Vaishnavi Sony Remuneration:ఫోక్ సాంగ్స్ వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతుండటంతో ఇపుడు అందులో నటించే వారికి కూడా మంచి గుర్తింపే లభిస్తుంది.ఇక ఆ గుర్తింపే కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పక్కర్లేదు.మరి ఈ మధ్య కాలంలో వరుస ఫోక్ సాంగ్స్ తో అదరగొడుతున్న ఫోక్ క్వీన్ వైష్ణవీ సోనీ అసలు ఒక్కో పాటకి ఎంత తీసుకుంటుందో ఒకసారి చూసేద్దాం.
మనందరికీ గురొచ్చే పాట
వైష్ణవీ సోని అనగానే మనందరికీ గురొచ్చే పాట ..బాసింగ బాలాలు అనే వైరల్ ఫోక్ సాంగ్ .ఈశ్వర్ సాయితో జోడీ కట్టి చేసిన ఈ పాట ఇప్పటికే 276మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది ఈ భామ.
ఆ తర్వాత బాగుంది ,బిందె మీద బిందె పెట్టి ,ఎదులొచ్చే ముద్దువెట్టె,మల్లె చెట్టు కింద కూసున్న ,గుజ్జరి 2,పోరి రాయే జాతర ఎండి గజ్జె పైడి మువ్వా ,గున్న గున్న ఓయ్ వంటి ఎన్నో సాంగ్స్ ని తన స్టెప్పులతో మిలియన్ల వ్యూస్ ని దాటేలా చేసింది.ఇక ఈ మధ్య కాలంలో మాధురి రాథోడ్ కి పోటీగా ఫోక్ సాంగ్స్ చేస్తుంది ఒక్క వైష్ణవీ సోనీని కావడంతో మేకర్స్ అంతా ఇప్పుడు ఈమె చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తుంది.
ఒక్కో పాటకి ప్రస్తుతం 2 నుండి 3 లక్షల వరకు
ఇక వైష్ణవీ సోనీ కూడా తనదైన అందం ,అభినయం, మూమెంట్స్ ,ఎక్స్ప్రెషన్స్ తో పాటని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు .ఇక పారితోషికం విషయానికి వస్తే వైష్ణవి సోనీ ఒక్కో పాటకి ప్రస్తుతం 2 నుండి 3 లక్షల వరకు తీసుకుంటుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ .అయితే డిమాండ్ ,సందర్భం బట్టి పారితోశికం లో ఎక్కువ తక్కువలు కూడా ఉండొచ్చని తెలుస్తుంది.
వైష్ణవీ సోని విషయానికి వస్తే
అయితే వైష్ణవి సోనీ పారితోశికం ఇంత అనేది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలుగానే చూడాలి ,ఇక ఇప్పటివరకు తానెంత తీసుకుంటున్న అన్నది అఫీషియల్ గా ఎక్కడా బయటపెట్టలేదు ఈ భామ.ఇక వైష్ణవీ సోని విషయానికి వస్తే తెలంగాణ కి చెందిన వీరిది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం అని సమాచారం.ఇక ప్రస్తుతం బీటెక్ చేస్తూనే మరోవైపు ఫోక్ సాంగ్స్ లో తనదైన టాలెంట్ చూపిస్తుంది.
ఇక చిన్నప్పటి నుండే ఫోక్ సాంగ్స్ చేయడంలో ఆరితేరిన వైష్ణవీ కి బలం తన అందం తో పాటు బాడీలోని గ్రేస్ అని చెప్పాలి .చూడాలి మరి ప్రస్తుతం వరుస ఫోక్ సాంగ్స్ తో దూసుకుపోతున్న వైష్ణవి వచ్చే రోజుల్లో ఏమైనా అఫీషియల్ గా పారితోషికం విషయాన్ని చెబుతుందో లేదో !
ALSO READ:ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్.. మాధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ !