Zomato On Train: కొన్నిసార్లు కొంత మంది చేసే పనులు అందరినీ నవ్విస్తాయి. తాజాగా ఓ బెంగళూరు టెక్కీ చేసిన పనికి ట్రైన్ ప్యాసెంజర్లతో పాటు నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంతకీ ఆయన ఏంశాడు? ఎందుకు జనాలు ఫన్నీగా ఫీలయ్యారనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
జోమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టిన సన్నీ గుప్తా
తాజాగా సన్నీ గుప్తా అనే బెంగళూరు టెక్కీ ముంబై నుంచి పుణెకు ఓ కాన్ఫరెన్స్ పని మీద వెళ్తున్నారు. లంచ్ టైమ్ కావడంతో రైల్వే సిబ్బందికి చెప్పి ఫుడ్ తెప్పించుకోవాలి అనుకున్నాడు. ఏ ఐటెమ్స్ తెప్పించుకోవాలో అవన్నీ లిస్టు రాసుకున్నాడు. అదే సమయంలో తన ఫోన్ కు ఓ అలర్ట్ వచ్చింది. కదులుతున్న రైల్లో కూడా నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చని ఆ నోటిఫికేషన్ లో ఉంది. ఇది కూడా మంచి టైమ్ కే వచ్చిందని భావించిన సన్నీ గుప్తా.. తన మొబైల్ లో జొమాటో యాప్ ను ఓపెన్ చేశాడు. PNR నెంబర్ ఎంటర్ చేస్తే , వచ్చే రైల్వే స్టేషన్లలో ఎక్కడ కావాలంటే అక్కడ ఫుడ్ డెలివరీ తీసుకునే అవకాశం ఉందని అందులో వెల్లడించారు. సరే అని చెప్పి సన్నీ పన్వెల్ రైల్వే స్టేషన్ లో డెలివరీ కావాలని చెప్తూ షెజువార్ రైస్ ఆర్డర్ చేశాడు.
అసలు ట్విస్ట్ ఏంటంటే?
ఆర్డర్ చేసే వరకు అంతా బాగానే ఉన్నా, ఆర్డర్ చేశాక అసలు ట్విస్ట్ మొదలయ్యింది. తను ప్రయాణించే రైలు అనివార్య కారణాలతో లేట్ గా నడుస్తుంది. ఈ నేపథ్యంలో జొమాటో మీద తొలిసారి రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, రైలు ఎంతసేపు ఆలస్యం అయినప్పటికీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ పన్వెల్ రైల్వే స్టేషన్ లో నిలబడి డెలివరీ ఇచ్చాడు. ఆలస్యం అయినా, విసుగు చెందకుండా డెలివరీ బాయ్ తన ఆర్డర్ ను అందించడంపై గుప్తా సంతోషం వ్యక్తం చేశాడు. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
So I’m travelling to Pune after a while.
By train from Mumbai!Happened to open @zomato and saw this prompt to enter my PNR! pic.twitter.com/5Jo6vJst3S
— Sunny R Gupta (@sunnykgupta) November 27, 2024
ఫుడ్ డెలివరీ బాయ్ పై నెటిజన్ల ప్రశంసలు
అటు గుప్తా ట్వీట్ చూసి చాలా మంది నెటిజన్లు ఫుడ్ డెలివరీ బాయ్ ని అభినందిస్తున్నారు. రైలు ఆలస్యం అవుతుందని తెలిసినా, ఏమాత్రం విసుగు చెందకుండా చిరునవ్వుతో కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేయడం గొప్ప విషయం అంటున్నారు. కస్టమర్ ను సాటిస్ ఫై చేసే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారని, అలాంటి వారిలో ఈ ఫుడ్ డెలివరీ బాయ్ ఒకడని కొనియాడుతున్నారు. మరోవైపు ఈ స్వీట్ రివేంజ్ పట్ల జొమాటో కూడా సంతోష పడే అవకాశం ఉందని కామెంట్స్ పెడుతున్నారు.
అటు గుప్తా ట్వీట్ చూసిన చాలా మంది రైల్వే ప్యాసెంజర్లు అతడి మాదిరిగానే తామూ కదులుతున్న రైల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం గుప్తా జొమాటో మీద గుప్తా స్వీట్ రివేంజ్ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.