E-Paper
Advertisement

వందేభారత్ స్లీపర్‌లో కొత్త ఫుడ్ రూల్.. ఇకపై విమానాల్లో మాదిరిగా ఫుడ్ సర్వీస్!

వందేభారత్ స్లీపర్‌లో కొత్త ఫుడ్ రూల్.. ఇకపై విమానాల్లో మాదిరిగా ఫుడ్ సర్వీస్!
Advertisement

Vande Bharat Sleeper Meals: రైలు ప్రయాణంలో ఫుడ్ విషయంలో ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసే వారికి మంచి క్వాలిటీ, నీట్ నెస్ భోజనం అందించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లలో విమాన ప్రయాణాల్లో అందించే కాంపాక్ట్ మెనూను ప్రవేశపెట్టింది. గతంలో ఎక్కువ రకాల వంటకాలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు తక్కువ ఐటమ్స్‌ తో మంచి భోజనం అందించనున్నారు.

మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త విధానం

భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ కొత్త విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ప్రస్తుతం ముంబై-బెంగళూరు, హౌరా-కామాఖ్య, న్యూఢిల్లీ-వారణాసి మార్గాల్లో నడిచే మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లలో దీనిని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కు సంబంధించిన మెనూను కుదించారు. ఎక్కువ రకాల వంటకాలను అందించడం కంటే,  కొన్ని ఫుడ్ ఐటెమ్స్ నే మంచి క్వాలిటీతో అందించడంపై దృష్టి పెట్టారు.

భోజనం తయారీలో కీలక సంస్థలకు బాధ్యతలు

Advertisement

గతంలో రైల్వే, దాని క్యాటరింగ్ సంస్థల ద్వారా ఫుడ్ సరఫరా అయ్యేది. ఇప్పుడు ప్రముఖ హోటల్ గ్రూపులు, క్లౌడ్ కిచెన్ల సహకారంతో ఫుడ్ రెడీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మేఫెయిర్ గ్రూప్, తాజ్‌ శాట్స్, సరోవర్ పోర్టికో గ్రూప్ లాంటి సంస్థలతో IRCTC అగ్రిమెంట్ కుదుర్చుకుంది. విమానయాన సంస్థలు, హోటళ్లకు ఫుడ్ సరఫరా చేసే ఎక్స్ పీరియెన్స్ ఉన్న కిచెన్లను కూడా ఉపయోగించుకోనున్నారు. దీంతో ఫుడ్ తయారీ నుంచి ప్యాకింగ్, సరఫరా వరకు నాణ్యతను ఒకే విధంగా కొనసాగించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మెనూలో ఏమేం ఉంటాయంటే?

ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలులో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా చట్నీ, సాంబార్‌తో ఇడ్లీ, వడ అందిస్తున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా పోహా లేదంటే ఉప్మా కూడా ఉంది. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో చపాతీ, అన్నం, పప్పుతో పాటు చికెన్, వెజిటేరియన్ కర్రీ అందిస్తున్నారు. గతంలో మెనూలో ఉన్న సూప్, ఎగ్ ఆమ్లెట్, శాండ్‌విచ్, మజ్జిగ, చాక్లెట్లు, సలాడ్, పెరుగు, ఊరగాయ, స్వీట్లు సహా పలు ఫుడ్ ఐటెమ్స్ ను తొలగించారు.

క్వాంటిటీ తగ్గినా, క్వాలిటీపైనే ఫోకస్..

Advertisement

కొత్త మెనూ ప్రకారం ఒక్కో మీల్స్ బరువును 700-750 గ్రాముల నుంచి 450-500 గ్రాములకు తగ్గించారు. అయినప్పటికీ మంచి క్వాలిటీతో అందించనున్నారు. ఈ కొత్త మెనూ ప్రారంభమైన తర్వాత ప్రయాణికుల నుంచి వచ్చే ఫుడ్ కంప్లైంట్స్  సుమారు 10 శాతం తగ్గినట్లు IRCTC అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కాంపాక్ట్ మెనూ విధానం సక్సెస్ అయితే, ఇతర ప్రీమియం రైళ్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

Read Also: వందే భారత్‌ సహా అన్ని రైళ్లలో ఫ్రీ జర్నీ.. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి అంటే?

Tags

Related News

వందే భారత్‌ సహా అన్ని రైళ్లలో ఫ్రీ జర్నీ.. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి అంటే?

గాల్లోనే కలకలం.. విమాన తలుపు తెరిచేందుకు ప్రయాణికుడి, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో భయానక క్షణాలు!

ద్వీపం కోసం గజరాజుల సాహసం.. సరస్సులో 7 కి.మీ మేర నాన్ స్టాప్ ఈత.. అద్భుత దృశ్యాలు వైరల్!

1981 భాగ్యనగరానికి.. ఇప్పటి హైదరాబాద్‌కి ఎంత తేడా? లెక్కలు చూస్తే షాకే!

ప్రపంచంలోనే అత్యంత వింత రైళ్లు.. ఒకటి నత్తనడకన.. మరొకటి గాల్లో వేలాడుతూ!

సాయంత్ర 6 దాటిందంటే.. వెన్నులో వణుకు పుట్టించే ప్రదేశాలు.. వీటి పేరు వింటేనే పోసుకుంటారు భయ్యా!

ట్యూబ్‌లెస్ టైర్ పంక్చర్ అయితే కారు ఎంత దూరం నడపవచ్చు? ఈ పొరపాటు చేస్తే భారీ నష్టం తప్పదు

Big Stories

Advertisement
×