Jabardasth Satya Sri: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించిందని చెప్పాలి. ఈ కార్యక్రమంలో కమెడియన్స్ గా చేసిన వారందరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సత్య శ్రీ (Satya Sri)ఒకరు. చమ్మక్ చంద్ర టీంలో స్కిట్లు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సత్య శ్రీ జబర్దస్త్ (Jabardasth) నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఈమె పలు షోలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యశ్రీకి అనసూయ (anasuya) సుధీర్ (sudheer)జబర్దస్త్ నుంచి బయటకు రావడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కమెడియన్ గా సుధీర్, యాంకర్ గా అనసూయ మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఉన్నఫలంగా వీరిద్దరూ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఎందుకు తప్పుకున్నారు అనే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక తాజాగా సత్యశ్రీ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సుడిగాలి సుదీర్, అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి పూర్తిగా వారి వ్యక్తిగత కారణాలేనని తెలిపారు. నాకు తెలిసినంతవరకు వారిద్దరికీ బయట మంచి షోలలో అవకాశాలు వచ్చి ఉండవచ్చు అందుకే తప్పుకున్నారు. నాకు తెలిసి ఇదే కారణం మరి వాళ్ళు వెళ్లిపోవడానికి అసలు కారణం ఏంటో నాకు తెలియదని ఈ సందర్భంగా సత్య శ్రీ తెలిపారు. ఎక్కడికి వెళ్లినా మేం చేసేది ఒకటే పర్ఫామెన్స్ ఇప్పుడు మేము వేరే షోలలో చేసిన చమ్మక్ చంద్ర అని పిలుస్తారు సుడిగాలి సుదీర్ అని మాత్రమే పిలుస్తారని మాకు గుర్తింపు తీసుకువచ్చింది జబర్దస్త్ కార్యక్రమమే అంటూ సత్య శ్రీ తెలిపారు.
ఇక అనసూయ యాంకర్ గా జబర్దస్త్ షో ద్వారా సక్సెస్ అయ్యారు అలాంటిది ఈమె ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టడంతో ఈ షో గురించి ఎన్నో రకాల విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో తనపై డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ విమర్శించడమే కారణమని వార్తలు బయటకు వచ్చాయి. ఇక సుధీర్ కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వ్యక్తిగత కారణాల వల్ల బయటకు వెళ్లిపోయారు. అయితే ఈయన మాత్రం ప్రస్తుతం వరుస టీవీ షోలకు యాంకర్ గా కొనసాగుతూ మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: చమ్మక్ చంద్రతో లవ్.. సత్య శ్రీ పేరెంట్స్ అంత గొడవ చేశారా?