E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ పెద్ద షాక్ ఇచ్చిన రాజు

Brahmamudi Serial Today Episode November 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ పెద్ద షాక్ ఇచ్చిన రాజు
Advertisement

Brahmamudi serial today Episode:  రాజు, ఇందు తనను హగ్ చేసుకున్నట్టు కలగంటూ మెలికలు తిరిగిపోతుంటాడు. వెనక నుంచి చూసిన ఇందు షాక్‌ అవుతుంది. ఓహో డ్రీమ్‌లో ఉన్నావా..? బావ చెప్తాను ఉండు అనుకుంటూ రూంలోకి వెళ్లి రాజును పిలిచి ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు.. నిలబడి కలలు కంటున్నావా..? ఏంటి అసలు ఏమైంది బాసూ నీకు అంటూ అడిగితే.. ఏం లేదులే కానీ నువ్వు నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా..? మెహమాట పడకు పర్వాలేదు.. చెప్పు.. ఇప్పుడు నేను అమ్మమ్మ, తాతయ్యకు చేసింది చాలా చిన్న ఫేవర్‌ దానికే మెల్ట్‌ అయిపోయి మెస్మరైజ్‌ అయిపోయి నీ మనసులోని ఎమోషన్స్‌ అన్ని నాతో చెప్పాలి అనుకుంటే చెప్పేయ్‌ ఇందు కమాన్‌ చెప్పు అంటాడు. నువ్వు వాళ్లకు హెల్ప్‌ చేస్తే నీకెందుకు నేను థాంక్స్‌ చెప్తాను వాళ్లు ఆల్‌రెడీ థాంక్స్‌ చెప్పారు కదా అంటుంది. రాజు డిస్సపాయింట్‌ అయిపోతాడు.

తర్వాత అందరూ భోజనం చేస్తుంటే.. రేఖ, భూషణ్‌, బ్రమరాంబ, శేషు టిఫిన్‌ చేయడానికి వెళ్తారు. రేఖ కింద కూర్చుంటుంది. శేషు కుర్చీలో కూర్చోబోతుంటే.. భ్రమరాంబ ఆపేసి ఒక్కసారి అటు చూడు అంటుంది. శేషు చూసి రేఖ శిక్ష విధించుకుని మమ్మల్ని శిక్ష అనుభవించమంటుంది ఏంటి..? అని మనసులో అనుకుంటాడు శేషు. భూషణ్‌ ఆశ్చర్యంగా అక్కా ఏమైంది రేఖకు చీప్‌ గా కింద కూర్చుంది. ఇప్పుడు మనం కూడా వీళ్ల ముందు కింద కూర్చోవాలా..? అంటే తమ్ముడు రేఖ ఏం ప్లాన్‌ చేసినా దానికి ఒక బలమైన కారణం ఉంటుంది అంటే శేషు తాను కూర్చోలేనని అంటే ఏంటి తప్పించుకుందామనుకుంటున్నారా..? అందరం కూర్చోవాల్సిందే. అంటూ ముగ్గురు రేఖ పక్కన కూర్చుంటారు. ఇందు వచ్చి ఎందుకు కింద కూర్చున్నారు అని అడిగితే..

Advertisement

ఇరవై ఏళ్లు ఉంటున్న బెడ్‌రూం ఖాళీ చేయించి స్టోర్‌రూంలో పడేశారు కదా ఇప్పుడు కింద కూర్చుంటే ఏమవుతుంది అని రేఖ చెబితే.. ఇరవై ఏళ్లకు ముందు మా అమ్మమ్మ తాతయ్య ఉన్న ఆ రూంను నిర్దాక్షిణ్యంగా మీరు ఖాళీ చేయించినప్పుడు ఏమైంది మానవత్వం.. వాళ్ల రూం వాళ్లకు ఇస్తే మీరు బాధపడతారేంటి..? అంటూ రాజు అడిగితే..  అది కరెక్టే కదా అల్లుడు అంటాడు శేషు. దుగ్గిరాల ఇంటికి వీళ్లు శక్తికి మించి చేశారు. వాళ్ల ఆనందాన్ని మీరు లాక్కోవడం నాకు ఇష్టం లేదు.. అంటూ రాజు చెబితే అంతా నీ ఇష్టమేనా..? అంటూ రేఖ అడిగితే.. ఇక్కడ ఎవరి ఇష్టాలతో పని లేదు.. ఇంటికి కోసం ఎవరు కష్టపడ్డారో తెలసుకుని న్యాయం చేస్తున్నా అంటాడు. శేషు నాకు తెలుసు అల్లుడు నువ్వు తల్లీబిడ్డ న్యాయం చేస్తావు అంటాడు. రేఖ లేచి వెళ్లి డైనింగ్ టేబుల్‌ దగ్గరకు వెళ్లి కుర్చీలో కూర్చుని ఐశ్వర్య కోసం సంతకం చేయమని అడుగుతుంది. చేయనని ఇందు చెప్పగానే.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

రూంలో ఉన్న ఐశ్వర్య ఇందును తిట్టుకుంటుంది. సంతకం పెట్టమంటే పెట్టదా..? ఇప్పుడు ఎం చేయాలి..? ఎలా బిజినెస్‌ ఎక్స్‌ఫోకు ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుంది. అప్పుడే లక్కీ భోజనం తీసుకొస్తాడు. భోజనం చేసి టాబ్లెట్‌ వేసుకో అని చెబితే.. ఐశ్వర్య కోపంగా తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఐశ్వర్య కోపంగా భోజనం ప్లేట్‌ తీసుకెళ్లి కిందకు విసిరి పడేస్తుంది. ఆ ప్లేట్‌ కింద భోజనం చేస్తున్న వాళ్ల పక్కన పడుతుంది. అందరూ షాకింగ్‌గా  చూస్తుంటే.. రాజు మీరు తినండి తాతయ్య విసిరింది పూర్తిగా మారిన చంద్రముఖి అంటాడు.

Advertisement

రేఖ, భ్రమరాంబ కోపంగా మీరందరూ కడుపునిండా తినండి అంటారు. ఎవరు ఎలా పోతే మీకెందుకు మీరు మాత్రమే అన్ని డీల్స్‌ చేయాలి అన్ని కోట్లు సంపాదించాలి అంటూ తిడుతుంటే.. అపర్ణ కోపంగా శపిస్తున్నావా..? అంటే నాకేమైనా పవర్స్‌ ఉన్నాయా..? శపించడానికి అంటే ఇది మాత్రం కరెక్టుగా ఒప్పుకున్నావు పిన్ని అంటే.. రేఖ భోజనం చేయకుండా వెళ్లిపోతుంది. భూషణ్‌, భ్రమరాంబ కూడా నాకొద్దు అనుకుంటూ వెళ్లిపోతారు. వాళ్ల ప్లేట్స్‌ చూసిన శేషు దున్నపోతుల్లాగా మెక్కాల్సింది మెక్కేసి నాకొద్దు అంటే నాకొద్దు అంటూ వెళ్లిపోయారు అంటూ తిడుతూ.. అపర్ణ గారు మీరు తినండి అంటాడు.

రూంలోకి వెళ్లిన రేఖ కోపంగా భ్రమరాంబను తిడుతుంది. నేను గొడవ పడి లేచి వచ్చేలోపే మొత్తం తినేశావు.. ఒక్కపూట తినకపోతే ఉండలేవా..? అంటుంది. ఉదయం రాజు చేసిన అవమానం తలుచుకుంటే కడుపు మండిపోతుంది అంటుంది. అందరూ కలిసి రాజు గురించి మాట్లాడుకుంటారు. ఎలాగైనా రాజును ఎదురించాలని వాడిని ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టాలని ప్లాన్‌ చేస్తారు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu TV Serials: టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..ఫ్యాన్స్ కు బిగ్ షాక్..

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతి కాపురంలో పల్లవి చిచ్చు.. రమ్యకు దిమ్మతిరిగే షాక్.. పల్లవికి వార్నింగ్..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode November 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మ షాపింగ్‌ మాల్‌లో పార్థును చూస్తారా..?   

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

కొడుకుని చూడగానే బోరున ఏడ్చేసిన సుదీర్ తల్లి.. నీతూ మాస్టర్ కు స్పెషల్ రిక్వెస్ట్..

అవినాష్ జీవితంలో ఇంత విషాదమా.. జీవితాంతం మరువలేని నరకం అంటూ!

Big Stories

Advertisement
×