Bigg Boss 10 Apoorva: బిగ్ బాస్ సీజన్ 10 ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తవగా.. మూడవ వారం కూడా తుది దశకు చేరుకుంది. మొదటి వారంలో భాగంగా చైత్ర ఎలిమినేట్ కాగా , రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొంది. గతవారం ఎలిమినేషన్ దిశగా అడుగులు వేసిన సృష్టి , సుధీర్ లలో.. సృష్టి ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకోగా.. సుధీర్ ఏకంగా ఈ వారం టాప్ వన్ లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇకపోతే నిన్నటి ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ కి ఫుల్లుగా తిండిపెట్టి సడన్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగానే మిథిలేష్ రెడ్డి , అపూర్వ, నవరసాల రామకృష్ణ అగ్నిపరీక్ష సీజన్ 2 లో 15 మందిలో ముగ్గురిగా ఎంపికైన వీరు.. ముగ్గురు హౌస్ లోకి వస్తారనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా ఈ ముగ్గురిని హౌస్ లోకి తీసుకొచ్చారు. హౌస్ లోకి అడుగు పెట్టగానే ముఖేష్, రామ్ ప్రసాద్ ల ఆట తీరును ఎండగడుతూ చేసిన కామెంట్లు షోపై రక్తి కట్టించాయి. ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం కల్పించాలి అనుకుంటున్నారో మీ ఓటు వేసి చెప్పండి అని బిగ్ బాస్ అడగగా.. తమకు నచ్చిన వారి కోసం కంటెస్టెంట్లు ఓట్లు వేశారు. కానీ బిగ్ బాస్ వీరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
బిగ్ బాస్ మాట్లాడుతూ.. మీరు ఎవరైతే తక్కువ ఓట్లు వేసి వారిని హౌస్ లోకి రానివ్వకూడదు అనుకున్నారో.. వారినే హౌస్ లోకి పంపిస్తూ.. మీకు టెన్షన్ ఇవ్వబోతున్నాను అంటూ బిగ్ బాస్ చెప్పారు. అలా అపూర్వ హౌస్ లోకి రావడం ఇష్టం లేదని ప్రవర్తించిన వారికి ట్విస్ట్ ఇస్తూ..అసలు టెన్షన్ పెట్టేశారు బిగ్ బాస్.
అపూర్వకు ఇంట్లోకి రావడానికి బిగ్ బాస్ హౌస్ డోర్స్ ఓపెన్ అవ్వగానే.. యాంకర్ గా తన టాలెంట్ ను అగ్నిపరీక్ష సీజన్ 2 లో చూపించిన అపూర్వ.. ఇక్కడ కూడా చూపించడానికి సిద్ధం అయిపోయింది.. అందులో భాగంగానే యువర్ క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ తన ఎంట్రీని ప్రకటించేసింది.
also read: ది ప్యారడైజ్’ చిత్రంలో నాని తల్లిగా నటించింది ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
అగ్ని పరీక్ష సీజన్ 2 లో రోహిత్ – అపూర్వ జంట చాలా బాగుంది అని ఆడియన్స్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అపూర్వ హౌస్ లోకి అడుగుపెట్టగానే.. రోహిత్ ముఖం థౌసండ్ వోల్ట్స్ బల్బులా వెలిగిపోయింది. ఇల్లు చూపించండి అని అపూర్వ అడగగానే.. రోహిత్ రారా అంటూ అక్కడున్న కంటెస్టెంట్స్ పిలవగానే.. రోహిత్ చాలా సంతోషంగా వచ్చేశారు. ఇక ముఖేష్ మాట్లాడుతూ.. నేను, అగ్ని పరీక్షలో మీ సాంగ్ చూడలేదు.. ఆ సాంగ్ నేను చూడాలి.. అంటూ చెప్పగానే రోహిత్, అపూర్వ “ఈ వర్షం సాక్షిగా” అనే పాటకు అందంగా స్టెప్పులేసి.. ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. మొత్తానికి అయితే ఈ జంటను చూడగానే మరో కొత్త లవ్ ట్రాక్ షురూ అయింది అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.