Chiranjeevi Blood Bank:చేసిన సినిమాలతోనే కాకుండా చేస్తున్న సేవా కార్యక్రమాలతో మెగాస్టార్ చిరంజీవి దేశవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికి తెల్సిందే,ముఖ్యంగా చిరు పెట్టిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా రక్తదానం జరిగి ప్రాణాలు నిలబడ్డాయి కూడా.అయితే ఇదే బ్లడ్ బ్యాంక్ పై ఎన్నో రకాల ఆరోపణలు ఎప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.ముఖ్యంగా చిరంజీవి ఎంతో మంది దగ్గర బ్లడ్ తీసుకుని ,దానిని హాస్పటల్స్ కి అమ్ముకున్నారు అంటూ ఇబ్బడి ముబ్బడిగా వార్తలు వచ్చాయి కూడా.
రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బు ఏ పాటిది
అయితే తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న చిరు తనపై వస్తున్న విమర్శలకి కౌంటర్ ఇచ్చారు.తనని ఎంతో మంది బ్లడ్ అమ్ముకుంటున్నాను అంటూ విమర్శలు చేస్తుంటారు.అసలు నాకొచ్చే రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బు ఏ పాటిది.అంత డబ్బు రావాలంటే నేను ఎన్ని కోట్ల బ్లడ్ ప్యాకెట్లు అమ్ముకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చారు.అయినా ఒక మంచి లక్ష్యంతో పెట్టిన ఆ బ్లడ్ బ్యాంక్ పై ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోనని ,ఇలాంటి అపనిందలు,అవమానాలు చాలా చూశానని తేల్చి చెప్పారు.
కష్టాన్ని మాత్రమే నముతా
ఇక తాను అదృష్టాన్ని అసలు నమ్మనని,కేవలం కష్టాన్ని మాత్రమే నముతానని చెప్పుకొచ్చారు.కష్టపడుతుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని, వచ్చిన వాటిని సరిగ్గా ఆలింగనం చేసుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలని సాధించవచ్చు అని తెలిపారు.
ఇక మన వాళ్ళు ఎంతో మంది ఇంటర్ నేషనల్ వైడ్ గా ఎదిగారని, సత్య నాదెళ్ళ, సుందర్ పిచయ్ వంటి వాళ్ళు అంతా మన పక్క జిల్లాలు ,రాష్ట్రాల నుండే వచ్చారని, కాబట్టి ఏదీ అసాధ్యం అనుకోకండా కష్టపడి ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆకాంక్షించారు !
సినిమాల విషయానికి వస్తే
మొత్తానికి బ్లడ్ అమ్ముకుంటున్నాడు అంటూ వస్తున్న ఆరోపణలకి చిరు ఇలా ఎండ్ కార్డ్ వేశారన్న మాట. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే తన సినిమాలలో కూడా మంచి మెసేజ్ లు ఇవ్వడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు చిరు.అలా ‘స్టాలిన్’ సినిమాలో ఇతరులకు సహాయం చేయాలని, ఠాగూర్’ సినిమాలో సమాజంలో జరుగుతున్న అవినీతికి అడ్డు కట్ట వేయాలని ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో మనుషుల మధ్య ప్రేమ, మానవత్వాన్ని చూపించడం మనం చూశాం కూడా.
ప్రత్యర్ధుల నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో
ఇక చిరు కెరీర్ విషయానికి వస్తే . ‘ఖైదీ’ నుంచి ‘ఇంద్ర’, ‘ఠాగూర్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘స్టాలిన్’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్‌ఫాదర్’వాల్తేరు వీరయ్య ,మన శంకర వరప్రసాద్ అంటూ ఎన్నో సరికొత్త సినిమాలతో ఆడియన్స్ ని అలరించిన చిరు ఇపుడు కాకా అంటూ మరోసారి ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు.చూడాలి మరి చిరు ఇచ్చిన సాలిడ్ రిప్లయ్ కి ప్రత్యర్ధుల నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో !
also read :నాని ‘ది ప్యారడైజ్’కు రూ.200 కోట్ల టార్గెట్.. సినిమా ఏం చేస్తుందో?