Bigg Boss 10 Telugu Day 83 Promo 1: బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం 12వ వారం పూర్తి కావచ్చింది. ఇక నేడు వీకెండ్ కావడంతో నాగార్జున (Nagarjuna)ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా 83వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున వేదిక పైకి వస్తూనే కంటెస్టెంట్ వర్షిణి(varshini)ను కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని పిలిచారు. ఇలా కన్ఫెషన్ రూమ్‌లో వెళ్లిన వర్షిణిను నాగార్జున ప్రశ్నిస్తూ అసలు ఈ వారం నీకేమైంది? అంటూ ప్రశ్నలు వేయడంతో వర్షిని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
హౌస్ మొత్తం ఒకవైపు ఉండిపోయారు 9 మంది ఒకవైపు ఇద్దరు ఒకవైపు అనే విధంగా, ఇద్దరినీ టార్గెట్ చేస్తున్నారని వర్షిణి తెలిపారు. హౌస్ లో మాకు సపోర్ట్ లేదు. ఏ విషయంలో నీకు అలా జరిగింది అంటూ నాగార్జున ప్రశ్నించడంతో క్యారెక్టర్ విషయంలో అని వర్షిణి తెలిపారు. ఏమన్నాడు తను అంటూ నాగార్జున మళ్ళీ ప్రశ్నించగా వర్షిణి ఏకధాటిగా ఏడుస్తూ.. తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారని, మొహం మీదకు వస్తూ నీది చీప్ క్యారెక్టర్ అంటూ మాట్లాడారు సర్ అని వర్షిణి ఎమోషనల్ అయ్యారు.
ఏ ఉద్దేశంతో నిన్ను త్రిగుణ్(Trigun) అన్నాడని నాగార్జున ప్రశ్నించడంతో తనకు తెలియదని సమాధానం ఇవ్వగా, వెంటనే ఆ గొడవకు సంబంధించిన వీడియోని నాగార్జున ప్లే చేశారు. నామినేషన్ సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో త్రిగుణ్ మాట్లాడుతూ చీప్ క్యారెక్టర్ అని తెలిపారు. అయితే త్రిగుణ్ ఫ్రెండ్ షిప్ ను వ్యాల్యూ చేయని చీప్ క్యారెక్టర్ నీది అంటూ క్లియర్ గా చెప్పడంతో నాగార్జున కూడా త్రిగుణ్ కి మద్దతుగా నిలిచారు. అదేవిధంగా త్రిగుణ్ ఫ్రెండ్షిప్ విషయంలోనే తనని అలా మాట్లాడినట్టు క్లారిటీ కూడా ఇచ్చిన వీడియోని నాగార్జున ఈ సందర్భంగా ప్లే చేశారు.
ఈ వీడియో చూపించి నాగార్జున నువ్వు అడిగిన వెంటనే త్రిగుణ్ నీకు వివరించారు అసలు నీ మైండ్ లో ఏమి రన్ అవుతుంది. అదేవిధంగా త్రిగుణ్ ను కూడా నాగార్జున కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించారు. ఫ్రెండ్షిప్ గురించి విలువ ఇవ్వట్లేదని తన గురించి నువ్వు అనుకున్న విధంగానే, తను కూడా అచ్చం అలాగే అనుకొని ఉండొచ్చు కదా నీ దగ్గర నుంచి మనస్ఫూర్తిగా నాకు క్షమాపణలు కావాలి అంటూ నాగార్జున త్రిగుణ్, వర్షిణి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. మరి ఈ వివాదం గురించి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి.
Also Read: అవకాశాలు వస్తున్న రిజెక్ట్ చేస్తున్న సుధాకర్.. అసలు కారణం బయట పెట్టిన కొడుకు!