Madhuri Rathod Folk Song:మాధురి రాథోడ్ ..మాధురి రాథోడ్ ..మాధురి రాథోడ్ ..ఈ పేరిపుడు ఒక సెన్సేషన్ .ఫోక్ సాంగ్ ఏదైనా ఈ భామే ఉండాలి అన్నట్టుగా పరిస్థితి ఉందంటే మాధురి జోరు ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.చేస్తున్న ప్రతీ పాట మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నాయి.ఇక ముఖ్యంగా ఈశ్వర్ సాయి ఇష్యూ తర్వాత ఈ అమ్మడు స్పీడ్ మరింత పెంచినట్టే కనిపిస్తుంది.
”గిరుకల బాయి..కీసల రూపాయి”
ఇక ఇదే క్రమంలో మాధురి రాథోడ్ చేసిన మరో పాట ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.రోహిత్ జాక్సన్ తో కలిసి చేసిన ”గిరుకల బాయి..కీసల రూపాయి” అనే పాట వచ్చిన ఒక్క రోజులోనే ఏకంగా వన్ మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది అంటే మాధురి రాథోడ్ పాట కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ పాటని ధర్మ రాథోడ్ నిర్మించగా కుమార్ కోట తనవైన పదాలతో పాటని మరో లెవెల్ కి తీసికెళ్ళాడు.ఇక వరుస ఫోక్ సాంగ్స్ తో నెట్టింటిని షేక్ చేస్తున్న వెంకట్ అజ్మీరా ఈ పాట కి అద్భుతమైన సంగీతాన్ని అందించగా ,ప్రస్తుతం ఫోక్ ఇండస్ట్రీలో శేఖర్ వైరస్ కి గట్టి పోటీ ఇస్తున్న లీడింగ్ బాయ్స్ ఈ కొరియోగ్రఫీ అందించడం విశేషం.
ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎన్నో ఫోక్ సాంగ్స్ ని తమ గొంతులతో సూపర్ హిట్ చేసిన బొడ్డు దిలీప్ కుమార్ ,మమత రమేష్ లు ఈ పాటకి ప్రాణం పోశారనే చెప్పాలి.
ఓవర్ నైట్ లోనే వన్ మిలియన్ వ్యూస్
అయితే అన్నింటికన్నా ముఖ్యంగా. రోహిత్ జాక్సన్ తో కలిసి మాధురి రాథోడ్ వేసిన స్టెప్పులు ,ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ,పాలించిన ఎమోషన్స్ అన్నీ కలిసి పాటని ఆడియన్స్ కి ఈజీగానే కనెక్ట్ చేశాయి.అందుకే ఈ పాట ఓవర్ నైట్ లోనే వన్ మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది.
ఇక పాట అలా విడుదల అయిందో లేదో కామెంట్ల వర్షం కురిపించారు మాధురి ఫ్యాన్స్. ఈ పాట కోసం ఎదురుచూసినంతగా మరే పాటకోసం ఎదురుచూడలేదని కొంత మంది అంటే, పల్లెటూరి అమ్మాయి అయినా ,సిటీ గర్ల్ అయినా అసలు ఏ గెటప్ లోనైనా మాధురి అద్భుతంగా ఒదిగిపోతుందని మరికొందరు ఆకాశానికి ఎత్తేశారు.
మాధురి రాథోడ్ విషయానికి వస్తే
ఇక మరికొందరైతే ఫోక్ సాంగ్ ఏదైనా మాధురి రాథోడ్ మాత్రమే న్యాయం చేస్తుందని,అసలు ఫోక్ డాన్సర్ లలో మాధురి రాథోడ్ ని డీ కొట్టేవాళ్ళే లేరని ఆకాశానికి ఎత్తేయడం విశేషం. ఇక మాధురి రాథోడ్ విషయానికి వస్తే నిమ్మతోట వనంలో ,మంజులో మాట్లాయిపోతా ,సన్న సన్న బియ్యమే ,భామా సుందరాలో ,ఆకుల కూర సీసల కల్లు ,ప్రమీలా ,రాతిరి రాతిరిలో వంటి ఎన్నో పాటలలో నటించి మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.
also read:కనకవ్వ వర్సెస్ నాగవ్వ.. పాటలతోనే పోటీ.. వీరిద్దరిలో టాప్ ఎవరు?
మొత్తానికి ఈశ్వర్ సాయి తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కెరీర్ ని మరింత పరుగులు పెట్టిస్తుంటే ,అటు ఈశ్వర్ సాయి కూడా పోటా పోటీగా వరుస ఫోక్ సాంగ్స్ తో రచ్చ చేయడం విశేషం. చూడాలి మరి మాధురి ముందు ముందు ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తుందో !