E-Paper
Advertisement

కెప్టెన్ అయ్యాక కొమ్ములొచ్చాయా? అమన్ మసూద్ కు క్లాస్ పీకిన నాగార్జున!

కెప్టెన్ అయ్యాక కొమ్ములొచ్చాయా? అమన్ మసూద్ కు క్లాస్ పీకిన నాగార్జున!
Advertisement

Bigg Boss 10 Telugu Day 83 Promo 2 : బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం 12వ వారం పూర్తి కావచ్చింది. ఇక నేడు వీకెండ్ కావడంతో నాగార్జున (Nagarjuna)ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు .తాజాగా రెండవ ప్రోమోని కూడా విడుదల చేశారు. ప్రతి వీకెండ్ నాగార్జున వారం మొత్తం కంటెస్టెంట్లు వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ వారి తప్పు ఒప్పులను గుర్తు చేస్తూ ఉంటారు. ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ వారం కెప్టెన్ గా కొనసాగిన అమన్ మసూద్ (Aman Masood) తీరుపై మండిపడ్డారు.

మబ్బేష్ గబ్బెష్..

ఈ సందర్భంగా నాగార్జున అమన్ మసూద్ గురించి మాట్లాడుతూ విన్నింగ్ హార్స్.. ఏంటి కెప్టెన్ అయిన తర్వాత కొంచెం కంట్రోల్ తప్పిపోయావు. ఒక మనిషి క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందో తెలుసా ఆయన టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్లపైన ఎక్కువ ప్రెజర్ ఉన్నప్పుడే మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది.అమన్ నీకు ఒక వీడియో చూపిస్తాను చూడు అంటూ హౌస్ లో ముఖేష్ (Mukesh)పట్ల అమన్ మసూద్ వ్యవహరించిన తీరుకు సంబంధించి ఒక వీడియో ప్లే చేశారు. ఇందులో ముఖేష్ ను మబ్బేష్ గబ్బెష్ అంటూ అమన్ మాట్లాడటంతో నాగార్జున ఏంటి ఈ గబ్బు అంటూ మండిపడ్డారు .

కెప్టెన్ అంటే పవర్ కాదు బాధ్యత…

Advertisement

పాలు కొంచెం కింద పడిపోవడంతో ముఖేష్ వచ్చి నీకు బ్రెయిన్ లేదు అంటూ మాట్లాడారు నేనేం చెప్పినా ఆయన వినరు ప్రతిదానికి ఈగో చూపిస్తారు అంటూ అమన్ మసూద్ నాగార్జునకు సమాధానం చెప్పారు. కెప్టెన్ అంటే పవర్ కాదు అదొక బాధ్యత అని నాగార్జున తెలిపారు. ముఖేష్ ఒక స్టార్.. అలాంటి వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలిసి ఉండాలని నాగార్జున తెలిపారు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వే తగ్గేది అంటూ నాగార్జున తెలిపారు.

Advertisement

ఇకపోతే ముఖేష్ తో కూడా నాగార్జున మాట్లాడుతూ.. నువ్వు ఒక స్టార్ నీకు స్టార్డం ఉంది కానీ నువ్వు చేసే పనులు నీ విలువను తగ్గిస్తున్నాయి అంటూ ఒక వీడియో ప్లే చేశారు. హౌస్ మేట్స్ అందరూ ఆరేసిన బట్టలు తీసుకెళ్లి ముఖేష్ పడేసిన ఒక వీడియో నాగార్జున ప్లే చేశారు. ఈ వీడియో చూపించిన అనంతరం నిన్ను చాలా మంది ఇష్టపడేవారు ఉన్నారు కానీ నువ్వు చేసే ఇలాంటి పనుల వల్ల నీపై ఇష్టం తగ్గుతుంది అని నాగార్జున ముఖేష్ గురించి పలు సూచనలు చేశారు. ఇలా ఈవారం ప్రతి ఒక్క కంటెస్టెంట్ చేసిన తప్పులను ఈయన గుర్తు చేస్తూ తనదైన శైలిలోనే కంటెస్టెంట్లకు చురకలు వేశారు. ఇక 12వ వారం పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఈ వారం హౌసింగ్ చేయవ ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై ఉత్కంఠత నెలకొంది అయితే డేంజర్ పొజిషన్లో వంశీ, వర్షిని, ఆర్కె ఉన్నారు ఈ ముగ్గురిలో ఎవరు బయటకు వెళ్తారో తెలియాల్సి ఉంది.

Also Read: నీది చీప్ క్యారెక్టర్.. క్షమాపణ చెప్పాల్సిందే..వర్షిణి, త్రిగుణ్ పై నాగ్ సీరియస్!

Related News

రాము రాథోడ్, లిఖిత కాంబోలో టాప్ 5 సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్!

నీది చీప్ క్యారెక్టర్.. క్షమాపణ చెప్పాల్సిందే..వర్షిణి, త్రిగుణ్ పై నాగ్ సీరియస్!

నలుగురు దర్శకులు రిజెక్ట్.. నెట్టింట ట్రెండింగ్ లో నిలిచిన ‘కొయిల’ సాంగ్..

చెయ్యి చేసుకోబోయిన రోహిత్.. షో నుంచి వెళ్లిపోయిన మిథిలేష్!

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ బయట పెట్టిన ఝాన్సీ… ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే?

ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్.. మాధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ !

చిన్మయితో రాహుల్ మూవీ.. టైటిల్ చెప్పేసిన అడివి శేష్!

Big Stories

Advertisement
×