E-Paper
Advertisement

మ‌ళ్లీ ఐసీసీ ఛైర్మ‌న్ గా జై షానే.. 2030 వ‌ర‌కు టీమిండియా బొచ్చు కూడా పీక‌లేమంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

మ‌ళ్లీ ఐసీసీ ఛైర్మ‌న్ గా జై షానే.. 2030 వ‌ర‌కు టీమిండియా బొచ్చు కూడా పీక‌లేమంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!
Advertisement

Tanveer Ahmed Reaction On Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా రెండోసారి జై షా ఏకగ్రీవంగా పునర్నియామకం అయ్యాడు. బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా అతన్ని ఎన్నుకొని.. జై షా నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. ఈ క్రమంలో 2030 వరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జై షా కొనసాగనున్నారు. అయితే రెండోసారి ఐసీసీ చైర్మన్ బాధ్యతలు జై షాకు దక్కడంపై పాకిస్తాన్ మాజీలు రియాక్ట్ అవుతున్నారు. మొహ్సిన్ న‌ఖ్వీకి ఇవ్వాల్సిన పదవిని జై షా లాగేసుకున్నాడని ఫైర్ అవుతున్నారు.

2030 వ‌ర‌కు టీమిండియా బొచ్చు కూడా పీక‌లేం – త‌న్వీర్ అహ్మ‌ద్

ఐసీసీ చైర్మన్ గా రెండోసారి జై షా నియామకం కావడంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. రెండోసారి నియామకమైన జై షా… టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చే ప్రమాదం ఉందని బాంబు పేల్చాడు. 2030 వరకు అతడు పదవిలో కొనసాగుతాడని.. అప్పటి వరకు టీం ఇండియాను ఓడించడం పాకిస్తాన్ వల్ల కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2030 వరకు జరిగే ఐసీసీ టోర్నమెంట్లలో కచ్చితంగా టీమిండియానే ట్రోఫీ ఎగురేసుకు వెళ్తుందని కూడా ఆరోపించాడు. 2024 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. 2030 వరకు ఇలానే ఉంటుందని తెలిపాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

టీమిండియాకు అనుకూలంగా మైదానాలను జై షా మార్చుతున్నాడని, తాము మొదటి నుంచి దీనిపైనే మొత్తుకుంటున్నట్టు తెలిపాడు. ఇప్పుడు మళ్లీ అతడికే అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. ఇప్పటికైనా ఐసీసీ పెద్దలందరూ అతడిని దించి మొహ్సిన్ న‌ఖ్వీకి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొహ్సిన్ న‌ఖ్వీ… ఐసీసీ అధ్యక్ష పదవిలో ఉంటే అన్ని క్రికెట్ బోర్డులకు న్యాయం జరుగుతుందని తెలిపాడు. ఆ దిశగా అందరూ ముందుకు రావాలని కోరాడు. ఒకవేళ తాను చెప్పినట్టుగా ముందుకు రాకపోతే అన్ని క్రికెట్ బోర్డులకు నష్టమే జరుగుతుందని బాంబు పేల్చాడు. 2030 వరకు బీసీసీఐ క్రికెట్ బోర్డుకు మాత్రమే మేలు జరుగుతుందని తెలిపాడు.

జై షా పదవీకాలం ఎన్ని రోజులు అంటే ?

Advertisement

ఐసీసీ చైర్మన్ గా జై షా రెండోసారి ఎన్నికైన 2030 వరకు కొనసాగుతాడు. 2024 ఆగస్టులో తొలిసారిగా జై షా ఎన్నికై, డిసెంబ‌ర్ లో బాధ్యతలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే 35 సంవత్సరాల వయసులోనే ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. మొదటి ఎన్నిక ప్రకారం 2027 డిసెంబర్ వరకు జై షా పదవి కాలం ముగుస్తుంది. కానీ ఇప్పుడు మళ్లీ రెండోసారి ఎన్నిక కావడంతో 2030 వరకు అంటే మూడు సంవత్సరాలు అదనంగా అతడు ఐసీసీ అధ్యక్ష పదవిలో ఉంటాడు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

ఖ‌వాజా లీక్స్.. 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రికీ పాంటింగ్ బ్యాట్ స్ప్రింగులు పెట్టాడు!

దీపావ‌ళి నాడే గెలికారు, అందుకే చుక్క‌లు చూపించా…య‌శ్వీర్ గౌడ్ క్లారిటీ

ఇండియాకు మూడ్ వ‌చ్చిన‌ప్పుడల్లా పాకిస్తాన్ జ‌ట్టును చిత్తుగా ఓడిస్తోంది

మా వెధ‌వలు ముందు గెలికారు..అందుకు టీమిండియా కుర్రాళ్లు దూల తీర్చారు

య‌శ్వీర్ గౌడ్ ను చెప్పుల‌తో కొట్టాలి…పాకిస్తాన్ మాజీ మంత్రి సంచ‌ల‌నం!

2 రోజుల్లో రెండు ట్రోఫీలా? ఫిక్సింగ్ చేసి గెలిచారంటూ ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

తెలంగాణ ప‌వ‌ర్ ఏంటో చూపించాడు..యశ్వీర్ గౌడ్ ను మెచ్చుకున్న ఇర్ఫాన్ ప‌ఠాన్

Big Stories

Advertisement
×