Karthika Deepam 2 serial today Episode: ఆ ఇన్వెస్టర్ నిన్ను మాటలతో అంత ఇబ్బంది పెడుతుంటే నీ కోపం ఎక్కడికి వెళ్లింది.. అంటూ సూరజ్ అడిగితే.. కొందరి మీద ఉన్న ఇష్టం వల్ల ఆ కోపం మారిపోయింది. నువ్వు గుణంలో గుణవంతుడివి.. నేను చాన్స్ ఇచ్చినా నువ్వు హద్దు మీరలేదు.. ఇంత మంచి గుణం ఇచ్చిన ఆ దేవుడు కాస్త బుద్ది ఇచ్చి ఉంటే బాగుండు అంటుంది జ్యోత్స్న. అంటే నాకు ఇప్పుడు బుద్ది లేదంటావా..? అంటూ సూరజ్ కోపంగా అడిగితే.. లేదనెగా చెప్తున్నాను.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటావా..? అని అడిగితే..
అవును ఎప్పుడూ ఇలాగే ఉంటాను.. నీకు ఏమైనా ఎవ్వరూ ఉన్నా లేకున్నా నేను ఉంటాను అంటాడు సూరజ్. నువ్వు ఎందుకు ఉంటావు అని జ్యోత్స్న ప్రశ్నిస్తే.. ఉంటానని చెప్పడం నా బాధ్యత. నేను చెప్పాలి అనుకున్నాను చెప్పాను.. నువ్వు తీసుకుంటావా లేదా అన్నది నీ ఇష్టం అంటాడు సూరజ్. జ్యోత్స్న, సూరజ్‌కు థాంక్స్ చెప్తుంది. థాంక్స్ కోసం సాయం చేయలేదు ఏదో ఇవ్వాలనిపించింది ఇచ్చాను అంటూ సూరజ్ చెబితే.. నేను తీసుకోవాలి అనుకుంటే తీసుకుంటాను నువ్వే కన్ఫీజ్‌లో ఉన్నావు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించుకో నీ మనసు ఏం చెప్తుందో అదే విను అంటూ చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
సూరజ్ ఒంటరిగా కూర్చుని జ్యోత్స్న గురించి ఆలోచిస్తుంటే.. కార్తీక్, దీప వెళ్తారు. పర్సనల్‌గా మాట్లాడాలని చెప్తారు. ఏం మాట్లాడాలి అని సూరజ్ అడిగితే.. నువ్వు ఎక్కడో వదిలేసిన కథ గురించి అక్కడి నుంచే మొదలు పెట్టే కథ గురించి అంటారు కార్తీక్, దీప. ఏంటా కథ అని సూరజ్ అడిగితే.. దీప తన చేతిలో ఉన్న తాళి తీసి చూపిస్తుంది. సూరజ్ షాక్ అవుతాడు. ఇది నువ్వు వదిలేసిన తాళే గుర్తుందా..? అంటూ దీప అడిగితే.. దీన్నీ మీరెందుకు దాచారు అని సూరజ్ అడిగితే.. దీని జాగ్రత్తగా దాచింది మేము కాదు జ్యోత్స్న నువ్వు తనకు ఇచ్చిన గులాబీ.. తను నీకిచ్చిన రింగ్.. కట్టుకుండా వదిలేసిన తాళి అంటూ దీప చెప్తుంటే.. సూరజ్ అన్ని గుర్తు చేసుకుంటాడు. నువ్వు ఇచ్చిన ప్రేమ, జ్ఞాపకాలు ఇంకా తన దగ్గర అలాగే ఉన్నాయి సూరజ్ అంటూ చెప్తుంది దీప. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు వదిన అని అడిగితే నీ మనసులో కూడా అలాంటి ప్రేమ జ్యోత్స్న మీద ఉంది కాబట్టి అంటూ కార్తీక్ చెప్తాడు.
లేదు నా మనసులో ఎవరి మీద ప్రేమ లేదు అంటాడు సూరజ్. ఇదే నిజం అయితే జ్యోత్స్న కోసం డీల్ క్యాన్సిల్ చేసేవాడివే కాదు.. దీనికి నువ్వే ఒక ముగింపు ఇవ్వాలి అంటూ కార్తీక్ చెబితే.. ఏం ముగింపు ఇవ్వాలని సూరజ్ అడుగుతాడు. నువ్వు జ్యోత్స్న మెడలో తాళి కట్టాలి అంటాడు కార్తీక్. అందుకు సూరజ్ కోప్పడతాడు. ఆ తాళి తీసుకెళ్లి జ్యోత్స్నకు ఇవ్వండి అంటాడు. ఇవ్వాల్సి వస్తే అది నువ్వే తీసుకెల్లి ఇవ్వాలి. ఈసారి చేతిలో వేయడం కాదు మెడలో వేయాలి అంటూ కార్తీక్ చెప్తాడు. దీప తాళి సూరజ్ ముందు పెట్టి ఇది తీసుకుంటావో వదిలేస్తావో నీ ఇష్టం అంటూ చెప్పి వెళ్లిపోతారు. అంతా చాటు నుంచి చూస్తున్న మాలిని షాక్ అవుతుంది. సూరజ్ తాళి తీసుకుని చేతితో పట్టుకుని చూస్తుంటే మాలిని మరింత షాక్ అవుతుంది.
కట్ చేస్తే సూరజ్ ఆ తాళి తీసుకుని ఇంటికి వెళ్లి తన చేతిలో పట్టుకుని చూస్తూ… జ్యోత్స్న చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే దక్షిణమూర్తి రావడంతో తాళి తీసి జేబులో వేసుకుంటాడు సూరజ్. మన కోసం మనం బతకడం గొప్ప కాదు మన కోసం బతికే వాళ్ల కోసం బతకడం గొప్ప నీ కోసం జ్యోత్స్న బతుకుతుంది. నీ మనసులో జ్యోత్స్న ఉంది. జ్యోత్స్న మనసులో నువ్వు ఉన్నావు.. అందుకే జ్యోత్స్నను పెళ్లి చేసుకో.. మూడు ముళ్ల దగ్గర ఆగిపోయిన మీ కథను అదే మూడు ముళ్లతో ముందుకు తీసుకెళ్లు అంటూ దక్షిణమూర్తి చెప్తాడు. సూరజ్ మౌనంగా వింటుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.