Bandi Rajayya Folk Song:పల్లెటూర్లకే పరిమితమైన జానపదాలు ఇపుడు ప్రపంచాన్ని ఏలుతున్నాయి.ముఖ్యంగా కోట్లాది మంది తెలుగు మ్యూజిక్ లవర్స్ ని తమవైన బీట్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాయి.దీంతో ఈ మధ్య కాలంలో ఇబ్బడి ముబ్బడిగా ఫోక్ సాంగ్స్ నెట్టింట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి.
అయితే వీటిలో చాలా వరకు కూడా ఆడియన్స్ ని అలరిస్తున్నవే.ఇక ఆ క్రమంలోనే తాజాగా మరో ఫోక్ సాంగ్ తో అలరించేందుకు రెడీ అయింది మాధురి రాథోడ్. బండి రాజయ్య అంటూ వస్తున్న ఈ పాటకి సంభందించిన ప్రోమో తాజాగా నెట్టింట్లోకి వచ్చేయగా చూసి మురిసిపోతున్నారు ఫోక్ లవర్స్.
మధు ప్రియ,జంగిరెడ్డి కలిసి పాడిన బండి రాజయ్య
ఇక కేవలం ప్రోమో తో ఆడియన్స్ హార్ట్ ని గ్రాబ్ చేసిన ఈ పాటని మధు ప్రియ,జంగిరెడ్డి కలిసి పాడటం విశేషం. జంగి రెడ్డి అంటే ఆయాషేర్ ,ధూమ్ ధాం దోస్తాన్ , ఏష నాగుల కట్ట మీద అనే పాటలతో అందరిని ఒక ఊపు ఊపిన ఫోక్ సింగరే ఈయన.ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసినప్పటికీ ఈ పాటలు ఇప్పటికీ ప్రతీ చోట మారుమ్రోగిపోతున్నాయంటే జంగిరెడ్డి గాత్రం ఆడియన్స్ ని ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్థమవుతుంది.
ఇక జంగి రెడ్డితో కలిసి పాడిన మధుప్రియ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఆడపిల్లనమ్మా అంటూ కెరీర్ మొదలెట్టిన మధుప్రియ ఇప్పటికి ఎన్నో పాటలు పాడి ఆడియన్స్ ని అలరించింది.ఈ మధ్యనే మామిడి కోనాల మీద అనే పాటతో నాగవ్వ తో కలిసి సోషల్ మీడియాని షేక్ చేసింది కూడా. ఇక వచ్చిండే, హి ఈజ్ సో క్యూట్ అంటూ ఎన్నో సినిమాల పాటల్ని కూడా తన గొంతులో పలికించింది.
పాట విషయానికి వస్తే
ఇక పాట విషయానికి వస్తే ఈ మధ్య తనవైన లిరిక్స్ తో సోషల్ మీడియాలో వారిల్ అవుతున్న తిరుపతి సాహో ఈ పాటకి లిరిక్స్ అందించగా దాసరపు కుమార్ చేసిన ట్యూన్ ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది.అయితే ఈ పాట లిరిక్స్ కొత్తవైనప్పటికి ట్యూన్ మనం గతంలో విన్న ట్యూనే కావడంతో ఇంకా ఈజీగా కనెక్ట్ అయిపోతున్నాం.
ఇకపోతే ఈ పాటకి వరుస మ్యూజిక్ హిట్స్ తో ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వెంకట్ అజ్మీరా మ్యూజిక్ అందించగా,తనవైన స్టెప్పులతో సాలిడ్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న శేఖర్ వైరస్ ఈ పాటకి కోరియోగ్రఫీ చేయడం కలిసివచ్చింది.
ఇక ఈ పాటలో కార్తీక్ రెడ్డితో కలిసి అదరగొట్టిన మాధురి రాథోడ్ గురించి కూడా స్పెషల్ గా చెప్పర్లేదు.ఈశ్వర్ సాయి ఇష్యూ తర్వాత ఈ భామ ఫోక్ ఇండస్ట్రీలో వరుస సాంగ్స్ తో మరింత దూసుకుపోతున్నట్టే కనిపిస్తుంది.
ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !
భామ సుందరాలో , బిందెలు బిందెలు బావయ్యో, ఆకుల కూర , సీసల కల్లు, మంజుల ,గిరుకల బాయి ..అంటూ ఎన్నో జనపదాలతో ఆడియన్స్ కి మరింతగా దగ్గరైపోయింది.మాములుగా ఎవరైనా వివాదాలు చుట్టు ముడితే డీలా పడిపోతారు.కానీ మాధురి మాత్రం మరింత దూసుకుపోతుండటం విశేషం.చూడాలి మరి ప్రోమోతోనే మంటలు పెట్టిన ఈ పాట ఫుల్ గా వస్తే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !