E-Paper
Advertisement

డాక్టర్ బాబు పరువు తీసేసిన వంటలక్క.. జ్యో కి షాక్..ఇది కదా అసలు ట్విస్ట్..

డాక్టర్ బాబు పరువు తీసేసిన వంటలక్క.. జ్యో కి షాక్..ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Adivaram With Star Maa Parivaram : ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా జనాలని ఎంటర్టైన్ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రోగ్రాంలను కూడా ప్రసారం చేస్తూ ఉంటుంది.. ఇందులో ప్రసారం అవుతున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఒకటి. ఈ షో కి సంబంధించిన ఆదివారం ఎపిసోడ్ ప్రోమో ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఆన్ స్క్రీన్ లో తమ నటనతో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం టీం ఈ ఆదివారం సందడి చేయబోతుంది.. మరి ఇప్పుడు విడుదలైన ప్రోమోను చూస్తే ఈ సీరియల్ టీమ్ రచ్చ చేసినట్లు తెలుస్తుంది. డాక్టర్ బాబుకి దిమ్మ తిరిగిపోయేలా వంటలక్క షాక్ ఇస్తుంది.. ఒకసారి ఈ ప్రోమో ఎలా ఉందో చూసేద్దాం..

శివన్నారాయణపై అవినాష్ సెటైర్లు..

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి తన గ్యాంగ్‌తో చేసే అల్లరి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. బుల్లితెర తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లను గెస్టులుగా తీసుకు వచ్చి వారితో ఆడించే ఆటలతో పాటుగా కామెడీ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ ఆ షో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కి కార్తీకదీపం టీం గెస్ట్లుగా వస్తారు. దానికి సంబంధించిన ప్రోమో ని ప్రస్తుతం స్టార్ మా రిలీజ్ చేసింది.. శివన్నారాయణను పట్టుకుని.. పారిజాతంకి నాన్నలా చేయడం అంటే గ్రేట్ అని అవినాష్ కామెడీ చేస్తాడు. నాన్న కాదురా.. భర్తగా చేశారు అని అంటారు. తర్వాత బుల్లి సౌర్యని మీ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అని శ్రీముఖి అడుగుతుంది.. తాను చేసిన పర్ఫామెన్స్ పై మళ్లీ కామెంట్లు కురిపిస్తారు..

డాక్టర్ బాబు పరువు తీసేసిన దీప..

Advertisement

ఆ తర్వాత బావా.. ఒకసారి ఇటు రావా అని సిగ్గు పడుతూ పిలుస్తుంది దీప.. కార్తీక్ ఓ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేస్తాడు..జ్యోత్స్న, కార్తీక్ కలిసి స్టెప్పులు వేస్తారు.. జ్యో, దీప ఇద్దరు కూడా డైలాగులతో అందరిని ఆకట్టుకుంటారు.. ఇక శ్రీముఖి షూటింగ్‌లో కోప్పడకుండా, కూల్‌గా ఉండేది ఎవరు అంటే.. అందరూ కార్తీక్ పేరు చెబుతారు. కామాక్షి మాత్రమే దీప వైపు ఉంటుంది.. దానికి డాక్టర్ బాబు అది కోపం కాదు తిక్క అని అంటాడు. సెట్‌లో ఎవరు లేజీగా ఉంటారు అని అడిగితే.. మా బావే లేజీ అని జ్యోత్స్న అంటుంది. ఒకసారి ఈ సెట్ లో ఆయన ఎలా ఉంటాడో చూపించండి అని శ్రీముఖి అడగ్గానే దీప తనకు అసిస్టెంట్గా అవినాష్ ని పెట్టుకొని కార్తీక్ ని ఇమిటేట్ చేస్తుంది.. మొత్తానికి వంటలక్క డాక్టర్ బాబు పరువు ని అడ్డంగా తీసేస్తుంది.. ప్రస్తుతం ప్రోమో అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఆదివారం షో ని అసలు మిస్ అవ్వకుండా చూడాలి..

Related News

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Big Stories

Advertisement
×