Rashmi Gautam: బుల్లితెర పై ప్రసారం అవుతున్న షోలలో యాంకర్ గా వ్యవహారిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రష్మి గౌతమ్ యాంకరింగ్ ను అందరూ ఇష్టపడుతుంటారు. ఆమె సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. రష్మి గౌతమ్ 10 ఏళ్లకు పైగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలతో యాంకర్ గా బుల్లితెర ఆడియన్స్ అలరిస్తూ వస్తుంది. మరోవైపు సినిమాలోనూ నటిస్తూ నటిగా నటిస్తూ బిజీగా ఉంది. రష్మీ ఏ షో చేసిన ఆ షోలో తన పై పంచులు పడుతుంటాయి.. కొన్ని సార్లు పాప హర్ట్ అయ్యి షో నుంచి బయటకు కూడా వెళ్ళింది. తాజాగా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఓ షోలో ఆమెకు దారుణమైన అవమానం జరిగింది. అసలేం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం..
షోలో రష్మీకి అవమానం..
బుల్లితెర పై యాంకర్ గా కొనసాగుతున్న రష్మీ గౌతమ్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. జబర్దస్త్ తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ప్రతి ఆదివారం ఈ షో ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తుంది. ఈ షో లో కొత్త వాళ్లు వచ్చి తమ టాలెంట్ ను నిరూపించుకుంటారు. అందులో భాగాంగానే ఈ ఆదివారం ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో కమెడియన్లు ఎవరికి వారే అన్నట్లు తమ పంచులతో అందరినీ కడుపు నవ్విస్తారు. అయితే చివరిలో ఓకొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అతనితో అందరూ సరదాగా ఉంటారు. ముఖ్యంగా ఆది అతనిపై వేసే పంచులు వేస్తాడు. అంతవరకు బాగానే ఉంది కానీ చివరికి అతను రష్మీపై పంచులు వేసే ప్రయత్నం చేస్తాడు.. నువ్వు ఈ షో కి పనికిరావు నువ్వు ఇంకా యాంకరింగ్ కి రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది అని సలహా ఇస్తాడు. అది విన్న రష్మీ షాక్ అవుతుంది. మాట చెప్పడానికి నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఆదివారం ప్రసారం అవుతున్న ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
రష్మీ కెరీర్..
రష్మీ గౌతమ్ ప్రస్తుతం యాంకర్ గా మాత్రం జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కు వర్క్ చేస్తోంది. ఈ పాపులర్ కామెడీ షో చేస్తున్నందుకు గాను ఏకంగా ఒక్కొక్క ఎపిసోడ్ కు రష్మీ గౌతమ్ రూపాయలు 80 వేలు చార్జ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ లెక్కన జబర్దస్త్ కామెడీ షో వారానికి రెండుసార్లు ప్రసారం అవుతుంది. దాంతో రష్మి గౌతమ్ వారానికే 1.6 లక్షల రూపాయలు సంపాదిస్తుందని అర్థమవుతుంది. ఇక నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయలు సంపాదిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా మరోవైపు సినిమాల ద్వారా కూడా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటుంది. ఒక్క సినిమాకి ఐదు నుంచి ఆరు లక్షల రెమ్యూనికేషన్ తీసుకుంటుంది. ఎలా కాదనుకున్నా రష్మీ అన్నీ ఖర్చులకు పోగా నెలకి 4 వరకు గట్టిగానే సంపాదిస్తుందని తెలుస్తుంది.