Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj) పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్(TV Anchor) గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ వెండి తెరపై ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే అనసూయ పెద్ద ఎత్తున వివాదాలలో కూడా నిలుస్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా తన గురించి ఏదైనా విమర్శలు వస్తే ఏమాత్రం వెనకడుగు వేయకుండా అనసూయ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వారికి తనదైన శైలిలోనే సమాధానాలు చెబుతూ ఉంటారు.
నన్ను టార్గెట్ చేస్తున్నారు…
ఇకపోతే అనసూయ వేసుకొనే దుస్తుల గురించి ఎక్కువగా విమర్శలు వస్తూ ఉంటాయి. ఇలా తన వస్త్రధారణ (Dressing Style) గురించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనసూయ ఆ విమర్శల పట్ల స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె ఈ పోస్ట్ షేర్ చేస్తూ…కొందరు తన గురించి తప్పుడు వీడియోలను తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జీవితాన్ని నాకు నచ్చినట్టు బ్రతుకుతున్నా ఇటీవల కొన్ని సోషల్ మీడియా చానల్స్ నన్ను టార్గెట్ చేస్తూ నాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో కూడా వాళ్లకు తెలియదు కానీ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని తెలిపారు.
నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా…
మీరందరూ చెప్పిన విధంగానే నేనొక మహిళను, ఒక భార్యను అలాగే ఇద్దరు బిడ్డల తల్లిని. నేను తల్లిని అయినంత మాత్రాన నాకు నచ్చిన దుస్తులు నేను వేసుకోకూడదా? నేను నాకు నచ్చిన దుస్తులు వేసుకుని తిరుగుతున్నాను అంటే అందుకు నా కుటుంబం మద్దతు పూర్తిగా ఉందని, ఈ విషయాన్ని కొంతమంది సహించలేకపోతున్నారని అనసూయ తెలియ చేశారు. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను అంటే విలువలను కోల్పోయినట్లు కాదని, మీ జీవితాన్ని మీకు ఇష్టం వచ్చినట్లు ఎలా అయితే బతుకుతున్నారో నేను కూడా అలాగే ముందుకు సాగుతున్నానని తెలిపారు.
నేను నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటున్నారు అయితే నా స్వేచ్ఛకు ఎవరైనా భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది ఉండదు అంటూ ఈ సందర్భంగా తన పట్ల విమర్శలు చేసే వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగానే బ్రతుకుతానని ఈ సందర్భంగా మరోసారి అనసూయ ఘాటుగా స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా అనసూయ చేసిన ఈ పోస్టుపై ఎంతోమంది నెటిజన్స్ స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలా ఒకరి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కెరియర్ విషయానికొస్తే పలు సినిమాలలో నటిస్తూ అనసూయ ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Big tv Kissik Talks: తలరాత…అరెస్ట్ గురించి కన్నీళ్లు పెట్టుకున్న రైతు బిడ్డ…కర్మ వదలదంటూ!