Dhee 21 Winner : మనలో టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్నో షోలు వేదికగా నిలుస్తున్నాయి. అందులో భాగంగానే కామెడీని బేస్ చేసుకుని నవ్వించే సత్తా మీలో ఉంటే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు ఎలా అయితే ఆహ్వానం పలుకుతున్నాయో.. మీలో డాన్స్ చేసే సత్తా ఉంటే అద్భుతంగా డాన్స్ చేసి మెప్పించగలిగితే ఢీ ఫ్లాట్ ఫామ్ కూడా ఎప్పుడు రెడీ గానే ఉంటుంది. అలా ఎంతోమంది డాన్సర్స్ కు ఒక వేదికగా నిలిచిన ఢీ డాన్స్ షో ఎట్టకేలకు 21వ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. డబుల్ ఇంపాక్ట్ పేరిట వచ్చిన ఈ సీజన్ ఎట్టకేలకు కంప్లీట్ అయింది. ఇందులో జానీ మాస్టర్, రెజీనా కసాండ్రా జడ్జెస్ గా వ్యవహరించగా.. టైటిల్ సొంతం చేసుకోవడానికి కంటెస్టెంట్స్ గట్టిగానే పోటీపడ్డారు.
ఎట్టకేలకు ఢీ 21 సీజన్ ముగిసింది. ఆర్నాల్డ్ మునిగల్ (Arnold ) టైటిల్ సొంతం చేసుకున్నారు. తన డాన్స్ తో ఇతర కంటెస్టెంట్లను కూడా వెనక్కు నెట్టి కొరియోగ్రాఫర్ యశ్వంత్ (Yashwanth) మాస్టర్ నేతృత్వంలో ఆర్నాల్డ్ విజేతగా నిలిచారు. ఫైనల్స్ లో కృష్ణ మాస్టర్ మెంటార్ గా వ్యవహరించిన అనుష్క గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఆర్నాల్డ్ తన డాన్స్ మెళుకువలతో గట్టిగానే పోరాడి జడ్జెస్ ను మెప్పించారు. అలా ఢీ 21 టైటిల్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఢీ 21 విజేతగా నిలిచిన ఆర్నాల్డ్ టైటిల్ కప్పుతో పాటు ఇంకేం సొంతం చేసుకున్నారు అనే విషయాలు వైరల్ గా మారాయి. ప్రముఖ ఈటీవీ డైరెక్టర్ సుజయ్ చేతులమీదుగా ఆర్నాల్డ్ ఈ ట్రోఫీని అందుకోవడం గమనార్హం.
ఢీ 21 విజేతగా నిలిచిన ఆర్నాల్డ్ టైటిల్ కప్పుతో పాటు రూ.75 లక్షల ప్రైజ్ మనీ అలాగే బి న్యూ నుంచి రూ.1.50లక్షల విలువైన గృహోపకరణాలను బహుమతిగా అందుకున్నారు. మొత్తానికి అయితే టైటిల్ ట్రోఫీతో పాటు ఊహించని క్యాష్ ప్రైజ్ అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులను సొంతం చేసుకోవడంతో ఆర్నాల్డ్ సంతోషం వ్యక్తం చేశారు.
ట్రోఫీ ని అందించిన అనంతరం డైరెక్టర్ సుజయ్ మాట్లాడుతూ.. “ప్రతిభను ప్రోత్సహించడంలో ఢీ షో ఎప్పుడూ ముందుంటుంది ప్రతిభావంతులను ప్రోత్సహించడమే ఈ షో ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇన్ని సీజన్స్ నుంచి తోడుగా, అండగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇటువంటి అద్భుతంలో భాగమైనందుకు ఇక్కడున్న నా స్నేహితులకు మరొకసారి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ అవకాశం మళ్లీ దక్కితే అదృష్టంగా భావిస్తాను ” అంటూ తెలిపారు.
ఢీ చరిత్రలో 4వసారి టైటిల్ గెలిచిన ఏకైక మాస్టర్ గా యశ్వంత్ మాస్టర్ రికార్డు సృష్టించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న యశ్వంత్ మాస్టర్ ఇప్పుడు ఈ ఢీ 21 కి కూడా విజేతగా నిలవడంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఢీ 21 పూర్తి ఎపిసోడ్స్ ని చూడాలి అనుకుంటే ప్రముఖ తెలుగు ఓటిటి వేదిక ఈటీవీ విన్ లో చూడవచ్చు.
also read: నన్ను క్షమించు.. ఒప్పుకోక తప్పడం లేదు: నభా నటేష్!
ఢీ జూనియర్స్ సీజన్ 8లో తొలిసారి కొరియోగ్రాఫర్ గా టైటిల్ ని అందుకున్నారు యశ్వంత్ మాస్టర్ కంటెస్టెంట్ శివమణితో.. అలాగే సంకేత్ & ప్రియాంక డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఢీ జోడి సీజన్ 9 కి కూడా ట్రోఫీ అందుకున్నారు. అలాగే ఢీ ఛాంపియన్ సీజన్ 12 లో కూడా ట్రోఫీ అందుకున్న యశ్వంత్ మాస్టర్ .. ఇప్పుడు డబుల్ ఇంపాక్ట్ లో కూడా విజేతగా నిలవడం గమనార్హం. అలా 4 సార్లు ట్రోఫీ అందుకున్న ఏకైక మాస్టర్గా యశ్వంత్ మాస్టర్ రికార్డ్ సృష్టించారు.