BigTV English

OTT Movie : కాటికి కాళ్ళు చాపే వయసులో, భార్య ఉండగా లవర్ ను తెచ్చుకుని… మరీ ఫ్యామిలీ ముందే ఇదేం పాడు పని మావా ?

OTT Movie : కాటికి కాళ్ళు చాపే వయసులో, భార్య ఉండగా లవర్ ను తెచ్చుకుని… మరీ ఫ్యామిలీ ముందే ఇదేం పాడు పని మావా ?

OTT Movie : మలయాళం సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అంతలా తెలుగు హృదయాలను ఈ ఇండస్ట్రీ గెలుచుకుంది. ఈ సినిమాలను ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారు అనే సందేహం కొంతమందికి రావచ్చు. అయితే ఈ సినిమాలను వీళ్ళు తెరకెక్కించే విధానం రియలిస్టిక్ గా ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో ఇట్టి (అలెన్సియర్ లే లోపెజ్) పాత్ర అద్భుతంగా చిత్రీకరించబడింది. అతను ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులను అసహ్యించుకునేలా చేస్తాడు. అలెన్సియర్ లే లోపెజ్‌ నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో స్పెషల్ మెన్షన్ లభించాయి. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …


సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

అప్పన్ (Appan) 2022లో విడుదలైన మలయాళ ట్రాజెడీ సినిమా. దీనికి మాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సన్నీ వేన్ ప్రొడక్షన్స్, టినీ హ్యాండ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల కింద తెరకెక్కింది. ఈ సినిమాలో సన్నీ వేన్, అలెన్సియర్ లే లోపెజ్, పౌలీ వల్సన్, అనన్య, గ్రేస్ ఆంటోనీ, రాధిక రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. థొడుపుజ్జలోని రబ్బర్ తోటల నేపథ్యంలో ఈ సినిమా ఒక విషాదకరమైన కుటుంబ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రం 2022 అక్టోబర్ 28న సోనీ లివ్‌లో ఓటీటీ రిలీజ్‌గా విడుదలై, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. ఇది IMDbలో 7.5/10 రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


స్టోరీలోకి వెళితే

థొడుపుజ్జలోని ఒక రబ్బర్ తోటల మధ్య ఉన్న ఒక పాత మాన్షన్‌లో, ఒక సాధారణ క్రైస్తవ కుటుంబం నిసిస్తుంటుంది. ఈ కుటుంబంలో ఇట్టి (అలెన్సియర్ లే లోపెజ్), అతని భార్య కుట్టియమ్మ (పౌలీ వల్సన్), వారి కొడుకు న్జూంజు (సన్నీ వేన్), న్జూంజు భార్య రోసీ (అనన్య), వారి చిన్న కొడుకు అబెల్ (ద్రుపద్ కృష్ణ) ఉంటారు. ఇట్టి ఈ కుటుంబంలో ఒక క్రూరమైన వ్యక్తి,, స్త్రీలోలుడు. అతను పక్షవాతంతో బెడ్‌రిడ్డెన్‌గా ఉన్నప్పటికీ, తన కుటుంబాన్ని నిరంతరం హింసిస్తుంటాడు. అతను గతంలో గ్రామంలో అనేకమందిని బాధపెట్టి, స్త్రీలను వేధించి, శత్రువులను సృష్టించుకున్నాడు. ఇప్పుడు అతని కుటుంబంతో సహా గ్రామస్తులు కూడా అతని మరణం కోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఇట్టి తన చెడు స్వభావంతో ఇంకా వారిని బాధపెడుతూనే ఉంటాడు.

సినిమా మొదటి సన్నివేశంలో, కుట్టియమ్మ తన భర్త మరణించినట్టు కలను కంటుంది. ఆమె ఆకలలో సంతోషంగా ఉంటుంది. ఇది కుటుంబ మానసిక స్థితిని చూపిస్తుంది. వాడు ఈ కుటుంబాన్ని ఎంతలా బాధపెట్టిఉంటాడో ఈ సీన్ చూస్తేనే అర్థమవుతుంది. న్జూంజు, ఒక రబ్బర్ ట్యాపర్‌గా పనిచేస్తూ, తన తండ్రి పాపాల బాధను అనుభవిస్తుంటాడు. గ్రామస్తుల నుండి అవమానాలను ఎదుర్కొంటాడు. ఇట్టి తన భార్య కుట్టియమ్మను, కొడుకు న్జూంజును, కోడలు రోసీని, మనవడు అబెల్‌ను కూడా తిడుతూ, మానసిక హింసతో బాధపెడుతాడు. అతను ఒక స్త్రీతో ఒంటరిగా గడపడానికి కుట్టియమ్మను మోసం చేస్తాడు. ఇది కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టివేస్తుంది.

Read Also : భార్య ఉండగానే మరొక అమ్మాయితో… ట్విస్టుల మీద ట్విస్టులు… ఇది తెలుగు వెబ్ సిరీసే

గ్రామస్తులు ఇట్టి ఆగడాలు భరించలేక అతన్ని చంపాలని ఒక నిర్ణయానికి వస్తారు. కానీ ఇప్పుడు కుటుంబం కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇట్టిని రక్షించాలా లేక అతని మరణాన్ని అనుమతించాలా అనే సందేహంలో పడతారు. ఈ సినిమా ఒక డార్క్ కామెడీగా మొదలై, క్రమంగా రివెంజ్ డ్రామాగా మారుతుంది. ఇట్టి పరిస్థితి చివరికి ఏమవుతుంది ? అతడు ఎలాంటి వేదనకు గురిచేస్తాడు ? ఈ కుటుంబం రివెంజ్ ఎలా రివేంజ్ తీర్చుకుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

Mohanlal: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మోహన్ లాల్ బ్లాక్ బాస్టర్ మూవీ!

Little Hearts OTT: దసరాకు ఓటీటీలోకి ‘లిటిల్‌ హార్ట్స్‌’.. వారికి మేకర్స్‌ స్వీట్‌ వార్నింగ్, ఏమన్నారంటే!

OTT Movie : పెళ్లి చెల్లితో, ఫస్ట్ నైట్ అక్కతో… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్టు … ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా

Big Stories

×