BigTV English

BB Telugu 8: క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. రూ.30 లక్షలు ఇస్తామంటూ..?

BB Telugu 8: క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. రూ.30 లక్షలు ఇస్తామంటూ..?

BB Telugu 8:సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీస్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించి ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయట పెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా అనుష్క(Anushka), సమంత(Samantha) లాంటి హీరోయిన్స్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్నానని ముందుకొచ్చింది ప్రముఖ బ్యూటీ, బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న కిర్రాక్ సీత (Kiraak Sita).


మొదటి సినిమాకే రూ.30 లక్షల రెమ్యూనరేషన్..

బిగ్ బాస్ సీజన్ 8లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, తన ఆట తీరుతో అందరిని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే అనూహ్యంగా అతి తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బేబీ’ సినిమాతో మరింత పాపులారిటీ అందుకుంది. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకుంది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది. అయితే మొదటి సినిమాకి నాకు రూ.30 లక్షల రెమ్యూనరేషన్ కూడా ఇస్తామన్నారు. అయితే సినిమాలో నటించాలంటే ముందు మూవీ మేకర్స్ ని కలవాలని, ఫామ్ హౌస్ కి వెళ్ళాలని, ఫారిన్ ట్రిప్పులు కూడా వెళ్లాల్సి ఉంటుందని కండీషన్ నాకు పెట్టారు. సినిమా ఆఫర్ కి, వీరు చెప్పే మాటలకి సంబంధం లేకుండా మాట్లాడడంతో నాకు వెంటనే అనుమానం వచ్చింది. కెరియర్ ప్రారంభంలోనే ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ చేయడంతో ఒక్కసారిగా నాకు మతిపోయింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యాను. వెంటనే ఆ సినిమా ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేసాను” అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది సీత.


యూట్యూబ్ ద్వారా పరిచయం..

ఇదిలా ఉండగా యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సీత 7 ఆర్ట్స్ ఛానల్లో ఈమె ఇచ్చిన కంటెంట్ తో భారీ పాపులారిటీ అందుకున్న విషయం తెలిసిందే. సరయు(Sarayu)తో కలిసి ఈమె చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక సోషల్ మీడియా ద్వారా పేరు సంపాదించుకున్న సీత బేబీ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన నటనతో అబ్బురపరిచింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక దీంతో బిగ్ బాస్ హౌస్ లో అవకాశాన్ని దక్కించుకుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ షో ద్వారానే కిర్రాక్ సీతకు మంచి పాపులారిటీ లభించిందని చెప్పాలి. అందుకే ఈమెకు సంబంధించిన ఏ విషయం అయినా సరే ఇప్పుడు క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఏది ఏమైనా అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు వెంటనే అనుమానపడి రిజెక్ట్ చేసావు.. శభాష్ అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×