Intinti Ramayanam Today Episode November 23rd: పల్లవి కేసు గెలిచింది అని తెలుసుకున్న ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు.. నెల రోజులు పల్లవి ఇక్కడే ఉంటుంది అంటే కచ్చితంగా ఇంకేదైనా సమస్యలు తెచ్చి పెడుతుందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు . పల్లవి ఏదో పక్కా ప్లాన్ తో నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనం తన నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. మళ్లీ ఇంట్లో అడుగుపెడితే ఇంకా ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి. అని అందరూ బాధపడిపోతూ భయపడిపోతూ ఉంటారు. కానీ కమల్ మాత్రం మీరు ఏమీ భయపడకండి దాని గురించి మనకు తెలుసు కదా దాని నుంచి దూరంగా ఉండి ఎందుకు ప్రయత్నాలు చేద్దాము అని అనుకుంటారు.
అవని వాళ్ళందరూ కూడా పల్లవి మళ్లీ ఇంట్లోకి వస్తే ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు తను నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తుంది. ఎలాంటి ప్లాన్ చేస్తుంది అని అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు.. అప్పుడే అక్కడికి వచ్చినా శ్రీకర్ మనము ఏ ఆధారాలు చూపించలేకపోయాము కాబట్టి పల్లవి ఏం చేసినా కూడా ఆ జడ్జ్ కరెక్ట్ అని అన్నారు. అయితే మనం ఆధారాలు చూపించాలి అంటే కచ్చితంగా సీసీ కెమెరా పెడితే బాగుంటుంది కదా అని అవని అంటుంది. అయితే అలా చేస్తే మనకే మైనస్ అవుతుంది వదినా ప్రేమక మనం పల్లవితో ఉండము కాబట్టి తనకే అది అనుకూలంగా మారుతుంది కాబట్టి మనము అలాంటి ఆలోచన మానుకోవడం బెటర్ అని శ్రీకర్ అంటాడు ఆ మాటతో అవని షాక్ అవుతుంది. అది కూడా నిజమే కదా శ్రీకర్అని అంటుంది..
అవని దగ్గరకొచ్చిన అక్షయ్ పల్లవి మళ్లీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అంటే ఏదో పక్కా ప్లాన్ ప్రకారం చేస్తుంది అని అర్థమవుతుంది. మరి పల్లవిని ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలి వాటి గురించి ఆలోచించాలి కదా అని అవని దగ్గర అడుగుతాడు. మీ చెల్లెలు మళ్లీ ఇంటికి వస్తుందా నువ్వు సంతోషంగా ఉన్నట్లు ఉన్నావు కానీ పల్లవి వల్ల మళ్ళీ ఈ ఇంట్లో ఎన్ని అనర్ధాలు జరుగుతాయని నాకు భయంగా ఉంది అవని అని అక్షయ్ అంటాడు. అయితే పల్లవి ఎలాగైనా సరే తనని దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి పల్లవిడ్ని ముందే తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయం నువ్వు నాకు సాయం చేయాలని అక్షయ అవనీని అడుగుతాడు. ఇది నా కుటుంబం అండి నేను నా కుటుంబం కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను అని అవని అంటుంది.. అటు రమ్య కమల్ని ప్రేమిస్తున్నానా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఎపిసోడ్కి ఇదే హైలైట్ అవ్వబోతుంది అని అర్థమవుతుంది.
పల్లవి చాలా సంతోషంగా కేసు గెలిచాను అని ఇంటికి వస్తుంది.. చక్రధర్ అలాగే మీనాక్షి ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. కానీ పల్లవి మాత్రం మీ కూతురు ఓడిపోయింది నేను గెలిచాను అని మీరు బాధపడుతున్నారా అని వెటకారంగా మాట్లాడుతుంది. నీకు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇక మీదట నువ్వు బుద్ధిగా ఉంటే నీకు ఆపురం నిలబడుతుంది లేదంటే మాత్రం నువ్వు మళ్ళీ రోడ్డు మీదకు రావాల్సిందే అని చక్రధర్వా ర్నింగ్ ఇస్తాడు.. పల్లవి మాత్రం భరత్ ప్రణతిల మధ్య దూరం పెంచే విధంగా మాట్లాడుతుంది. నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఎలా మార్చుకోరో నాకు బాగా తెలుసు ఆ ఇంట్లో వాళ్లకి ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాను అని అంటుంది..
ఇక తర్వాత రోజు బయట ఏదో బాంబుల సౌండ్ వినిపించడంతో అందరూ కంగారు పడిపోతూ అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ మొత్తం బాంబులు పేలుస్తూ కనిపించడంతో ఏంటబ్బా అని అందరూ చూస్తూ ఉండిపోతారు కానీ ఆ బాంబులం పొగలోంచి పల్లవి అలా నడుచుకుంటూ వస్తుంది. రానున్నావు రాలేను అన్నావు ఎలా ఉంది మన గ్రాండ్ ఎంట్రీ అని పల్లవి అవనితో అంటుంది. పర్ఫామెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ పల్లవి వెటకారంగా మాట్లాడుతుంది. అయితే పల్లవిని అలా చూస్తున్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…