Srisailam Dam Gates Open: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి భారీగా కృష్ణమ్మకు వరద నీరు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం కళకళలాడుతుంది. ప్రాజెక్ట్ ఎగువ నుండి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతూ వచ్చి చేరుతుంది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమై పరిస్థితిని గమనిస్తున్నారు. అయితే జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తి, దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రేపూ మాపో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. అయితే సోమశిల నుండి శ్రీశైలం వరకు కృష్ణా ప్రాంతంలో నీటి ప్రవాహం ఎక్కడ తగ్గకుండా కొనసాగుతుంది.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ నుండి 1.22 లక్షల క్యూసెక్కులకు పైగా వరద జలాలు వచ్చి చేరుతున్నట్లు అధికారులు విడుదల చేసిన వరద ప్రభావ బులిటెన్‌లో తెలిపారు. ఇప్పుడు శ్రీశైలం జలాశయంలో వరద్ ఇన్ ఫ్లో 1,71,208 క్యూ సెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. అదే సమయంలో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్లం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది.
కుడి, ఎడమ కేంద్రాల్లో… ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,79,8995 టీఎంసీలుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరగడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.
Also Read: లివర్‌ని క్లీన్ చేసే జ్యూస్.. అస్సలు మిస్ చేసుకోకండి
శ్రీశైలం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 31,704 క్యూసెక్కులు, తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు నీటిని వినియోగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తంగా మొత్తంగా 67,029 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
అయితే ఒక వైపు సుంకేశుల, మరో వైపు తుంగభద్ర నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో క్రమక్రమంగా నీటి నిల్వలు ఘననీయంగా పెరుగుతుంది. మరో రెండు, మూడు రోజులు కూడా వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.