Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే, ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారికి సంబంధించి ఓ కీలక ఆదేశాన్ని జారీ చేసింది. కన్ఫర్మ్ టికెట్ తో పాటు ఏదైనా ఓ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుదని వెల్లడించింది.
ప్రయాణం చేయాలంటే ఒరిజినల్ ఐడీ తప్పనిసరి!
ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే, ప్రయాణ సమయంలో తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ను చూపించాలని భారతీయ రైల్వే సంస్థ నిర్ణయించింది. టికెట్ ఉన్నా, ఒరిజినల్ ఐడీ లేకుండా రైలు ఎక్కితే TTE వీటిని నేరంగా పరిగణించే అవకాశం ఉంటుంది. టికెట్ ఉన్నా, ఒరిజినల్ ఐడీ లేకపోతే మిమ్మల్ని టికెట్ లేని ప్యాసెంజర్ గా గుర్తించి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఒక్కోసారి టికెట్ క్యాన్సిల్ చేసి, మిమ్మల్ని రైలు నుంచి డిబోర్డు చేసే అవకాశం ఉంటుంది.
వీటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ చూపించినా ఓకే!
భారతీయ రైల్వే సంస్థ కన్ఫర్మ్ టికెట్ తో పాటు ఒక ఒరిజినల్ ఐడీ ఫ్రూఫ్ చూపించాలని నిర్ణయించింది. ఒరిజినల్ ఐడీ ఫ్రూఫ్స్ ఆధార్ కార్డు, పాస్ పోర్టు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటోతో కూడిన ఏ ఐడీ అయినా యాక్సెప్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
Read Also: ట్రైన్ టికెట్లు ఈజీగా బుక్ చేసుకునే బెస్ట్ యాప్స్ ఇవే, మీరూ ట్రై చేయండి!
ఐడీ ఫ్రూఫ్ లేకపోతే ఏమవుతుందంటే?
కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ ఒరిజినల్ ఐడీ ఫ్రూఫ్ లేకపోతే ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ టికెట్ లేని ప్రయాణీకుడిగా పరిగణించబడుతుంది: మీకు కన్ఫర్మ్ టికెట్ ఉన్నా, ఒరిజినల్ ఐడీ ఫ్రూఫ్ లేకుండా టికెట్ లేని ప్రయాణీకుడిగా పరిగణించే అవకాశం ఉంటుంది.
⦿ జరిమానా విధింపు: ఐడీ ఫ్రూఫ్ లేకుండా ట్రైన్ జర్నీ చేస్తే టీటీఈ జరిమానా విధించడంతో పాటు సీటును రద్దు చేసే అవకాశం ఉంటుంది.
జరిమానా వివరాలు:
AC కాసులు: టిక్కెట్ ధరతో పాటు ₹440 జరిమానా విధిస్తారు.
స్లీపర్ క్లాస్: టిక్కెట్ ధరకు అదనంగా ₹220 జరిమానా విధిస్తారు.
⦿ మీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేయబడిన తర్వాత మీ సీటు క్యాన్సిల్ అవుతుంది.
⦿ జరిమానా చెల్లించినంత మాత్రాన మీ సీటుకు గ్యారెంటీ ఉండదు.
⦿ డీబోర్డింగ్ చేసే అవకాశం: టీటీఈ నిర్ణయం తీసుకుంటే ఒరిజినల్ ఐడీ ఫ్రూఫ్ లేని ప్యాసెంజర్ ను డీ బోర్డింగ్ చేసే అవకాశం ఉంటుంది.
⦿ సీనియర్ సిటిజన్లు కూడా ఈ టికెట్ ఉన్నా ఒరిజినల్ ఐడీ ఫ్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఐడీ ఫ్రూఫ్ లేకుంటే వారి టికెట్ ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది.
సో, ఇకపై రైలు ప్రయాణం చేసే సమయంలో ఏదైనా ఒక ఐడీ ఫ్రూఫ్ తీసుకెళ్లడం మంచిది.
Read Also: 35 పైసలతో అన్ని లక్షలా? రైల్వే ఇన్సూరెన్స్ గురించి మీకు తెలుసా?