Father Of Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అమెరికా, చైనా, రష్యా తర్వాత నాలుగో అతిపెద్ద రైల్వే సంస్థగా కొనసాగుతోంది. మొత్తం లక్ష కిలో మీటర్ల పరిధిలో రైల్వే లైన్లను కలిగి ఉంది. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా అన్ని ప్రాంతాల్లో రైల్వే నెట్ వర్క్ విస్తరించింది. రోజూ సుమారు 20 వేల రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. వీటిలో 13 వేల ప్యాసింజర్ రైళ్లు కాగా, మిగతావి గూడ్స్ రైళ్లు. దేశ వ్యాప్తంగా రోజూ సుమారు 2 కోట్లకు పైగా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. పీక్ సీజన్ లో 3 కోట్లు దాటిన సందర్భాలున్నాయి.
దశాబ్ద కాలంలో ఎంతో అభివృద్ధి
ఇక భారతీయ రైల్వే గత దశాబ్ద కాలంగా ఎంతో అభివృద్ధి సాధించింది. సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్, నమో భారత్ మొదలుకొని కవచ్ రక్షణ వ్యవస్థ వరకు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అప్ డేట్ అవుతున్నాయి. త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. అటు ప్రపంచంలోనే అత్యంత సామర్ధ్యంతో కూడిన హైడ్రోజన్ రైలు రెడీ అవుతోంది. మరోవైపు బుల్లెట్ కారిడార్లు కూడా శరవేగంగా నిర్మాణం అవుతున్నాయి. దేశ రైల్వే వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడుతూ ముందుకు సాగుతోంది.
భారతీయ రైల్వేకు పునాది వేసింది ఎవరు?
భారతీయ రైల్వేకు 1853లో పునాది రాయి పడింది. ఇండియన్ రైల్వే పితామహుడిగా లార్డ్ డల్హౌసీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 1848 నుంచి 1856 వరకు ఇండియన్ గవర్నర్ జనరల్ గా పని చేశారు. 1853 ఇండియాకు రైల్వేను పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బ్రిటిషర్ల సౌకర్యవంతమైన ప్రయాణాలతో పాటు సరుకు రవాణా కోసం రైల్వేను తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
Read Also:రైలుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయితే? రైల్వే ఏం చేస్తుందో తెలుసా?
ఇండియాలో రైల్వే అభివృద్ధి
రైల్వేల పరిచయం: దేశంలో రైల్వేకు శ్రీకారం చుట్టింది లార్డ్ డల్హౌసీ. ఆయన ప్రయత్నాల కారణంగానే భారత్ లో రైల్వే వ్యవస్థ ప్రారంభం అయ్యింది. ఈ రైల్వేలు దేశ రవాణా ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి.
తొలి రైలు: దేశంలో మొట్ట మొదటి రైలు 1853లో పట్టాలెక్కింది. ఈ రైలు ముంబై నుంచి థానే వరకు పరుగులు తీసింది. భారతీయ రవాణాలో కొత్త శకానికి నాంది పలికింది.
రైల్వే అభివృద్ధి: లార్డ్ డల్హౌసీ దేశంలో రైల్వే అభివృద్ధికి ప్రధాన మార్గాలను నిర్దేశించారు. దేశంలోని కోల్ కతా, మద్రాస్ సహా పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లను విస్తరించారు. ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాలను లింక్ చేస్తూ రైల్వే లైన్ల నిర్మాణం కొనసాగింది. ఆ తర్వాత రోజు రోజుకూ మరింత అభివృద్ధి చెందుతోంది. తొలుత ఆవిరి యంత్రాలతో ప్రారంభమైన ఇండియన్ రైల్వే బొగ్గు, డీజీల్, విద్యుత్ ను దాటి నీటితో నడిచే హైడ్రోజన్ రైళ్ల వరకు చేరింది.
Read Also: రైల్లో కశ్మీర్ కు.. కొత్త లైన్ వచ్చేస్తోంది.. సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకోండి!