెమీ హైస్పీడ్ రైలుగా రూపొందిన వందేభారత్ రైళ్లలో నాలుగో మోడల్ గా వందేభారత్ పార్శిల్ రైలు రెడీ అవుతున్నది. ఇప్పటికే ఛైర్ కార్లు అందుబాటులోకి రాగా, త్రీ టైర్ స్లీపర్ కోచ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అటు వందేభారత్ మెట్రో రైళ్లు కూడా త్వరలో ప్రజలకు సేవలను అందించనున్నాయి. ఇప్పుడు వందేభారత్ పార్శిల్ రైళ్లు రెడీ అవుతున్నాయి. చెన్నైలోని రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పార్శిల్ కోచ్ లను రూపొందిన్నది. గంటకు 160 నుంచి 180 కిలో మీటర్ల వేగంతో నడిచేలా ఈ ప్రోటో టైప్ ను రూపొందిస్తున్నది. ఒక్కో కోచ్ 16 నుంచి 18 టన్నుల రవాణా సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నాయి. ఒక్కో రైలులో 16 కోచ్ లను ఏర్పాటు చేయనున్నారు. 8, 11, 13 మీటర్ల పొడవు ఉండే ఈ పార్శిల్ బోగీలను అందుబాటులోకి తీసుకురానుంది.  పార్శిళ్లను ఈజీగా తరలించేందుకు వీలుగా కోచ్ ఫ్లోర్‌ను రోలర్ బ్లేడ్ లతో రెడీ చేస్తున్నారు. అటు పెద్ద పార్శిళ్లను ఈజీగా ఎక్కించేందుకు మూడు నుంచి 5 మీటర్ల డోర్లను ఏర్పాటు చేస్తున్నారు.

Read Also: బాబోయ్.. అన్ని కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నారా? అసలు విషయం చెప్పిన రైల్వేమంత్రి!

గంటల వ్యవధిలో డెలివరీలు

వందేభారత్ పార్శిల్ రైళ్ల ద్వారా వేగంగా సరుకులను రవాణా చేయనున్నారు. అంతేకాదు, పార్శిల్ టర్న్అరౌండ్ టైమ్ ను  7 నుంచి 8 నిమిషాలకు తగ్గించడానికి, ఎక్స్‌ ప్రెస్ లాజిస్టిక్స్ డిమాండ్ కు అనుగుణంగా సేవలను అందించనున్నాయి.  ఢిల్లీ-ముంబై మధ్య 10 గంటల్లో, ఢిల్లీ-చెన్నై మధ్య 24 గంటల్లో డెలివరీలు అందించాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్న మొత్తంలో సరుకు రవాణాకు ఎక్కువ అవకాశం ఉన్న మార్గాల్లో కొత్త పార్శిల్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్లాన్ చేస్తున్నారు.

Read Also: వెయిటింగ్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లో వెళ్తున్నారా? కేంద్ర మంత్రి సీరియస్ వార్నింగ్!

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×