Podarillu Today Episode November 23rd: పని ఉంది సైట్ ఇంజనీర్ మనవరాలు కమ్మలు కొట్టే ఫంక్షన్ అది ఇది అని అబద్ధం చెప్పాడు అన్నయ్య అని చక్రి కన్ఫామ్ చేసుకుంటాడు. ఎలాగైనా సరే అన్నయ్య మనీషా దగ్గరకి వెళ్తున్నాడని అర్థం ఉంది. కచ్చితంగా మనీషా దగ్గరే అన్నయ్య ఉంటాడు అని ఆలోచిస్తూ చక్రి అలాగే కన్నా ఇద్దరూ కూడా మనిష వాళ్ళ ఇంటిదగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అన్నయ్య ఇంకా రాలేదేంటి మనమే తప్పుగా అర్థం చేసుకున్నామా లేదా అన్నయ్య రావడానికి టైం పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అయితే చక్రి మాత్రం అన్నయ్య సైకిల్ మీద వస్తున్నారు కదా.. కాస్త నిదానంగానే వస్తాడు అని అనగానే అప్పుడే మాధవ్ అక్కడ సడన్గా ప్రత్యక్షమవడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మాధవ్ రాగానే సిగ్గు పడిపోతూ మనిషా దగ్గరికి వెళ్తాడు అది చూసినా ఇద్దరు తమ్ముళ్లు కూడా అన్నయ్య ఇంత ముదిరిపోతాడని అస్సలు ఊహించలేదని అనుకుంటారు..
మహాలక్ష్మి చక్రీ అన్న మాటల్ని తలుచుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇక చక్రి తనకు విడాకులు ఇస్తాను అని అనడం తలుచుకొని తను అయోమయంలో ఉండిపోతుంది.. అసలు ఎందుకు చక్రి ఇలా అంటున్నాడు. ఏం జరిగింది నేనంటే ఇష్టం లేదా ఇన్ని రోజులు నేనంటే ఇష్టం అని నా వెనకాల పడ్డాడు కదా.. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు అంటూ ఆలోచిస్తూ ఒకచోట గుంతలోకి బండిని పంపించి కింద పడిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మహాలక్ష్మిని పైకి లేపి ఏమైంది అమ్మ అని అడుగుతున్నా సరే ఏం కాలేదండీ పరవాలేదు నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి ఇంటికి రాగానే నారాయణ చాలా సంతోషంగా తనకి టీ పెట్టి ఇవ్వాలని అనుకుంటాడు. అంతేకాదు మహాలక్ష్మికి చెయ్యికి గాయమైంది అని తెలుసుకున్న నారాయణ తనకి ఎలాగైనా మందు రాయాలని అనుకుంటాడు కానీ మహాలక్ష్మి చిన్న దెబ్బే కదా అని అంటుంది. అయితే మహాలక్ష్మి ఆ మాట అన్నా కూడా నారాయణ మాత్రం పసుపు పెట్టాలని అనుకుంటాడు.
మనిషా, మాధవ్ ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లడం చూసిన చక్రీ వాళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తాడు. మనిషా మాధవ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా అక్కడికి వెళ్లి అక్కడ ఏదైనా ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటారు. అయితే అక్కడ ఆర్డర్లను చూసి ఇవేంటి ఇంత రేట్లు ఉన్నాయి కాఫీ రేట్లు ఇంత ఎక్కువగా ఉన్నాయని మాధవ్ భయపడిపోతాడు. ఇంట్లో కాఫీ తాగిన బాండేది కదా అని మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనిషా మాత్రం ఈ పేర్లు నాకు తెలియలేదు అర్థం కావడం లేదు అని మాధవ్ చెప్పగానే మనీషా నేను చెప్తాను అని తనకు నచ్చిన ఆర్డర్ ని చెప్తుంది. అయితే అన్నిటికన్నా తక్కువ రేటు ఉండడంతో మాధవ్ నువ్వు కూడా నాలాగే సేవ్ చేయాలని ఆలోచిస్తున్నావు అంటూ పొగిడేస్తాడు.. అయితే వీళ్ళిద్దరూ సేవింగ్ గురించి మాట్లాడుకోవడం విన్న చక్రీ ఇద్దరు ఇద్దరే.. వీళ్ళతోపాటు ఇక్కడ ఉంటే నాకు కూడా పిచ్చెక్కి ఎలా ఉంది వీళ్ళు మాట్లాడుకుంటున్నా మాటలను వింటే కచ్చితంగా నేను కూడా సేవింగ్ ఎలా అని ఆలోచన చేస్తానేమో అంటూ చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
చక్రి అలాగే కన్న ఇంటికి రాగానే అక్కడ ఉన్న కేశవ తో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మాధవ్ రాగానే మనిషా తో జరిగిన విషయాన్ని అంత చక్రి ఆల్రెడీ చెప్పేసండడంతో తమ్ముళ్ళందరూ కూడా తనని ఒక ఆట ఆడుకుంటారు. మాధవ్ తనని ఏడిపిస్తున్నారు అని మహాలక్ష్మి మాధవ్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఇక మనిషా తనకి షర్టు గిఫ్ట్ ఇవ్వడంతో కేశవ దాన్ని తీసుకొని ఆడుకుంటాడు మొత్తానికి మాధవ్ మనిషా తో బయటికి వెళ్లాడు అన్న విషయాన్ని బయటకు చెప్పేస్తాడు. ఇక ఇంట్లోని వాళ్లందరూ కూడా మాధవ్ ని ఆడుకుంటూ ఉంటారు ఈ క్రమంలో మహా కి కిందపడి గాయమైందని తెలుసుకొని బాధపడిపోతూ ఉంటారు. మహాలక్ష్మి పై అందరూ చూపిస్తున్న ప్రేమకే ఫిదా అయిపోతారు. నాకు చిన్న గాయమే కదా అయింది మీరందరూ ఎందుకు ఇలా కంగారు పడిపోతున్నారు అని మహాలక్ష్మి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..