E-Paper
Advertisement

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ రాక్ష‌సులే…కింద ప‌డి గంగూలీ కొట్టుకున్నా చూడ‌నివ్వ‌లేదు

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ రాక్ష‌సులే…కింద ప‌డి గంగూలీ కొట్టుకున్నా చూడ‌నివ్వ‌లేదు
Advertisement

Shoaib Akhtar On Sourav Ganguly: ఒక‌ప్ప‌టి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్. అతడి బౌలింగ్ లో ఇప్పటికే చాలా మంది గాయపడ్డారు. బౌండరీ లైన్ నుంచి పరిగెత్తుతూ బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను షోయబ్ అక్తర్ వణికించేవాడు. అయితే అలాంటి షోయబ్ అక్తర్, సౌరవ్ గంగూలీని కూడా అప్పట్లో గాయపరిచాడు. ఈ విషయాన్ని తాజాగా షోయబ్ అక్తర్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన బౌన్సర్ దెబ్బకు సౌర‌వ్ గంగూలీ కుప్పకూలాడని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో అతని దగ్గరకు వెళ్లి ఎలా ఉందో చూడాలని అనుకున్నట్టు చెప్పారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అనిపించిన‌ట్టు పేర్కొన్నారు అక్తర్.

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ రాక్ష‌సులే…గంగూలీకి గాయ‌మైనా చూడ‌నివ్వ‌లేదు

కానీ, మొయిన్ ఖాన్ నన్ను ఆపేసాడని.. ఇండియన్ క్రికెటర్లపై జాలి పడొద్దు అంటూ తనకు వార్నింగ్ ఇచ్చాడని షాకింగ్ నిజాలను షోయ‌బ్ అక్తర్ పంచుకున్నారు. సౌర‌వ్ గంగూలీ దగ్గరకు వెళితే, బౌలింగ్ మరింత బలహీన పడుతుందని తనకే హితువు పలికాడని వెల్లడించారు. ఈ క్రమంలో గంగూలీ పరిస్థితి చూడకుండానే వెనక్కి వచ్చేసానని తెలిపారు. కానీ అలాంటి పరిస్థితులలో కచ్చితంగా బ్యాటర్ల పరిస్థితిని ప్రతి బౌలర్ తెలుసుకొని ఓదార్చాల్సిన అవసరం ఉందన్నారు. కానీ పాకిస్తాన్ దుర్మార్గులు తనను అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ఆ ప‌రిస్థితుల్లో సౌర‌వ్ గంగూలీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ఉంటే బాగుండేద‌ని ప‌దే ప‌దే తాను అనుకునేవాడిన‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు. దీంతో ఒక‌ప్ప‌టి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

నా బౌన్స‌ర్ల దెబ్బ‌కు 20 మంది రిటైర్డ్ హర్ట్ అయ్యారు

సౌరవ్ గంగూలీ సంఘటనను గుర్తు చేసిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్… తన బౌన్సర్ల దెబ్బకు దాదాపు 20 మంది కుప్పకూలినట్టు వ్యాఖ్యానించారు. తన బౌలింగ్ తట్టుకోలేక రిటైర్డ్ హర్ట్ అయినట్టు కూడా గుర్తు చేశారు. బ్రియాన్ లారా, గ్యారీ క్రిస్టెయిన్ లాంటి చాలా మంది బ్యాటర్లు తన బౌలింగ్ లో గాయపడి ఇలానే కింద పడిపోయారని వెల్లడించారు. వాళ్లకు బంతులు తగిలిన ప్రతిసారి క్షమాపణలు చెప్పేవాడినని వెల్లడించారు. కానీ సౌరవ్ గంగూలీ విషయంలో మాత్రం తాను క్షమాపణలు చెప్పలేకపోయానని బాధపడ్డారు. పాకిస్తాన్ ( Pakistan) క్రికెట్ సంస్కృతి చాలా దారుణంగా ఉండేదని.. మైదానంలో ప్రత్యర్థి పై ఎలాంటి జాలి చూపించకూడదని దుర్మార్గంగా వ్యవహరించినట్టు ఆగ్రహించారు. దానివల్ల తన పేరు బ్యాడ్ అయిందని పేర్కొన్నారు. బ‌య‌ట‌కు క‌నిపించేంత దుర్మార్గుడిని తాను కాద‌ని షోయ‌బ్ అక్త‌ర్ తెలిపారు.  నాకు మంచి మ‌న‌సు ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

 

 

 

Related News

NOC పేరుతో డ్రామాలు ఆపండి, మేం త‌ల‌చుకుంటే పాకిస్తాన్ రోడ్డున ప‌డుతుంది

జెర్సీ నంబ‌ర్ కోసం నా పెళ్లాం, త‌ల్లి గొడ‌వ పడ్డారు…వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం!

షాబాద్ ఖాన్ సెంచ‌రీ..పాక్ ప్ర‌ధాని బంప‌ర్ ఆఫ‌ర్?

అనుష్క శ‌ర్మ మూడోసారి ప్రెగ్నెంట్…బేబీ బంప్‌ ఫొటోలు వైర‌ల్ ?

CSKకు అసలు బుర్ర ఉందా.. గారెత్ బాటీ పేరే వినలేదు, వీడు బ్యాటింగ్ కోచా?

వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద సోమరిపోతు…బ్యాటింగ్ తప్ప, ఫీల్డింగ్ చేతకాదు!

నీ తొక్కలో సలహాలు నాకొద్దు…మామపై షాహీన్ తిరుగుబాటు?

Big Stories

Advertisement
×