E-Paper
Advertisement

కామనర్స్ హౌస్లోకి రీ ఎంట్రీ..మిథిలేష్ దెబ్బకు ముఖేష్ గప్ చుప్ ..!

కామనర్స్ హౌస్లోకి రీ ఎంట్రీ..మిథిలేష్ దెబ్బకు ముఖేష్ గప్ చుప్ ..!
Advertisement

Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించి 10 వారాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ముఖ్యంగా సెలబ్రిటీల ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. అంతేకాదు కంటెస్టెంట్స్ తరఫున సెలబ్రిటీలు కూడా స్టేజ్ పైకి వచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో 12 మంది సెలబ్రిటీలు కొనసాగుతున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 10లో 11వ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ గట్టిగా ప్రారంభమయ్యింది.

హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శాలిని, మిథిలేష్..

అయితే ఈ వారం నామినేషన్స్ ను కంటెస్టెంట్స్ మధ్య కాకుండా హౌస్ నుండి వెళ్లిపోయిన కామనర్స్ ను హౌస్ లోకి తీసుకువచ్చి మరీ వారి చేత నామినేట్ చేయించారు బిగ్ బాస్. అందులో హౌస్ లోకి అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే రూ.15 లక్షల సూట్ కేస్ తీసుకెళ్లి అందరిని ఆశ్చర్యపరిచిన మిథిలేష్ మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం వైరల్ గా మారింది. ఇక నామినేషన్ లో భాగంగా తన పాయింట్స్ తో ముఖేష్ కు చుక్కలు చూపించారు మిథిలేష్. ఇక విషయంలోకి వెళ్తే.. 71 వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో అటు శాలిని (Shalini ), ఇటు మిథిలేష్ (Mithilesh) ఇద్దరు కూడా హౌస్ లోకి అడుగుపెట్టారు. పైగా ఈవారం నామినేషన్స్ ఎక్స్ హౌస్ మేట్స్ చేతుల్లో జరగడం ఆకట్టుకుంది.

నీతూపై మండిపడ్డ శాలిని..

Advertisement

హౌస్ లోకి అడుగుపెట్టిన శాలినీతో మాట్లాడుతూ.. ఈవారం నామినేషన్ పోరులో మీరే మొదటి దాడి చేయాలి అని బిగ్ బాస్ సూచించారు. అందులో భాగంగానే శాలిని నీతూ మాస్టర్ (Neetu Natraj) ను నామినేట్ చేసింది. “మీరు ఒక అబ్బాయి గేమ్ పాడవుతుంది అనుకున్నప్పుడు.. ఆ అబ్బాయి తో పాటు ఈ అమ్మాయి కూడా ఉంది అని మర్చిపోయారా? అంటూ రోహిత్ గేమ్ ను దృష్టిలో పెట్టుకొని శాలినికి అన్యాయం చేయడంపై నీతూని ప్రశ్నించింది శాలిని. దీనికి నీతూ మాట్లాడుతూ.. 16 కోట్ల మంది లైవ్ చూస్తున్నారు. వాళ్ల ముందు ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలియదు. అలాంటిది నువ్వు వచ్చి నాకు చెప్తున్నాను అంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ముఖేష్ కి చుక్కలు చూపించిన మిథిలేష్..

ఇక తర్వాత మితిలేష్ రెడ్డి కూడా హౌస్ లోకి వచ్చారు. ఈయన ముఖేష్ ను నామినేట్ చేశారు. “సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పావు. అయితే రోహిత్ విషయానికి వచ్చేసరికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. ఫ్రెండ్షిప్ ని నువ్వు వ్యాపారంగా మార్చుకున్నావని నాకనిపించింది. ప్రత్యేకించి సుధీర్ విషయంలో.. నావల్లే ఉన్నాడు హౌస్ లో.. లేకపోతే తాను బయటకు వెళ్లేవాడు అంటూ గతంలో ముఖేష్ సుధీర్ తో వ్యవహరించిన తీరుపై మిథిలేష్ మండిపడ్డారు. అయితే అన్ని మాటలు అన్నాక కూడా మళ్లీ ముఖేష్ సుధీర్ దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా నిన్ను ఆ మాట అన్నానా అని అడగడం విడ్డూరంగా అనిపించింది..

Advertisement

ALSO READ:శ్రీవిద్యను ఆ స్టార్ హీరోయిన్ తో పోల్చిన వర్ష!

ముఖేష్ ఇంత స్వార్థపరుడా?

అయితే అటు సుధీర్ కూడా ఎన్నోసార్లు అన్నావని చెప్పాడు. ఇక తర్వాత మిథిలేష్ మాట్లాడుతూ.. వర్షిణి శివా మీద పి అనే వర్డ్ ఒకటి పాస్ చేసింది. అయితే నువ్వు అప్పుడు వెకిలి నవ్వులు నవ్వావు. శివ విషయంలో మీరు లైన్ క్రాస్ చేశారని నాకనిపించింది. అన్నా అని పిలిచిన ఝాన్సీ ని నువ్వు సేవ్ చేయలేకపోయావు అని మిథిలేష్ చెబుతుండగా.. శివ మాట్లాడుతూ ఆయన వర్షిణిని సేవ్ చేయాలని చూశారు.. సుధీర్ ను సేవ్ చేయాలని చూశారు .. మరి ఎందుకు ఝాన్సీని సేవ్ చేయలేదు. ఎందుకంటే ఆమె బయట వ్యక్తి అంటూ ముఖేష్ స్వార్ధాన్ని బయటపెట్టారు. మొత్తానికైతే తాజాగా జరుగుతున్న ఈ నామినేషన్ ప్రక్రియ ఎక్స్ హౌస్ మేట్స్ చేతుల్లో కంటెస్టెంట్స్ కి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.

 

Related News

శ్రీవిద్యను ఆ స్టార్ హీరోయిన్ తో పోల్చిన వర్ష!

మీనా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? వాట్ ఏ క్రేజ్ మావా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బాలు పై అనుమానం.. మీనాకు నిజం తెలుస్తుందా..? బాలు, అరుణ్ మధ్య సుమతి..

Karthika Deepam 2 Serial Today Episode November 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నను పెళ్లి చేసుకోమని సూరజ్ కు చెప్పిన మాలిని

Illu Illalu Pillalu Today Episodes: అంజలి పై వల్లికి అనుమానం.. భద్రకు దిమ్మతిరిగే షాక్.. రామరాజు ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: రమ్యకు బిగ్ షాక్.. ప్రణతి ప్లాన్ సక్సెస్.. అర్ధరాత్రి పల్లవి హంగామా..

Brahmamudi Serial Today Episode November 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును స్టాల్ ను బ్యాడ్ చేయాలనుకున్న ఐషు

Big Stories

Advertisement
×