Hero Vikram: ప్రముఖ కోలీవుడ్ హీరో విక్రమ్ (Vikram )గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఏ సినిమా చేసినా సరే అందులో తప్పకుండా తన మేనరిజం మనకు కనిపిస్తుంది. తన సినిమాలతో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఆయన ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరా ధీరా శూరన్ -2’. అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దుషారా విజయన్ (Dushara Vijayan) హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్ పై రియా శింబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. మార్చి 27వ తేదీన గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలుగు పరిశ్రమను చూస్తే అసూయ వేస్తోంది – విక్రమ్
ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కారణంగా ప్రమోషన్స్ జోరుగా చేపట్టడమే కాకుండా సినిమా నుంచి వరుస అప్డేట్స్ కూడా వదులుతున్నారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న విక్రమ్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. విక్రమ్ మాట్లాడుతూ.. “నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీపై అసూయగా ఉంది. తెలుగులో భారీ కమర్షియల్ సినిమాలు బ్లాక్ బాస్టర్ అవడంతో పాటు చిన్న చిన్న చిత్రాలు కూడా ఘనవిజయాన్ని అందుకుంటున్నాయి. అలాగే తమిళ్ పరిశ్రమలో కూడా అలాంటి సినిమాలు రావాలి అని , దాని పైనే తమిళ్ పరిశ్రమ కూడా పనిచేస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆర్టిస్టులుగా మాకు కావాల్సింది ఇదే” అంటూ కూడా తెలిపారు విక్రమ్. తన సినిమా గురించి చెబుతూ.. “వీర ధీర శూరన్ -2 సినిమా ఒక మంచి సినిమా మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ కూడా మీకు ఇస్తుంది. అందరూ చూసి సినిమాను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను”అంటూ తెలిపారు విక్రమ్. ఇక ప్రస్తుతం విక్రమ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విక్రమ్ కెరియర్..
విక్రమ్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తెలుగు సినిమా ‘శివపుత్రుడు’ సినిమా తమిళ్ మూలమైన ‘పితామగన్’ చిత్రానికి ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. తమిళనాడులోని రామనాథపురం పరమకుడి లో జన్మించారు విక్రమ్.. ఇదే ఊరు నుండి ముగ్గురు జాతీయ ఉత్తమ నటులు ఉండడం విశేషం అనే చెప్పాలి. వారిలో చారు హాసన్ (Charu Haasan), కమల్ హాసన్ (Kamal Haasan), సుహాసిని(Suhaasini). ఇకపోతే విక్రమ్ తండ్రి వినోద్ రాజు. ఈయన తమిళ్, కన్నడ చిత్రాలలో నటించారు. నృత్య రంగంలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక చదువుకున్నది మార్కాడ్. చెన్నైలోని లయోలా డిగ్రీ కళాశాల నుండి బిఏ ఆంగ్ల సాహిత్యంలో పట్టా అందుకున్న విక్రమ్.. అక్కడే ఎంబీఏ కూడా పూర్తి చేశారు. కరాటే ,ఈత, గిటార్, పియానో వంటి వాటిల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఇక హాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా చూసి ఆ తర్వాతే నటన మీద ఆసక్తి పెంచుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు.