Aloe Vera Face Pack: ఏప్రిల్ నెల నడుస్తోంది. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సూర్యకాంతి ప్రభావం మన ఆరోగ్యంపైనే కాకుండా చర్మంపై కూడా కనిపిస్తుంది. మండుతున్న ఎండల కారణంగా చర్మం ఇప్పటికే నిర్జీవంగా మారడం ప్రారంభించింది. వడదెబ్బ వల్ల ట్యానింగ్ ఇప్పటికే చాలా మందికి మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ముఖాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే కలబందతో తయారు చేసిన కొన్ని ఫేస్ ప్యాక్ లను ఉపయోగించి చూడండి. కలబందతో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్‌లు మీ ముఖాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. అంతే కాకుండా చర్మాన్ని చల్లబరుస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించే ముందు.. ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. తద్వారా ఎలాంటి అలెర్జీ వచ్చే అవకాశం ఉండదు.
కలబంద, తేనె:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం.ఇందుకోసం 1 టేబుల్ స్పూన్ కలబంద తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ తేనెలో ఇందులో మిక్స్ చేయండి. అనంతరం రెండింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. మిశ్రమం సిద్ధమైన తర్వాత.. దానిని ముఖంపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.దీని నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది.
కలబంద, నిమ్మరసం:
నిమ్మకాయ వల్ల చాలా మంది వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ మాస్క్ తయారు చేయడానికి ముందుగా కలబంద, నిమ్మరసం తగిన మోతాదులో తీసుకుని మిక్స్ చేయండి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. తరచుగా ఇలా చేస్తే.. కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావాన్ని మీరే చూస్తారు.
కలబంద, దోసకాయ:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఇది ముఖానికి చాలా చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని తయారు చేయడానికి ముందుగా దోసకాయ పేస్ట్ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొంచెం అలోవెరా జెల్ కలపండి. రెండు పదార్థాల మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. మీరు త్వరలో దాని ప్రభావాలను చూడటం ప్రారంభిస్తారు.
కలబంద, రోజ్ వాటర్:
రెండింటిలోనూ ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచే అంశాలు ఉంటాయి. మీరు ఈ రెండు పదార్థాలను తగిన మోతాదులో కలిపి కలబంద జెల్ , రోజ్ వాటర్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ మాస్క్‌ను ముఖంపై 20 నిమిషాలు అప్లై చేసి.. తర్వాత ముఖం శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మారడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: లిప్‌స్టిక్ తెగ వాడేస్తున్నారా ? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు !
కలబంద,పెరుగు:
పెరుగులో ఉండే మూలకాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. అందుకే గిన్నెలో కలబంద జెల్ తీసుకొని అందులో కాస్త పెరుగు కలపండి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ ముఖాన్ని ప్రకాశవంతం చేయడమే కాకుండా.. మీ ముఖాన్ని చల్లబరుస్తుంది.