Brahmamudi serial today Episode: రాజు శోభనానికి రెడీ అవుతూ భయపడుతుంటే.. ఎందుకు భయపడతావు అల్లుడు ఇలాంటి టైంలోనే నువ్వు ఎంత సుఖంగా ఉండాలో ఆలోచించాలి అంటూ చెప్తుంటే.. రాజు నేను భయపడుతుంది ఆ విషయంలో కాదు మామ.. ఇందు విషయంలో పైకి పదహారణాల తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది కానీ రాక్షసి అవసరం అయితే నన్ను ఉతికి ఆరేస్తుంది అంటూ చెప్తుంటే..
అవును అల్లుడు అనుభవంతో చెప్తున్నాను.. నువ్వు ఆ అమ్మాయి విషయంలో అసలు లొంగొద్దు అంటూ శేషు చెప్తుంటే.. నేను అసలు లొంగను మామ అంటూ రాజు చెప్పగానే.. అందరూ ఇలాగే చెప్తారు అల్లుడు కానీ తరతరాలుగా మన మగజాతి ఇక్కడే లొంగిపోతుంది. అమ్మాయి నవ్వుకో.. ప్రేమకో బెండ్ అయిపోయామో ఇక అంతే.. శోభనం గదిలో మనదే పై చేయి అవ్వాలి. అప్పుడే పెళ్లాలు మన దగ్గర అణుకువగా ఉంటారు.. అంటూ చెప్పగానే.. అలాగే చేస్తాను మామ అని రాజు చెప్పగానే.. చూస్తా నువ్వు మగాడివా..? పెళ్లాం చాటు మొగుడివా ఉదయం చూస్తాను అంటాడు శేషు.
అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా రేఖ, భ్రమరాంబ ఇద్దరూ కలిసి శోభనం రూంలోకి వెళ్తారు. రేఖ కరెంట్ వైర్ తీసుకుని వెళ్లి సన్నటి వైర్‌తో బెడ్ మధ్యలో కరెంట్ షాక్ కొట్టేలా వైర్ అమర్చి స్విచ్ ఆన్ చేసి ఇంకొద్ది సేపట్లో రాజు, ఇందు వచ్చి ఈ బెడ్ మీద పడుకుంటారు. తెల్లారేసరికి సర్గీయ రాజు, ఇందు అవుతారు అంటూ చెప్తుంది. ఇదంతా వర్కవుట్ అవుతుందంటావా రేఖ అని భ్రమరాంబ అడిగితే.. అవుతుందో లేదో నీ మీద ట్రయల్ వేద్దామా..? అంటూ రేఖ అంటే వద్దులే అంటూ భ్రమరాంబ భయంతో బయటకు పరుగెడుతుంది.
రఘువీర్‌తో కలిసి ఇంటికి వచ్చిన ఐశ్వర్యను లక్కీ పైనుంచి గమనిస్తాడు. ఇద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకుంటూ నవ్వుకోవడం చూస్తాడు. ఐశ్వర్య బెడ్ రూంలోకి వెళ్లగానే.. ఏం చేస్తున్నావు ఐషు అంటూ అడిగితే.. ఏంటి కనిపించడం లేదా.? గదిలోకి వస్తున్నాను అంటూ ఐశ్వర్య చెబితే.. ఇక్కడి దాకా ఎలా వచ్చావని అడుగుతున్నాను అంటే.. ఏంటి అనుమానిస్తున్నావా..? అంటుంది ఐశ్వర్య. భార్యను అనుమానించేంత చీప్ కాదు నేను బాధ్యతగా అడుగుతున్నాను అంటూ లక్కీ చెప్పగానే.. తను నా బిజినెస్ పార్ట్‌నర్ ఈ టైంలో డ్రాప్ చేయడానికి వచ్చాడు అని చెబితే.. అతనిని చూస్తూ ట్రాప్ చేసేవాడిలా ఉన్నాడని లక్కీ అంటే ఐశ్వర్య కోపంగా లక్కీని తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఐశ్వర్య తనకు కావాల్సినవి ఇచ్చావా లేదా అన్నట్టుగానే ఉండాలని అంతకన్నా ఎక్కువ చేస్తే తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
శేషు వాచ్ చూసి అల్లుడు టైం అయిపోయింది ఇక వెళ్లు అనగానే.. అయితే పోయేకాలం వచ్చిందన్న మాట అంటే శేషు, రాజును శోభనం గది దగ్గరకు తీసుకెళ్తాడు. ఇందును అపర్ణ, నందు తీసుకెళ్తారు. రూంలోకి వెళ్లిన రాజు డెకరేషన్ చూసి రూం అదిరిపోయింది అంటూ ఎగ్జైట్‌మెంట్ అవుతుంటాడు. ఇందుకు జాగ్రత్తలు చెప్పి రూంలోకి పంపిస్తుంది అపర్ణ. బయట దూరం నుంచి అంతా గమనిస్తుంటారు రేఖ, భ్రమరాంబ. ఇద్దరూ లోపలికి వెళ్లారు ఇక వెంటనే అయ్యేదేదో అయిపోతుంది అంటూ భ్రమరాంబ అడిగితే.. కొద్దిసేపట్లో కేవ్వుమనే కేకలు వినిపిస్తాయి అంటుంది రేఖ.
రూంలో రాజు ఏదేదో ఊహించుకుంటుంటే ఇందు వస్తుంది. ఇందు వచ్చి రాజు కాళ్లు మొక్కినట్టు దీవించమని అడిగినట్టు కలగంటాడు. ఇందు మాత్రం ఏంటి ఏవేవో ఊహించుకుంటున్నావా..? అంటూ పాలు మొత్తం తాగేస్తుంది. దీంతో రాజు షాక్ అవుతాడు. అలిగి ఒక మూలన కూర్చుంటే ఇందుయే స్వీట్స్ తింటుంది. ఇద్దరి మధ్య సాంగ్ వస్తుంది. ఇద్దరి మధ్య శోభనం జరిగిపోతుంది.
కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం శేషు ఎగ్జైంటింగ్‌గా రాజు రూం దగ్గరకు వెళ్తే రూం బయట దుప్పటి కప్పుకుని రేఖ, భ్రమరాంబ పడిపోయి ఉంటారు. వాళ్లను చూసి ఆశ్చర్యపోతాడు. వీళ్లిద్దరూ ఇక్కడు ఉన్నారేంటి.? అని అనుమానంగా చూస్తూ గట్టిగా అరుస్తాడు. రేఖ, భ్రమరాంబ ఉలిక్కి పడి లేస్తారు. ఇందు రావడం చూసి ఇద్దరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.