Anasuya: అనసూయ (Anasuya)అంటేనే అందరికీ జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమం గుర్తుకు వస్తుంది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా అనసూయ కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఈమెకు మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా వరుస సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. అయితే ఇటీవల జబర్దస్త్ కార్యక్రమం 12 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో మెగా సెలెబ్రేషన్స్ అంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి పాల్గొన్న కమెడియన్స్, యాంకర్లు, జడ్జిలు కూడా పాల్గొన్నారు.
ఎంతో ఎంకరేజ్ చేశాను..
ఇక ఈ కార్యక్రమానికి నాగబాబు(Nagababu) తిరిగి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందో తెలియజేశారు. అనసూయ మాట్లాడుతూ…”బాబు గారు.. ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నానో తెలుసా? నేను వెళ్లేముందు వద్దు ఆది నాకు కొన్ని.. అన్ని మైక్ లోనే చెప్పేస్తా..నేను నీతో పాటు స్కిట్ చేసి ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్ క్లూజివిటీ యాడ్ అవ్వలేదు అదే నా ఏడుపు” అంటూ అనసూయ మాట్లాడారు.
అమెరికా వెళ్లిన …
అనసూయ ఇలా మాట్లాడటంతో వెంటనే హైపర్ ఆది మాట్లాడుతూ…”ఒరేయ్ నువ్వు అమెరికా వెళ్లిన సరే నీకు లింకులు పంపించాను. అది రా మన మధ్య ఉన్న లింకు ఏమనుకుంటున్నావు రా నువ్వు” అంటూ హైపర్ ఆది మాట్లాడారు .దీంతో వెంటనే అనసూయ ఇదిగో ఇలా మాట్లాడిన అందుకే నేను జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోయాను అంటూ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో చూస్తుంటే హైపర్ ఆది, అనసూయ మధ్య గట్టి వాధనే జరిగిందని స్పష్టమవుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి.
ఇక 12 సంవత్సరాలను ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. నాగబాబు మొదట ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించడంతో తిరిగి ఈయన కూడా జడ్జిగా వచ్చారు. అలాగే ఇంద్రజ కుష్బూ జడ్జెస్ గా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమానికి నాగబాబుతో పాటు యాంకర్ గా వ్యవహరించిన రోజా(Roja) మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు దీంతో ఉద్దేశపూర్వకంగానే ఆమెను ఈ కార్యక్రమానికి దూరం పెట్టారా? లేకపోతే పిలిచిన రాలేదా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. అలాగే సుడిగాలి సుదీర్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం గమనార్హం. ఇక ఈ కార్యక్రమానికి రీఎంట్రీ ఇచ్చిన నాగబాబు ఇదొక ఎపిసోడ్లో మాత్రమే కనిపించబోతున్నారా? లేకపోతే ప్రతి వారం జడ్జిగా ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారా?అనే విషయం తెలియాల్సి ఉంది.
Also Read: Rashmika Mandanna: ఆ ఫీలింగ్ లో తేలిపోతున్న రష్మిక.. ఆగలేక పోతున్నానంటూ పోస్ట్!