BigTV English

Viral Video: ఇదేం పైత్యం రా బాబు! ఏకంగా రైలు ఇంజిన్ మీదకు ఎక్కి ప్రయాణం

Viral Video: ఇదేం పైత్యం రా బాబు! ఏకంగా రైలు ఇంజిన్ మీదకు ఎక్కి ప్రయాణం

ఈ మధ్య చాలా మంది యువకులు సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. డేంజర్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కొంత మంది రైళ్లలో ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వీడియోలు, సెల్ఫీల పైత్యంతో రైలు కింద పడి చనిపోయారు కూడా. తాజాగా ఓ యువకుడు ఏకంగా రైలు ఇంజిన్ మీద పడుకుని ప్రయాణించడం సంచలనంగా మారింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న రైలు ఇంజిన్ పై వెళ్తూ తీసిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


రైలు ఇంజిన్ పై పడుకుని ప్రయాణం

ఇన్ స్టా గ్రామ్ చూసే వారికి రాహుల్ గుప్తా వీడియోలు ఎప్పుడో ఒకప్పుడు కనిపించే ఉంటాయి. రైళ్లలో ఆయన చేసే డేంజరస్ స్టంట్లు నెటిజన్ల వెన్నులో వణుకు పుట్టిస్తాయి. గత కొంత కాలంగా ఆయన రైళ్లలో డేరింగ్ స్టంట్లు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. వేగంగా కదులుతున్న రైలు ఇంజిన్ మీద పడుకుని ప్రయాణిస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఈ వీడియోలో తాను బంగ్లాదేశ్ లో ఉన్నానని, ఇలాంటి స్టంట్లు మరెవరూ చేయకూడదని నెటిజన్లను హెచ్చరించాడు. ఈ వీడియో ఏకంగా 19 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.


రాహుల్ గుప్తాపై నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియోపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. “భాయ్ కి  బోగీలో సీటు దొరకనట్టుంది. అందుకే ఇంజిన్ మీద రైడింగ్ చేశాడు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. “అన్నకు ఇంజిన్ మీద స్పెషల్ సీటు వేసినట్లు ఉంది” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఇంతకీ అన్న రైలు ప్రయాణం చేసేందుకు టికెట్ తీసుకున్నాడో? లేదో?” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. “భాయ్ కి త్వరలోనే స్మశానంలో సీటు కన్ఫర్మ్” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు.

రైళ్లలో డేంజరస్ స్టంట్లు చేస్తున్న రాహుల్

రాహుల్ గుప్తా ఇన్‌ స్టాగ్రామ్ పేజీలో చాలా వరకు రైళ్లకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ప్రమాదకర రీతిలో రైళ్లలో ప్రయాణించే వీడియోలను షేర్ చేస్తూ బోలెడు వ్యూస్ సాధిస్తున్నాడు. అయితే, రాహుల్ ఈ వీడియోలను ఎక్కువగా బంగ్లాదేశ్ లోనే తీస్తున్నాడు. ఎందుకంటే, భారతీయ రైల్వే సంస్థ ఇలాంటి వీడియోలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయదు. పైగా ఇలాంటి పనులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటుంది. బంగ్లాదేశ్ లో చాలా మంది రైలు మీద కూర్చొని వెళ్లడం, పక్కన కూర్చొని వెళ్లడం కామన్. అందుకే, రాహుల్ గుప్తా బంగ్లాదేశ్ లో స్టంట్లు చేస్తున్నన వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్నాడు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Rahul Gupta (@rahul_baba_ki_masti_)

Read Also: ఇకపై జర్నీ చేయాలంటే టికెట్ తో పాటు అది కూడా ఉండాల్సిందే! ఇండియన్ రైల్వే సరికొత్త రూల్!

Related News

Indian Railways Staff: 80 రూపాయల థాలీని రూ. 120కి అమ్ముతూ.. అడ్డంగా బుక్కైన రైల్వే సిబ్బంది!

Delhi Railway Station: ఏంటీ.. ఢిల్లీలో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇదా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియదే!

Indian Railway: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్, పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం!

PR to Indians: అమెరికా వేస్ట్.. ఈ 6 దేశాల్లో హాయిగా సెటిలైపోండి, వీసా ఫీజులు ఎంతంటే?

Local Train: సడెన్‌ గా ఆగిన లోకల్ రైలు.. దాని కింద ఏం ఉందా అని చూస్తే.. షాక్, అదెలా జరిగింది?

Metro Warning: కోచ్ లోపల రీల్స్ చేస్తే తోలు తీస్తాం, మెట్రో స్ట్రాంగ్ వార్నింగ్!

Jaffar Express Blast: రైళ్లే టార్గెట్ గా పేలుళ్లు, ఎగిరిపడ్డ బోగీలు, పదుల సంఖ్యలో ప్రయాణీకులు..

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Big Stories

×