E-Paper
Advertisement

6:45 PM అని కాకుండా 18:45 అని ఎందుకు రాస్తారు? రైల్వే, ఎయిర్‌లైన్స్ టైమింగ్స్ ఎందుకిలా ఉంటాయి?

6:45 PM అని కాకుండా 18:45 అని ఎందుకు రాస్తారు? రైల్వే, ఎయిర్‌లైన్స్ టైమింగ్స్ ఎందుకిలా ఉంటాయి?
Advertisement

Indian Railways: సాధారణంగా మన రోజువారీ జీవితంలో సమయం చెప్పేటప్పుడు ఉదయం, సాయంత్రం అని చెబుతుంటాం. ఉదాహరణకు సాయంత్రం 6:45 అంటే సులభంగా అర్థమవుతుంది. కానీ రైలు లేదా విమాన టికెట్‌పై అదే సమయం 18:45గా కనిపిస్తుంది. ఇలా ఎందుకు రాస్తారనే సందేహం చాలామందికి వస్తుంది. ప్రయాణాల్లో గందరగోళం లేకుండా, ప్రతి సేవ సరైన సమయానికి నడిచేలా చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే 24 గంటల గడియారాన్ని ఎంచుకున్నారు.

సమయం విషయంలో స్పష్టత..

12 గంటల గడియారంలో ఒకే సమయం రోజులో రెండుసార్లు వస్తుంది. ఉదయం 6:45, సాయంత్రం 6:45 రెండింటినీ 6:45గానే రాస్తే ఏది ఏ సమయమో తెలుసుకోవడానికి AM, PM పెట్టాలి. టికెట్ చదివేటప్పుడు ఈ విషయం కూడా పొరపాటుకు దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున బయలుదేరే రైళ్లు, అర్ధరాత్రి తర్వాత చేరే ప్రయాణాల్లో సందేహం రావచ్చు. 24 గంటల పద్ధతిలో ప్రతి సమయానికి ఒకే గుర్తింపు ఉంటుంది. అర్ధరాత్రి 00:00 నుంచి మొదలై, రాత్రి 23:59 వరకు సమయం మారుతుంది. దీంతో AM, PM అవసరం ఉండదు.

రైల్వేలతో మొదలైన మార్పు..

Advertisement

19వ శతాబ్దంలో రైల్వే మార్గాలు విస్తరించినప్పుడు సమయాన్ని ఒకేలా పాటించడం అవసరమైంది. అప్పట్లో ఒక్కో పట్టణం స్థానిక సూర్యుడి ఆధారంగా తన సమయాన్ని పాటించేది. ఒక ఊరిలో గడియారం చూపించే సమయం, మరో ఊరిలో చూపించే సమయంతో సరిపోలేది కాదు. దీంతో రైళ్ల రాకపోకలను సమన్వయం చేయడం కష్టమయ్యేది. ఆ మార్పు రైళ్ల ప్రయాణాన్ని క్రమబద్ధం చేయడంలో కీలకంగా నిలిచింది. ఇప్పుడు భారతీయ రైల్వే టికెట్లు, స్టేషన్ల బోర్డులు, ప్రకటనల్లో 24 గంటల సమయం కనిపించడం అందుకే.

Also Read: ఊటీ, అరకు బోర్ కొట్టాయా? నవంబర్‌లో తప్పక చూడాల్సిన 5 సీక్రెట్ హిల్ స్టేషన్లు ఇవే!

విమాన ప్రయాణాల్లో మరింత అవసరం..

Advertisement

విమానాలు దేశాల మధ్య ప్రయాణిస్తాయి. ఒక్కో దేశానికి, ప్రాంతానికి వేర్వేరు టైమ్ జోన్లు ఉంటాయి. ఒకే ప్రయాణంలో బయలుదేరే సమయం ఒక దేశపు స్థానిక సమయం కాగా, చేరుకునే సమయం మరో దేశపు స్థానిక సమయం కావచ్చు. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది, విమానాశ్రయ సిబ్బంది ఒకే సమయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే విమానయాన రంగం కార్యకలాపాల్లో కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (UTC)ను కూడా ఉపయోగిస్తుంది. ప్రయాణికుల టికెట్లపై సాధారణంగా బయలుదేరే, చేరుకునే నగరాల స్థానిక సమయాలనే చూపిస్తారు.

భద్రతకు తోడ్పడే పద్ధతి..

ఐఏటీఓ అధ్యక్షుడు రవి గోసైన్ చెప్పినట్టు.. రైల్వేలు, విమానయాన రంగంలో ఖచ్చితత్వం, ఒకే విధమైన సమయ పద్ధతి, భద్రత చాలా ముఖ్యం. 24 గంటల గడియారం వల్ల ప్రయాణికులు మాత్రమే కాదు, సిబ్బంది కూడా సమయాన్ని సులభంగా గుర్తించగలరు. కాబట్టి.. టికెట్‌పై కనిపించే ఈ సంఖ్యలు కొత్తగా అనిపించినా, వాటి వెనుక ప్రయాణాన్ని సురక్షితంగా, సమయానికి నడిపించాలనే ఉద్దేశం ఉంది.

Also Read: ఇంటి పైకప్పుపై నీళ్ల బాటిల్.. 30కి పైగా దేశాలు ఫాలో అవుతున్న పవర్ సేవింగ్ ట్రిక్ ఇదే!

Tags

Related News

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 96 ప్రత్యేక రైళ్లు!

ఊటీ, అరకు బోర్ కొట్టాయా? నవంబర్‌లో తప్పక చూడాల్సిన 5 సీక్రెట్ హిల్ స్టేషన్లు ఇవే!

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి షాక్.. అప్పుడే నిండిపోయిన రైళ్లు!

చలికాలంలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? మంచు కొండల మధ్య ఈ 5 ప్రాంతాలు సూపర్

Pamban Bridge Tragedy: రన్నింగ్ రైల్లో నుంచి సముద్రంలోకి జంప్.. యువకుడు బలి, యువతి పరిస్థితి..

విమానం ముక్కు చిట్లింది.. అసలు ఏం జరిగింది? మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ

వియత్నాంలో లవ్ మార్కెట్ గురించి తెలుసా? ఏడాదిలో ఒక్కరోజు జరిగే ప్రేమికుల విచిత్ర వేడుక

Big Stories

Advertisement
×