Ashu Reddy:అషు రెడ్డి….పెద్దగా సినిమాలు చేయకున్నప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ జూనియర్ సామ్ సోషల్ మీడియాలో మాత్రం కిక్కెక్కించే అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులని పిచ్చెక్కించేస్తుంది.ఇదిగో తాజాగా ఈ క్రమంలోనే “Just a casual day out!” అంటూ అషు రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
“జస్ట్ క్యాజువల్ డే అవుట్”
ఈ ఫొటోల్లో ఒక నది ఒడ్డున ప్రకృతి అందాల మధ్య నిల్చొని కెమెరాకు అషు ఇచ్చిన పోజ్ అదిరిందనే చెప్పాలి.ఇందులో బ్లాక్ అండ్ ఫ్లోరల్ డిజైన్‌తో ఉన్న స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో అషు ని ఫిదా అయిపోతున్నారు ఫాలోవర్స్. ముఖ్యంగా తన జుట్టును ఒక చేత్తో సెట్ చేసుకుంటూ ఇచ్చిన పోజ్, కెమెరా వైపు చూసిన ఎక్స్‌ప్రెషన్ సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. ఇక ఫోటోకి చాలా సింపుల్ గా “జస్ట్ క్యాజువల్ డే అవుట్” అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ వదిలింది.
‘చల్ మోహన్ రంగా’తో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ
అషు రెడ్డి విషయానికి వస్తే ఈ భామ తెలుగు ఆడియన్స్ కి కొత్తేమీ కాదు. సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక సినిమాల విషయానికి వస్తే అషు రెడ్డి తొలిసారిగా ‘చల్ మోహన్ రంగా’తో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. నితిన్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించడం విశేషం.
కామెంట్ల వర్షం కురిపిస్తున్న ఫాలోవర్స్
ఇక ఆ తర్వాత ‘PK’, ‘ఫోకస్’, ‘స్పార్క్: L.I.F.E.’ ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’, ‘యేవమ్’, ‘పద్మవ్యూహంలో చక్రధారి’ వంటి సినిమలాతో ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాలు పెద్దగా చెప్పుకునేలా లేకున్నా గానీ సోషల్ మీడియాలో మాత్రం అషు రెడ్డి సందడి మాత్రం మాములుగా ఉండదు.
ముఖ్యంగా తన ఫ్యాషన్ ఫొటోలు, ట్రావెల్ మూమెంట్స్, డైలీ లైఫ్‌కు సంబంధించిన పోస్టులతో ఫాలోవర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఈ సరస్సు ఒడ్డున ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్ ఇంస్టాలో షేర్ చేయగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.
also read :బ్లడ్ అమ్ముకుని సంపాదించాల్సిన ఖర్మ నాకేంటి? చిరు షాకింగ్ కామెంట్స్!
మొత్తానికి సినిమా షూటింగ్‌లు, టీవీ కార్యక్రమాలు, సోషల్ మీడియా అప్డేట్స్ అంటూ బిజీగా ఉండే అషు రెడ్డి.. ఈసారి మాత్రం ఎలాంటి స్పెషల్ అనౌన్స్‌మెంట్ లేకుండానే తన స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయడం విశేషం.