E-Paper
Advertisement

4 నెలలుగా సంతోషంగా ఉన్నా.. అనసూయ వీడియో వైరల్!

4 నెలలుగా సంతోషంగా ఉన్నా.. అనసూయ వీడియో వైరల్!
Advertisement

Anasuya: జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా దాదాపు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేసి.. గ్లామర్ తో.. అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న అనసూయ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో మెప్పించిన ఈ చిన్నది.. సినిమాలలో కూడా అవకాశం అందుకొని, అద్భుతమైన పాత్రలతో స్టార్ సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది. రంగస్థలంలో రంగమ్మత్త, పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలతో చెరగని ముద్ర వేసుకున్న అనసూయ.. అటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకుంటుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ విమర్శలకు చుక్కలు చూపిస్తూ తెగ వార్తల్లో నిలుస్తోంది.

సోషల్ మీడియాకి దూరంగా..

అయితే తాను ఏం మాట్లాడినా సరే దానిని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు అంటూ ఒకానొక సమయంలో ఆవేదన కూడా వ్యక్తం చేసింది అనసూయ. ఇదిలా ఉండగా గత నాలుగు నెలలుగా సోషల్ మీడియా అందులోనూ ట్విట్టర్ కి దూరంగా ఉంటున్నాను అంటూ చెప్పిన అనసూయ అందుకు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేస్తూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. “మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. గత నాలుగు నెలలుగా నేను ఎక్స్ ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగించడం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే దానికంటే నేను సంతోషంగా ఉన్నాను” అంటూ ఆమె వీడియో రిలీజ్ చేసింది.

చాలా సంతోషంగా ఉన్నానంటూ కామెంట్..

Advertisement

అనసూయ ఏం మాట్లాడినా సరే దానిని నెగిటివ్ చేస్తూ ఈమెపై అసభ్యకర పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారందరికీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్న అనసూయ.. గత నాలుగు నెలలుగా ఎక్స్ ఫ్లాట్ ఫామ్ కి దూరంగా ఉంటుంది. ఇప్పుడు అదే విషయంపై ఆమె ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నాను అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తోంది అనసూయ.

అనసూయ ప్రస్తుత సినిమాలు..

అనసూయ ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే.. జిమ్ వర్కౌట్స్ తో వీడియోలు షేర్ చేస్తూ నిత్యం యాక్టివ్ గా ఉంటున్న ఈమె అటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ సందడి చేస్తోంది. కొంతకాలంగా ఇటు టీవీ షోలకి కూడా దూరంగా ఉన్న అనసూయ. సినిమాల విషయానికొస్తే.. ఇదివరకే నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు ‘అరి: మై నేమ్ ఈజ్ నో బడీ’ అనే చిత్రంలో కూడా నటించింది. ప్రస్తుతం పుష్ప 3: ది ర్యాంపైజ్ లో మరోసారి దాక్షాయని గా అలరించబోతోంది. ఇప్పటికే విడుదలైన రెండు చిత్రాలతో తన అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్న అనసూయ ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకోబోతోంది.

Advertisement

Related News

ఢీ 21 షో విన్నర్ గా ఆర్నాల్డ్ మునిగల్..ప్రైజ్ మనీ ఎంతంటే?

నర్మద ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఫుల్ హ్యాపీ.. దీపావళి సంబరాలు షురూ..

Podarillu Today Episode : నారాయణ మాటతో మహా ఫుల్ హ్యాపీ.. మాధవ్ ను ఆడుకున్న తమ్ముళ్లు.. పాపం చక్రీ..

Brahmamudi Serial Today Episode November 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులను చంపేందుకు రేఖ వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?  

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ మాటతో అవని షాక్.. పల్లవికి చక్రధర్ వార్నింగ్.. పల్లవి ఎంట్రీ మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు ఎన్ని కష్టాలో.. రోహిణి పై అనుమానం.. బాలు, మీనా మధ్య దూరం..

Big Stories

Advertisement
×