E-Paper
Advertisement

చమ్మక్ చంద్రతో లవ్.. సత్య శ్రీ పేరెంట్స్ అంత గొడవ చేశారా?

చమ్మక్ చంద్రతో లవ్.. సత్య శ్రీ పేరెంట్స్ అంత గొడవ చేశారా?
Advertisement

Jabardasth Satya Sri: సత్య శ్రీ పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా కొనసాగి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అప్పటివరకు జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్స్ వేస్తూ అబ్బాయిలే కామెడీ చేసేవారు కానీ, మొట్టమొదటిసారి సత్య శ్రీ (Satya Sri)ఈ కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈమె చమ్మక్ చంద్ర(Chammak Chandra) టీంతో కలిసి స్కిట్ చేసేవారు. ఎక్కువగా చమ్మక్ చంద్ర భార్యగా స్కిట్లు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

చమ్మక్ చంద్ర నా గురువుగారు..

ఇలా చమ్మక్ చంద్ర భార్యగా సత్య శ్రీ స్కిట్లు చేయడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అప్పట్లో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అదేవిధంగా జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం నుంచి చమ్మక్ చంద్ర తప్పుకోవడంతో సత్య శ్రీ కూడా ఈ కార్యక్రమానికి దూరం కావడం వల్ల ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు. అయితే ఈ విషయం గురించి పలు సందర్భాలలో స్పందించిన సత్య శ్రీ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. చమ్మక్ చంద్ర గారు నాకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం ఇచ్చారు. ఆయన నాకు గురువుతో సమానం. నా గురువుగారు జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్లడంతో ఆయనపై ఉన్న గురు భక్తితోనే మా టీంలో కొంతమంది ఈ కార్యక్రమానికి దూరమయ్యామని క్లారిటీ ఇచ్చారు.

నెగిటివిటీ ఉంటే సక్సెస్ అయినట్టే..

Advertisement

ఇక చమ్మక్ చంద్రతో వచ్చిన లవ్ రూమర్ల గురించి కూడా సత్య శ్రీ ఈ సందర్భంగా స్పందిస్తూ.. చమ్మక్ చంద్ర గారితో ప్రేమలో ఉన్న సత్య శ్రీ అనే వార్తలు చూసి చాలా నవ్వుకున్నామని తెలిపారు. అయితే ఈ వార్త మొట్టమొదటిసారి నాకు చెప్పిన వ్యక్తి మా నాన్న అని సత్య శ్రీ తెలిపారు. ఇలా మా గురించి వచ్చిన వీడియోని నాన్న నాకు చూపించారు. ఇది చూసిన తర్వాత నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడ్డాను కానీ ఆయన మాత్రం చాలా పాజిటివ్ గా మాట్లాడారు . నీ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయి అంటే నువ్వు సక్సెస్ అయినట్టే, జనాలకు నువ్వు తెలిసినట్టే మన గురించి అనేవాళ్లు ఎన్నైనా అంటారు నువ్వు మాత్రం నీ ప్రయాణం ఆపొద్దు అంటూ అమ్మ నాన్న చాలా ప్రోత్సహించారని సత్య శ్రీ తెలిపారు.

నాన్నకు ఇష్టం లేదు..

నిజానికి తాను జబర్దస్త్ కార్యక్రమంలోకి రావడం అమ్మకు ఇష్టం కానీ నాన్నకు ఏమాత్రం ఇష్టం లేదు ఆ సమయంలో మా ఇంట్లో చాలా గొడవలు కూడా జరిగాయని, నాన్నకు ఇష్టం లేకుండా వచ్చి ఇలాంటి వార్తలు నా గురించి రావడంతో కచ్చితంగా కోప్పడతారు అనుకున్నాను కానీ నాన్న మాత్రం నన్ను వీటి గురించి పట్టించుకోవద్దని తెలిపారు. జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్న ఎదురవుగా అవకాశం వస్తే తప్పకుండా తిరిగి తాను జబర్దస్త్ కార్యక్రమంలోకి వస్తానని నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది జబర్దస్త్ వల్లే అంటూ సత్య శ్రీ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: కార్తీకదీపం సీరియల్ నటుడు “ఓ టార్చర్ ప్రేమ” సినిమా టీజర్ లాంఛ్

Related News

సరిగమప షోకి వెళ్లడం వెనుక అసలు కారణం చెప్పేసిన అనిల్ రావిపూడి!

కెప్టెన్ అయ్యాక కొమ్ములొచ్చాయా? అమన్ మసూద్ కు క్లాస్ పీకిన నాగార్జున!

రాము రాథోడ్, లిఖిత కాంబోలో టాప్ 5 సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్!

నీది చీప్ క్యారెక్టర్.. క్షమాపణ చెప్పాల్సిందే..వర్షిణి, త్రిగుణ్ పై నాగ్ సీరియస్!

నలుగురు దర్శకులు రిజెక్ట్.. నెట్టింట ట్రెండింగ్ లో నిలిచిన ‘కొయిల’ సాంగ్..

చెయ్యి చేసుకోబోయిన రోహిత్.. షో నుంచి వెళ్లిపోయిన మిథిలేష్!

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ బయట పెట్టిన ఝాన్సీ… ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే?

Big Stories

Advertisement
×