Ameer Ali Khan: తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఆసక్తికర చర్చ మొదలైంది. సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కోరుతూ గాంధీభవన్ వద్ద వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
గాంధీభవన్ వద్ద హల్‌చల్
అమీర్ అలీ ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసి, ముస్లిం సామాజిక వర్గానికి పూర్తి న్యాయం చేయాలని ‘మజ్లిస్ ఇతేహాద్ మిల్లత్’ సంస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విజ్ఞప్తి చేసింది. గతంలో గవర్నర్ కోటాలో ఇచ్చిన ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొని రద్దయిన విషయం తెలిసిందే.
అజారుద్దీన్‌కు కేబినెట్ అవకాశం
ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీతో పాటు కేబినెట్ పదవిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇదే తరహాలో సీనియర్ పత్రికాధిపతి అమీర్ అలీ ఖాన్‌కు కూడా అవకాశం ఇచ్చి, శాసనమండలికి పంపాలని పలు ముస్లిం సంఘాలు బలంగా కోరుతున్నాయి.
పార్టీలో తదుపరి అడుగు ఏంటి?
ముస్లిం సమాజం నుంచి వస్తున్న ఈ డిమాండ్‌పై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో గవర్నర్ కోటా ఖాళీల భర్తీపై కాంగ్రెస్ నాయకత్వం తీసుకోబోయే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకోనుంది.
Also Read: హైదరాబాద్‌లో విషాదం.. దుర్గం చెరువులో దూకి వైజాగ్ టెక్కీ ఆత్మహత్య