Rashmika Mandanna: రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కుబేర (Kuberaa)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, మైసా వంటి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకొని ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తనుకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ప్రత్యేకమైనది రాబోతోంది…
ఇకపోతే తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె మరొక వీడియోని షేర్ చేశారు. రష్మిక తరచు తన డైరీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే తాజాగా తన డైరీలోని ఒక పేజీని షేర్ చేశారు ఇందులో భాగంగా.” ఈరోజు నేను కొత్తగా ఒకటి ప్రారంభించామని, ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఆగలేక పోతున్నానని తెలిపారు. మీ గుండె వేగంగా కొట్టుకున్నప్పుడు, మీ చేతులు వణుకుతున్నప్పుడు, మీ బుగ్గలు నవ్వుతూ నొప్పిగా ఉన్నప్పుడు కలిగే అనుభూతి మీకు తెలుసా? అవును నేను ఇప్పుడు అదే అనుభూతి చెందుతున్నానని, ఎందుకంటే చాలా ప్రత్యేకమైనది రాబోతోంది” అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
కొత్త చాప్టర్ ప్రారంభం…
ఇక ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా త్వరలోనే మరొక కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతోంది అంటూ కూడా షేర్ చేయడంతో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రష్మిక అంత పెద్ద గుడ్ న్యూస్ ఏం షేర్ చేయబోతున్నారు? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కొత్త చాప్టర్ ప్రారంభం కావడం అంటే అర్థమేంటి? బహుశా ఈమె పెళ్లి గురించి శుభవార్త చెప్పబోతున్నారా? అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నిశ్చితార్థం (Engagment)చేసుకోబోతున్నారని వార్త కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తరువాత రష్మిక కూడా ఈ పోస్ట్ చేయడంతో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
?igsh=c2Y2dG05bmgxcHly
ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అప్పటినుంచి రిలేషన్ లో ఉన్నప్పటికీ వీరి రిలేషన్ గురించి అధికారకంగా ప్రకటన చేయలేదని తెలుస్తోంది. అయితే ఇద్దరూ రిలేషన్ లో ఉండడమే కాకుండా తరచూ వెకేషన్ లకి వెళ్లడం ఒకే చోట కలిసి కనిపించడంతో వీరి రిలేషన్ కన్ఫర్మ్ అయిందని, ఏ క్షణమైనా గుడ్ న్యూస్ చెప్పవచ్చని అభిమానులు భావించారు. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ చూస్తుంటే మాత్రం త్వరలోనే విజయ్ దేవరకొండతో ప్రేమ పెళ్లి గురించి శుభవార్తను చెప్పబోతున్నారని తెలుస్తోంది. మరి రష్మిక షేర్ చేయబోయే ఆ విషయం ఏంటో తెలియాల్సి ఉంది.
Also Read: Kothappallylo okkappudu : కొత్తపల్లిలో ఒకప్పుడు.. ఓటీటీ డీల్ ఫిక్స్!