E-Paper
Advertisement

దెబ్జానీను చూస్తుంటే కంపరమేస్తోంది.. నీకంటే అతనే బెటర్ అంటూ ఆదిరెడ్డి ఫైర్!

దెబ్జానీను చూస్తుంటే కంపరమేస్తోంది.. నీకంటే అతనే బెటర్ అంటూ ఆదిరెడ్డి ఫైర్!
Advertisement

Bigg boss 10: తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ అటు టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోతోంది బిగ్ బాస్. ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో పదవ సీజన్లో 8 వారాలు పూర్తిచేసుకుని, తొమ్మిదవ వారం చివరి దశకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా దశావతారం పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీజన్ 10.. ఒకవైపు కొంతమంది చేత పొగడ్తలు అందుకుంటుంటే.. మరి కొంతమంది చేత విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గొడవలు పడడం, ఒకరిపై ఒకరు అరుచుకోవడం, ఏకంగా మానవత్వం మరిచిపోయి కొట్టేవరకు వెళ్లడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇకపోతే ఇందులో ప్రత్యేకించి దేబ్జానీ గురించి చెప్పుకోవాలి.

దెబ్జానీపై ఒక రేంజ్ లో ఫైర్ అయిన ఆదిరెడ్డి..

ఇప్పటివరకు విడుదల చేసిన ప్రోమోలలో అందరూ ఈమె మంచిదని , అనవసరంగా ముఖేష్ ఈమెపై పెత్తనం చెలాయిస్తున్నాడు అంటూ కామెంట్లు చేశారు. కానీ తాజాగా విడుదల చేసిన ఫ్యామిలీ ఎపిసోడ్ లో దేబ్జానీ అసలు రంగు బయటపడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బయటకి క్యూట్ గా కనిపించే ఈమె లోపల ఇంత కుట్ర, కుతంత్రం, విషం దాగివుందా? అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఒకప్పటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ , ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూయర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆదిరెడ్డి కూడా దెబ్జానీ ని చూస్తుంటే కంపర మేస్తోంది అంటూ విడుదల చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నీకసలు జాలి మనసే లేదా?

Advertisement

ఆదిరెడ్డి మాట్లాడుతూ.. దెబ్జానీని చూసిన తర్వాత తొలిసారి నాకు కంపర మేసింది. ముఖ్యంగా ఏంట్రా ఈమె ఇలా ఉంది అనిపించింది.. ఈ సీజన్లో ఈ ఎనిమిది వారాలను అటుంచితే.. ముఖ్యంగా ఫ్యామిలీ ఎపిసోడ్లో ముఖేష్ తో ఈమె ప్రవర్తించిన తీరు చూశాక నిజంగా నాకు ఈమెపై పట్టరాని కోపం వస్తోంది. ఈ సీజన్లో చాలాసార్లు అవతలి వాళ్ళు బాధపడుతున్న ప్రతిసారి.. ఆ అమ్మాయి వ్యంగ్యంగా నవ్వుతూ నిలబడుతుంటే నిజంగా చిరాకు వేసింది. అయితే లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రతి కంటెంట్ రివేంజ్ తీర్చుకోవడానికి ఒక కంటెస్టెంట్ పేరు రాయాలి. ఎవరైతే రాశామో ..రాసిన వ్యక్తి.. గెలిచిన వ్యక్తి ఎవరిదైతే అక్కడ రాసామో వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రారు. ఇది ఓకే అందరూ రాశారు తప్పుకాదు.

నిన్ను చూస్తుంటే కంపరమేస్తోంది..

కానీ ముఖేష్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అక్కకి బ్రెస్ట్ క్యాన్సర్, వాళ్ల నాన్నకి పక్షవాతం అని చెప్పి బాధపడడమే కాకుండా త్రిగుణ్ తో పాటు దెబ్జానీకి వీళ్ళందరికీ చెప్పి.. ఒకవేళ మీరు నా పేరు రాసి ఉండుంటే.మీ తీసేయండి అని రిక్వెస్ట్ చేశాడు. దీనికి త్రిగుణ్ నీ మీద కోపం ఉండొచ్చు కానీ ఇలాంటి వాటిపైన కోపం తీర్చుకునే అంత వెధవని నేను కాదు అని ముఖేష్ పేరును తీసేశాడు. కానీ దెబ్జానీ చేసిన అత్యంత చెత్త పని ఏమిటంటే.. ముఖేష్ పేరు రాసింది. తర్వాత తాను వచ్చి చెప్పాడు. టాస్క్ స్టార్టింగ్ ముందు కూడా రిక్వెస్ట్ చేశాడు. సరే అని చెప్పింది . ఆ తర్వాత కూడా బిగ్ బాస్ పేర్లు మార్చాలి అనుకుంటే మార్చండి అని చెప్పాడు. కానీ ముఖేష్ అడిగాడు కాబట్టి పేరు మార్చబోతున్నాను అన్నట్టుగా వెళ్లి.. స్ట్రైక్ చేస్తున్నట్టుగా నటించి, మళ్లీ వేరే పేరు రాసినట్టుగా ఆక్ట్ చేసి అదే పేరు ఉంచి.. ఆమె టాస్క్ గెలిచి.. ముఖేష్ ఫ్యామిలీ ఫోటో రాకుండా షెడ్డర్ లో వేసి.. ముకేశ్ తో మాట్లాడిన తీరు చూస్తుంటే.. నిజంగా నాకు ఒళ్లంతా కంపరం పుట్టింది.

దెబ్జానీ నీకసలు బుద్ధుందా..

Advertisement

అంతా ఓకే కానీ చివరిలో నువ్వు పాము, నక్క అన్న మాటలు నేను తీసుకోలేకపోయాను.. మనిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నేనే రోజు నిన్ను అనలేదు అని చెప్పింది. కానీ మీరు నిన్నటి ఎపిసోడ్లో కదా బెంగాలీ భాషలో అనరాని మాటలన్నీ ముఖేష్ ను అన్నారు. కాస్తైనా మీకు బుద్ధి ఉండాలి అంటూ ఒక రేంజ్ లో మండిపడ్డారు. మొత్తానికైతే దెబ్జానీ ప్రవర్తనపై అందరికీ అసహ్యం వేస్తోందనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==

Related News

కసి చూపులతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న ఇనయా.. బాపురే కష్టమే..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటకు నర్మదా షాక్.. అయ్యో పాపం ధీరజ్.. వల్లి చనిపోతుందా..?

Podarillu Today Episode : మనీష కిడ్నాప్.. రౌడీలను చితక్కొట్టిన మాధవ్.. కేశవకు షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లోంచి వెళ్లిపోయిన పార్థు  

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? ప్రభా బుట్టలో పడింది.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode November 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు విషయంలో ఐశ్వర్య సక్సెస్ అవుతుందా..?   

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. భరత్ మాటతో షాక్.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Big Stories

Advertisement
×