Rohit -Gill: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త కుట్రలకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ కి చెప్పకుండానే.. అతని కెప్టెన్సీ తొలగించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి… ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో కూడా అదే తరహాలో వ్యవహరిస్తోంది. ఇటీవల టెస్ట్ కెప్టెన్సీని రోహిత్ శర్మకు సమాచారం ఇవ్వకుండానే…గిల్ కు ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చి మరీ అనంతపని చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇక ఇప్పుడు.. వన్డే క్రికెట్ విషయంలో కూడా అచ్చం అలాగే వ్యవహరిస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ).
రోహిత్ శర్మకు షాక్.. వన్డే కెప్టెన్ గా గిల్?
ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న గిల్ కోసం మరో భారీ నిర్ణయం తీసుకుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. మరో 10 రోజుల్లోనే టీమిండియా వన్డే కెప్టెన్సీ ని కూడా గిల్ కు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి సభ్యులతో కూడా చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ముగియగానే విదేశాలకు వెళ్ళిన రోహిత్ శర్మ కు దీనిపై కొంచెం కూడా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. సమాచారం ఇవ్వకుండానే… గిల్ ను ఫైనల్ చేయాలని మరో కుట్రకు తెరలేపిందట బీసీసీఐ.
శ్రీలంక టూర్ నేపథ్యంలో గిల్ కు బాధ్యతలు?
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ పూర్తికాగానే… శ్రీలంక తో టీమ్ ఇండియా వన్డేలు ఆడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ తిరిగి జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే వాళ్లు ఇద్దరు వచ్చే కంటే ముందు కెప్టెన్గా ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా కొనసాగాలని రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఇప్పటికే t20 లు అలాగే టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చాడు. కనీసం మండే కెప్టెన్ గా అయిన రెండేళ్లు కొనసాగాలని భావిస్తున్నాడు. కానీ అదుర్స్ సినిమాలో లాగా బ్రహ్మానందానికి ఎన్టీఆర్ అన్యాయం చేసినట్లు… రోహిత్ శర్మకు ఇప్పుడు గిల్ గండంగా మారాడు. అతని కారణంగా రోహిత్ శర్మ పదవి పోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ కెప్టెన్సీ తీసేస్తే ఖచ్చితంగా రోహిత్ శర్మ వెంటనే వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తాడని అంటున్నారు. మన టెస్టుల సమయంలో కూడా ఇదే తరహాలో రోహిత్ శర్మ వ్యవహరించాడు.
Also Read: Rohit Sharma – London: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ దంపతులు.. ఇండియాకు గుడ్ బై?
?igsh=aTM4YTB1eHcxNmIz